India Men And Women Cricket Team Awards 2026: ప్రస్తుతం టీమిండియాకు క్రికెట్లో స్వర్ణ యుగం నడుస్తోంది అని చెప్పవచ్చు. 2024 నుంచి టీమిండియా మహిళలు, పురుషులు ఐసిసి టోర్నీలలో దుమ్ము రేపు తున్నారు. 2023 వన్డే వరల్డ్ కప్ ఓటమి తర్వాత, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ లో ఓడిపోయిన అనంతరం భారత పురుషుల క్రికెట్ జట్టు అట తీరును (టెస్ట్ క్రికెట్లో ఆకట్టుకోవడం లేదు) పూర్తిగా మార్చేసుకుంది.. 2024 లో జరిగిన టి20 వరల్డ్ కప్, 2025లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ, 2025లో జరిగిన ఆసియా క, 2026 లో జరిగిన టి20 వరల్డ్ కప్.. ఇలా అన్ని మేజర్ టోర్నీలను భారత పురుషుల క్రికెట్ జట్టు దక్కించుకుంది.
Also Read: రేవంత్ రెడ్డి మూడు ముక్కలాట..!
ఇక మహిళల విషయానికొస్తే అందని ద్రాక్ష లాగా ఉన్న మహిళల వన్డే వరల్డ్ కప్ ను హర్మన్ ప్రీత్ కౌర్ ఆధ్వర్యంలోని భారత జట్టు సొంతం చేసుకుంది. సెమీఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియాను ఓడించింది. ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికాను మట్టి కరిపించింది. తద్వారా తొలిసారి మహిళల క్రికెట్ వరల్డ్ కప్ అందుకున్న రికార్డు సృష్టించింది. స్వదేశంలో జరిగిన ఈ టోర్నీలో మొదట్లో టీమ్ ఇండియా తడబడింది. ఆ తర్వాత ఒక్కసారిగా గేర్ మార్చింది. ఆటతీరులో సరికొత్త అధ్యాయాలను సృష్టించింది. దీంతో వన్డే వరల్డ్ కప్ గెలిచి.. అద్భుతమైన చరిత్రను సృష్టించింది.
భారత క్రికెట్లో ప్రస్తుతం స్వర్ణ యుగం నడుస్తున్న నేపథ్యంలో.. ఆటగాళ్లకు ఐసీసీ నుంచి సగర్వమైన గౌరవం లభిస్తోంది. ఐసీసీ నిర్వహించే మేజర్ టోర్నీలలో వ్యక్తిగత ప్రదర్శన విభాగంలో ఈఎస్పిఎన్ వార్షిక పురస్కారాలను ప్రకటించింది. ఇందులో భారత క్రీడాకారులు మహిళలలోని అన్ని విభాగాలలో పురస్కారాలను సొంతం చేసుకున్నారు.
మహిళల వన్డే వరల్డ్ కప్ లో సెమి ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియాను ఓడించడంలో కీలక పాత్ర పోషించింది జెమీమా. ఆ మ్యాచ్లో వీరోచితమైన సెంచరీ చేసింది. ఉత్తమ బ్యాటర్ పురస్కారాన్ని అందుకుంది. ఇక దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో దీప్తి శర్మ ఐదు వికెట్లు తీసింది. ఉత్తమ బౌలర్ అవార్డు సొంతం చేసుకుంది.
ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన వన్డే, టి20 సిరీస్ ను సొంతం చేసుకున్నందుకు.. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రెండవ టైటిల్ అందించినందుకు.. హర్మన్ ప్రీత్ కౌర్ ఉత్తమ సారధి అవార్డు అందుకుంది. ఢిల్లీ జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో హార్మోన్ 66 పరుగులు చేసింది. తద్వారా మహిళల టి20 లీగ్ ఉత్తమ బ్యాటర్ అవార్డు దక్కించుకుంది.
ఇక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ లో ఆస్ట్రేలియా జట్టును ఓడించిన నేపథ్యంలో దక్షిణాఫ్రికా పురుష క్రికెటర్లు అనేక అవార్డులను దక్కించుకున్నారు. ఫైనల్ మ్యాచ్లో సెంచరీ చేసిన మార్క్రం ఉత్తమ టెస్ట్ బ్యాటర్ అవార్డు దక్కించుకున్నాడు. దక్షిణాఫ్రికా జట్టుకు డబ్ల్యూటీసి గదా అందించడంలో.. భారతదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసినందుకు.. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా లో వన్డే సిరీస్లలో విజయాలు సాధించడంలో కీలకపాత్ర పోషించిన బవుమాకు ఉత్తమ సారథి పురస్కారం లభించింది. భారత జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్ లో 2-0 తేడాతో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. ఈ విజయంలో దక్షిణాఫ్రికా పాస్ట్ బౌలర్ మార్క్ యాన్సన్ కీలక పాత్ర పోషించాడు. అయితే యాషెస్ సిరీస్ ప్రారంభంలో పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ లో 58 పరుగులు ఇచ్చి ఏడు వికెట్లు తీసి.. ఇంగ్లాండ్ జట్టును చిత్తుగా ఓడించిన మిచెల్ స్టార్క్ ఉత్తమ టెస్ట్ బౌలర్ అవార్డు అందుకున్నాడు.
