Homeఆంధ్రప్రదేశ్‌AP land registration New Rules 2026: ఏపీలో ఆ భూముల రిజిస్ట్రేషన్లు ఇక సులువు

AP land registration New Rules 2026: ఏపీలో ఆ భూముల రిజిస్ట్రేషన్లు ఇక సులువు

AP land registration New Rules 2026: భూ సంబంధిత సమస్యలపై ఏపీ ప్రభుత్వం( AP government) దృష్టి పెట్టింది. పూర్వీకుల నుంచి వారసత్వంగా వస్తున్న భూముల రిజిస్ట్రేషన్ విషయంలో నిబంధనలను సరళతరం చేసింది. ముఖ్యంగా వ్యవసాయేతర స్థలాల రిజిస్ట్రేషన్ విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులకు ప్రభుత్వం చెక్ పెట్టింది. ఈ మేరకు ప్రత్యేక ఉత్తర్వులు జారీచేసింది. ఇకనుంచి వారసత్వ భూములను చాలా సులువుగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అందుకు రెవెన్యూ శాఖ ధ్రువీకరించిన సర్టిఫికెట్ అవసరం ఉండదు. కేవలం […]

AP land registration New Rules 2026: భూ సంబంధిత సమస్యలపై ఏపీ ప్రభుత్వం( AP government) దృష్టి పెట్టింది. పూర్వీకుల నుంచి వారసత్వంగా వస్తున్న భూముల రిజిస్ట్రేషన్ విషయంలో నిబంధనలను సరళతరం చేసింది. ముఖ్యంగా వ్యవసాయేతర స్థలాల రిజిస్ట్రేషన్ విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులకు ప్రభుత్వం చెక్ పెట్టింది. ఈ మేరకు ప్రత్యేక ఉత్తర్వులు జారీచేసింది. ఇకనుంచి వారసత్వ భూములను చాలా సులువుగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అందుకు రెవెన్యూ శాఖ ధ్రువీకరించిన సర్టిఫికెట్ అవసరం ఉండదు. కేవలం సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తే చాలు. ఇట్టే రిజిస్ట్రేషన్ జరిగిపోతుందని ప్రభుత్వం చెబుతోంది.

Also Read: రేవంత్ రెడ్డి మూడు ముక్కలాట..!

* కొత్త మార్గదర్శకాలు
సాధారణంగా వారసత్వ భూముల విషయంలో చాలా రకాల వివాదాలు జరుగుతుంటాయి. వాటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ల( registration ) విషయంలో నిబంధనలు అడ్డంకిగా మారుతాయి.. ఈ నేపథ్యంలో ఆ వివాదాల పరిష్కారానికి గాను ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయేతర స్థలాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ కు రెవెన్యూ శాఖ సర్టిఫికెట్ తప్పనిసరి కాదని తెలిపింది. అయితే స్థలం యజమానులు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్టార్ కార్యాలయాలకు ఈ ఉత్తర్వులు జారీచేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇది నిజంగా వ్యయ ప్రయాసలకు చెక్ చెప్పినట్టే. రాష్ట్రంలో ఆధారాలు లేకుండా వారసులు పూర్వికులు నుంచి వచ్చిన భూముల రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే రెవెన్యూ అధికారులు ఇచ్చే పొజిషన్ సర్టిఫికెట్ కీలకం. కానీ రెవెన్యూ అధికారులు చాలా రకాల ఇబ్బందులు పెడుతుంటారు. దీనిపై ఫిర్యాదులు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆ ధ్రువీకరణ విషయంలో తప్పనిసరి అనే నిబంధనను తొలగించింది.

* అవినీతికి చెక్..
రెవెన్యూ శాఖ( Revenue Department) సర్టిఫికెట్ జారీలో లబ్ధిదారులను ఇబ్బంది పెడుతోంది. అయితే సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఈ సర్టిఫికెట్ లేకుంటే రిజిస్ట్రేషన్లు జరపడం లేదు. ఈ పరిస్థితుల్లో లంచం ఇస్తే కానీ ఆ పని జరగడం లేదు. అందుకే ప్రభుత్వం దృష్టికి ఈ విషయం వెళ్లడంతో సరికొత్తగా మార్గదర్శకాలను జారీచేసింది.. భూముల రిజిస్ట్రేషన్ సమయంలో ఆస్తి వారసత్వంగా వచ్చిందని.. ఇతరులకు హక్కు లేదని.. నిషేధిత జాబితాలో లేదని కచ్చితంగా సెల్ఫ్ డిక్లరేషన్ డాక్యుమెంట్లో ప్రస్తావించాల్సి ఉంటుంది. ఒకవేళ రిజిస్ట్రేషన్ సమయంలో తప్పుడు సమాచారం ఇచ్చినట్లు తేలితే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. సబ్ రిజిస్టార్లు ఆధార్ బయోమెట్రిక్ ధ్రువీకరణ తప్పనిసరిగా చేయాలని కూడా ఆదేశాలు ఇచ్చింది ప్రభుత్వం.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper