India Vs Pakistan T20 World Cup 2026: టీమిండియా, పాకిస్తాన్ తల పడుతున్న వేళ యావత్ ప్రపంచం మొత్తం ఈ మ్యాచ్ వైపే చూస్తోంది. కొలంబో వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో సత్తా చూపించాలని టీమిండియా.. ఎలాగైనా గెలవాలని పాకిస్తాన్ బలంగా ఉన్నాయి.
ఇటీవల కాలంలో స్వదేశంలో ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన మూడు టి20 మ్యాచ్ల సిరీస్లో పాకిస్తాన్ జట్టు సత్తా చూపించింది. ఆతిధ్య జట్టు ఒక విజయాన్ని కూడా సాధించకుండా కట్టడి చేసింది. బౌలింగ్.. బ్యాటింగ్ విభాగాలలో సత్తా చూపించింది.
ఆస్ట్రేలియాతో సిరీస్ గెలిచి.. ప్రస్తుత టి20 వరల్డ్ కప్ లో వరుసగా రెండు మ్యాచ్లు గెలిచి.. పాకిస్తాన్ జట్టు జోరు మీద ఉంది. బ్యాటింగ్.. బౌలింగ్ విభాగాలలో సరికొత్తగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో టీమిండియా కు పాకిస్తాన్ బలమైన పోటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. గత రికార్డుల పరంగా చూసుకుంటే.. ఇటీవలి మ్యాచుల ప్రకారం కూడా చూసుకుంటే పోటీ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది.
టీమిండియాలో బలమైన ప్లేయర్లు ఉన్నారు. పాకిస్తాన్లో సంచలనమైన ఆటగాళ్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో మ్యాచ్ చూసేందుకు వచ్చే ప్రేక్షకులకు అసలు సిసలైన టి20 మజా లభిస్తుందని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
అనేక నాటకీయ పరిణామాల మధ్య ఈ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే కొలంబోలో కొద్ది రోజులుగా వాతావరణం మబ్బుపట్టి ఉంది. ఆదివారం వర్షం కురవడానికి దాదాపు 70% వరకు అవకాశం ఉంటుందని తెలుస్తోంది. ఒకవేళ మ్యాచ్ నిర్వహణకు వర్షం అంతరాయం కలిగిస్తే రెండు చెట్లకు చెరొక పాయింట్ కేటాయిస్తారు. ప్రపంచ కప్ లో సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్ లకు రిజర్వ్ డే ఉంది. వర్షం పడితే బ్రాడ్కాస్టర్లకు తీవ్రంగా నష్టం ఏర్పడుతుంది. అదేవిధంగా ఎన్నో అంచనాలు పెట్టుకున్న ప్రేక్షకులకు టి20 క్రికెట్ మజా దూరమవుతుంది. అలాంటప్పుడు వర్షం కురవద్దని అభిమానులు కోరుకుంటున్నారు.