India vs England 3rd T20: ఇప్పటికే రెండు టి20 లను టీమిండియా కోల్పోయింది. తొలి మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. రెండో మ్యాచ్లో గెలుపుకు దగ్గరగా వచ్చినప్పటికీ.. బౌలింగ్ లోపం వల్ల ఓడిపోయింది. మూడో మ్యాచ్లో సమిష్టి వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. ముఖ్యంగా బ్యాటింగ్ లోపం టీమిండియాను తీవ్రంగా దెబ్బతీసింది. ఈ సిరీస్ లో ఇప్పటికే రెండు మ్యాచ్లు గెలిచి ఇంగ్లాండ్ అప్పర్ హ్యాండ్ కొనసాగిస్తోంది. గురువారం జరిగే మ్యాచ్లో గనుక విజయం సాధిస్తే ఇంగ్లాండ్ సిరీస్ సొంతం చేసుకుంటుంది. అది జరగొద్దు అనుకుంటే టీమిండియా గురువారం జరిగే మ్యాచ్లో గెలవాలి.
ఇప్పటికే ఐర్లాండ్ సిరీస్ ను టీమిండియా కోల్పోయింది. ఇంగ్లాండ్ సిరీస్ లో కూడా వరుసగా రెండు మ్యాచ్లు కోల్పోయింది. టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత టీమిండియా ఇలా ఆడుతుందని ఎవరు అంచనా వేయలేదు. 2024 లో టి20 పొట్టి సమరంలో గెలిచిన తర్వాత టీమ్ ఇండియా జింబాబ్వే చేతిలో తొలి మ్యాచ్ ఓడిపోయింది. ఆ తర్వాత వరుసగా మ్యాచులు గెలిచి సిరీస్ సొంతం చేసుకుంది. అంతే కాదు 2024 పొట్టి ప్రపంచ కప్ గెలిచిన నాటినుంచి మొన్నటి 2026 t20 వరల్డ్ కప్ గెలిచే వరకు టీం ఇండియా ఒక్క సిరీస్ కూడా కోల్పోలేదు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అనామక జట్టు మీద టీమిండియా ఓడిపోయింది. ఇంగ్లాండ్ గడ్డమీద వరుస ఓటములు ఎదుర్కొంటున్నది.
ఈ పరిస్థితి మారాలంటే టీమిండియాలో ప్రక్షాళన జరగాలి. కాకపోతే దానిని పక్కనపెట్టి కోచ్ గౌతమ్ గంభీర్ తన మార్క్ రాజకీయాలను మొదలుపెట్టాడు. తెలుగు ఆటగాడు తిలక్ వర్మ మీద మూడో మ్యాచ్లో వేటు వేశాడు. అతని స్థానంలో సంజు శాంసన్ కు చోటు కల్పించాడు. వాస్తవానికి మూడో మ్యాచ్లో తిలక్ వర్మ తేలిపోయాడు. ఐర్లాండ్ సిరీస్ లో కూడా వేగంగా పరుగులు చేయలేకపోయాడు. అతని మీద తీవ్రస్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. అయినప్పటికీ అతని ఆట తీరు మారడం లేదు. అలాగని మిగతా ప్లేయర్లు గొప్పగా ఆడుతున్నారని కాదు. హర్షిత్ రానా అంత గొప్పగా బ్యాటింగ్ చేయడం లేదు. బౌలింగ్ కూడా అంత గొప్పగా లేదు. కానీ అతడిని కొనసాగించి తిలక్ వర్మను జట్టుకు దూరం చేయడమేంటని విమర్శలు వినిపిస్తున్నాయి. తిలక్ గౌతమ్ కక్ష కట్టాడని మాజీ క్రికెటర్లు ఆరోపిస్తున్నారు.
ఇటీవల రెండో మ్యాచ్లో టీమ్ ఇండియా దారుణమైన ఓటమిని మూట కట్టుకున్న తర్వాత గౌతమ్.. తిలక్ డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళుతుండగా అభిమానులు తీవ్రస్థాయిలో నినాదాలు చేశారు. వి వాంట్ సంజు బ్యాక్ అంటూ గట్టిగా అరిచారు. తిలక్ వర్మ సరిగా ఆడలేక పోవడం.. అవకాశాలు ఇచ్చినప్పటికీ సరిగ్గా వినియోగించుకోలేకపోవడంతో అతడి స్థానంలో సంజు శాంసన్ ను తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి.. అయితే సంజూ కూడా ఇటీవల కాలంలో గొప్పగా ఆడిన దాఖలాలు లేవు. అందువల్లే అతడిని మూడో మ్యాచ్ కి దూరం పెట్టారు. చివరికి వైభవ్ సూర్య వంశీ కూడా ఆశించిన స్థాయిలో ఆడటం లేదు. మూడో మ్యాచ్లో నైనా టీమిండియా గాడిలో పడుతుందా.. విజయం సాధిస్తుందా.. చూడాల్సి ఉంది.
