Homeఎంటర్టైన్మెంట్Naga Vamsi Comments On Sreeleel: హీరోయిన్ 'శ్రీలీల' ను ఓ రేంజ్ లో ఆడుకున్న...

Naga Vamsi Comments On Sreeleel: హీరోయిన్ ‘శ్రీలీల’ ను ఓ రేంజ్ లో ఆడుకున్న నిర్మాత నాగవంశీ..

Naga Vamsi Comments On Sreeleel: నిర్మాత నాగవంశీ మీడియా ముందు మాట్లాడే మాటలు సోషల్ మీడియా లో ఏ రేంజ్ లో వైరల్ అవుతుంటాయి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎలాంటి ఫిల్టర్ లేకుండా, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం ఇతని స్టైల్. దానివల్ల అనేక సమస్యలు వస్తుంటాయి , ఒక్కోసారి ఈయన సోషల్ మీడియా లో తీవ్రమైన ట్రోల్స్ కి కూడా గురైన సందర్భాలు ఉన్నాయి. ఇకపోతే ఆయన లేటెస్ట్ గా హీరోయిన్ శ్రీలీలపై చేసిన కామెంట్స్ […]

Naga Vamsi Comments On Sreeleel: నిర్మాత నాగవంశీ మీడియా ముందు మాట్లాడే మాటలు సోషల్ మీడియా లో ఏ రేంజ్ లో వైరల్ అవుతుంటాయి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎలాంటి ఫిల్టర్ లేకుండా, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం ఇతని స్టైల్. దానివల్ల అనేక సమస్యలు వస్తుంటాయి , ఒక్కోసారి ఈయన సోషల్ మీడియా లో తీవ్రమైన ట్రోల్స్ కి కూడా గురైన సందర్భాలు ఉన్నాయి. ఇకపోతే ఆయన లేటెస్ట్ గా హీరోయిన్ శ్రీలీలపై చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. రేపు ఆయన నిర్మాతగా వ్యవహరించిన ‘లెనిన్’ మూవీ విడుదల కాబోతుంది. అక్కినేని అఖిల్ హీరో గా నటించిన ఈ సినిమాకు అక్కినేని నాగార్జున కూడా సహనిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా విడుదల సందర్భంగా నిన్న ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో శ్రీలీల గురించి విలేఖరి అడిగిన ప్రశ్నకు నాగవంశీ ఇచ్చిన సమాధానం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

విషయం ఏమిటంటే , ముందుగా ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం శ్రీలీల ని ఎంచుకున్నారు. కొంతభాగం షూటింగ్ కూడా ఆమెపై చేశారు. మొదటి టీజర్ లో మనం శ్రీలీల ని కొన్ని షాట్స్ లో చూడొచ్చు. కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ , కొన్ని రోజుల తర్వాత శ్రీలీల ఈ చిత్రం నుండి తప్పుకుంది. నిన్నటి ప్రెస్ మీట్ లో ఈ అంశాన్ని ఒక రిపోర్టర్ ప్రస్తావిస్తూ ‘ఈ సినిమాకు మొదటి నుండి అన్నీ మంచి పరిణామాలే జరుగుతున్నాయి. కొంతమంది ఈ చిత్రం నుండి తప్పుకోవడం తో చాలా మేలు జరిగింది’ అని అనగా, అందుకు నాగవంశీ సమాధానం చెప్తూ ‘అంటే మీరు ఇప్పుడు శ్రీలీల బ్యాడ్ అని అంటున్నారా ‘ అని సరదాగా కౌంటర్ ఇచ్చారు. అనంతరం నాగవంశీ శ్రీలీల తప్పుకోవడం గురించి కూడా చెప్పుకొచ్చారు.

ఆయన మాట్లాడుతూ ‘మంచి సినిమాలకు అన్నీ మంచే జరుగుతుంది. మా సినిమాకు కూడా అలాగే జరిగింది. కేవలం డేట్లు సర్దుబాటు అవ్వకపోవడం వల్లే ఈ చిత్రం నుండి శ్రీలీల తప్పుకుంది. అంతకు మించి వేరే కారణం లేదు. మొన్ననే ఈ చిత్రాన్ని చూశాను , భాగ్యశ్రీ అద్భుతంగా నటించింది, ఈ పాత్ర ఆమె తప్ప మరో హీరోయిన్ చెయ్యలేరని అనిపించింది’ అంటూ నాగవంశీ మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. శ్రీలీల ఈమధ్య కాలం లో చేస్తున్న ప్రతీ సినిమా డిజాస్టర్ ఫ్లాప్ అవుతూ వచ్చింది. ఆ కారణం చేత ఆమెకు ఐరన్ లెగ్ అనే పేరొచ్చింది. నాగవంశీ ఈ సినిమాకు అంతా మంచే జరిగింది అంటున్నారంటే శ్రీలీల ని ఐరన్ లెగ్ అని ప్రస్తావించినట్టే కాదు , ఇలా ఒక హీరోయిన్ గురించి తప్పుగా మాట్లాడడం బాధాకరం అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper