Homeక్రీడలుక్రికెట్‌Harbhajan Singh: పాకిస్తాన్ యూటర్న్ తీసుకుంది అందుకే.. అసలు విషయం చెప్పిన హర్భజన్!

Harbhajan Singh: పాకిస్తాన్ యూటర్న్ తీసుకుంది అందుకే.. అసలు విషయం చెప్పిన హర్భజన్!

Harbhajan Singh: టీమిండియా టి20 వరల్డ్ కప్ లో లీగ్ మ్యాచ్ ఆడే విషయంలో పాకిస్తాన్ మొదట్లో బెట్టు చేసిన విషయం తెలిసిందే.. భారత జట్టుతో మ్యాచ్ ఆడేది లేదని పాకిస్తాన్ స్పష్టం చేసింది. ఈ మ్యాచ్ మొత్తాన్ని తాము బాయ్ కాట్ చేస్తున్నట్టు వెల్లడించింది. అయితే ఒకవేళ ఫైనల్ లోకి భారత్ వెళ్తే ఆడతారా అనే ప్రశ్నకు మాత్రం.. అవును అని సమాధానం చెప్పింది. దీంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వ్యవహరిస్తున్న తీరు పట్ల అందరిలోనూ […]

Harbhajan Singh: టీమిండియా టి20 వరల్డ్ కప్ లో లీగ్ మ్యాచ్ ఆడే విషయంలో పాకిస్తాన్ మొదట్లో బెట్టు చేసిన విషయం తెలిసిందే.. భారత జట్టుతో మ్యాచ్ ఆడేది లేదని పాకిస్తాన్ స్పష్టం చేసింది. ఈ మ్యాచ్ మొత్తాన్ని తాము బాయ్ కాట్ చేస్తున్నట్టు వెల్లడించింది. అయితే ఒకవేళ ఫైనల్ లోకి భారత్ వెళ్తే ఆడతారా అనే ప్రశ్నకు మాత్రం.. అవును అని సమాధానం చెప్పింది. దీంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వ్యవహరిస్తున్న తీరు పట్ల అందరిలోనూ ఆగ్రహం వ్యక్తం అయింది.

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ద్వంద్వ వైఖరి అటు బంగ్లాదేశ్.. ఇంటిశ్రీలంక క్రికెట్ బోర్డులకు ఇబ్బంది కలిగించింది. ఈ నేపథ్యంలో రెండు క్రికెట్ బోర్డులు పాకిస్తాన్ క్రికెట్ పెద్దలకు లేఖలు రాశాయి. వ్యవహార శైలి మార్చుకోవాలని సూచించాయి. భారత జట్టుతో మ్యాచ్ ఆడాలని హిత బోధ చేశాయి. ఇదే క్రమంలో ఐసీసీ పెద్దలు రంగంలోకి దిగారు. పాకిస్తాన్ క్రికెట్ పెద్దలకు ఏ స్థాయిలో బ్రెయిన్ వాష్ చేయాలో.. అంతలా చేశారు. పాకిస్తాన్ కోరికలకు ఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోగా.. మరింత ఒత్తిడి తీసుకొచ్చింది. దీంతో పాకిస్తాన్ జట్టు తలవంచక తప్పలేదు.

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వ్యవహరించిన తీరును క్రికెటర్లు రకరకాలుగా పేర్కొంటున్నారు. అందులో హర్భజన్ చేసిన వ్యాఖ్యలు మాత్రం పూర్తి డిఫరెంట్గా ఉన్నాయి. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు భారత జట్టుతో ఆడేందుకు ఒప్పుకోవడానికి కారణం వేరే ఉందని అతడు వెల్లడించాడు. ” పాకిస్తాన్ మీ తీసుకున్న నిర్ణయం నాకు ఆశ్చర్యాన్ని కలిగించలేదు. ఎందుకంటే భారత జట్టుతో ఆడకుండా పాకిస్థాన్లో క్రికెట్ అభివృద్ధి సాధ్యం కాదు. అసలు అక్కడ క్రికెట్ అనేది మనగడ కూడా సాగించలేదు. అలాంటప్పుడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పెద్దలకు వేరే గత్యంతరం లేదు. బ్లాక్మెయిలింగ్ కు పాల్పడతామని అనుకున్నారు. మొదట్లో వారు కాస్త విజయం సాధించారు. ఆ తర్వాత అసలు విషయం తెలిసి సైలెంట్ అయిపోయారని” హర్భజన్ వ్యాఖ్యానించారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper