Lalit Modi vs Sreesanth : అసలే అతడు రసపురుషుడు. వయసు ఆరు పదుల దాకా వచ్చినప్పటికీ.. ఇప్పటికి తాను యంగ్ అని భావిస్తుంటాడు. అంతేకాదు రకరకాల సంబంధాలను నడపడంలో సిద్ధహస్తుడు. ఆమధ్య సుస్మితాసేన్ తో ఫోటోలు దిగి సంచలనం సృష్టించాడు. అంతేకాదు ఒక అందాన్ని నా పక్కనే బంధించాను అంటూ కామెంట్ కూడా చేశాడు. ఇంత చదివిన తర్వాత ఈపాటికే మేము చెబుతోంది ఎవరి గురించో అనేది మీకు అర్థమయ్యే ఉంటుంది. ఎస్.. మీ అంచనా కరెక్టే.. అతడే లలిత్ మోడీ.

ఐపీఎల్ రూపకర్తగా.. రకరకాల బిజినెస్ స్ట్రాటజీతో ఆ టోర్నీని ఓ స్థాయి దాకా అతడు తీసుకెళ్లాడు. ఆర్థికంగా అవకతవకలు.. ఇతర వ్యవహారాలతో అతడు తనకు వచ్చిన పేరును మొత్తం పోగొట్టుకున్నాడు. అంతేకాదు కొంతకాలంగా లండన్ లో స్థిరపడుతున్నాడు. ఇండియా వస్తే అరెస్ట్ చేస్తారని భయపడుతూ.. వివిధ దేశాలలో తిరుగుతున్నాడు. ఆమధ్య సుస్మితా సేన్ తో కనిపించాడు. ఆమెతో డేటింగ్ చేస్తున్నట్టు కూడా పరోక్షంగా ప్రకటించాడు. ఆ తర్వాత కొంతకాలానికి ఆ బంధం విచ్ఛిన్నమైందని వార్తలు వచ్చాయి. దానిపై లలిత్ కూడా క్లారిటీ ఇవ్వలేదు. అయితే చాలా రోజుల తర్వాత లలిత్ మీడియాలో వ్యక్తయ్యాడు. ఇటీవల ఓ టోర్నీ నిమిత్తం గేల్ ఇంగ్లాండ్ వెళితే.. అక్కడ అతడిని కలుసుకొని ఫోటోలు దిగాడు లలిత్ మోడీ. ఆ తర్వాత పెద్దగా మీడియాలో కనిపించిన దాఖలాలు లేవు. అయితే ఇప్పుడు అకస్మాత్తుగా అతడు మీడియాలో కనిపించడానికి.. మీడియాలో వ్యక్తి అవ్వడానికి కారణం ఉంది.
ఐపీఎల్ 2008 జరుగుతున్నప్పుడు శ్రీశాంత్ ను హర్భజన్ సింగ్ చెంపదెబ్బ కొట్టాడు. ఆ ఘటనతో శ్రీశాంత్ చిన్న పిల్లాడి మాదిరిగా ఏడ్చాడు. ఆ వీడియోను ఐపీఎల్ రూపకర్త బయట పెట్టడంతో వివాదం రేగింది. లలిత్ మోడీ వ్యవహరించిన తీరు పట్ల అతడి భార్య ఆగ్రహం వ్యక్తం చేసింది. పెద్దమనిషివై ఉండి ఇలాంటి పనిచేయడం ఏంటని మండిపడింది. అయితే దీనిపై లలిత్ స్పందించాడు. ” అసలు ఆమె ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తుందో నాకు ఏమీ అర్థం కావడం లేదు. ఇంటర్వ్యూలో నన్ను ఒకరు ప్రశ్న అడిగారు. నాడు ఏం జరిగిందో చెప్పాల్సిన బాధ్యత ఏర్పడింది. అందువల్లే దాన్ని షేర్ చేయాల్సి వచ్చింది. నేను శ్రీశాంత్ గురించి చెడుగా చెప్పలేదు. నాటి ఘటనలో అతడు బాధితుడు. ఆ ఇంటర్వ్యూలో కూడా నేను అదే చెప్పాను. గతంలో నన్ను ఎవరు ఈ విషయం గురించి ప్రశ్నించలేదు. మైకేల్ క్లార్క్ నన్ను అడిగాడు కాబట్టి నేను చెప్పాల్సి వచ్చింది. అంతేతప్ప ఈ వ్యవహారంలో నాకు ఎటువంటి ఉద్దేశం లేదు. బహుశా ఆమె ఇవన్నీ తెలుసుకోకుండా నా మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి విషయాలలో ముందు వెనుక చూసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడ ఉన్న కోపాన్ని నామీద చూపిస్తే ఎలా ఉంటుందని” లలిత్ వ్యాఖ్యానించాడు. లలిత్ వ్యవహార శైలి పట్ల శ్రీశాంత్ అభిమానులు మండిపడుతున్నారు. ఎప్పుడో జరిగిన విషయాన్ని ఇప్పుడు చెప్పడం ఏంటని.. మానిపోయిన గాయాన్ని మళ్లీ రేపడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. లలిత్ ఇండియాకు వచ్చి ఈ మాటలు మాట్లాడాలని.. అప్పుడు ఆయన అసలు రూపం బయటపడుతుందని సవాల్ విసురుతున్నారు. మరి ఈ సవాల్ ను లలిత్ స్వీకరిస్తారా.. అనే ప్రశ్నకు సమాధానం తెలియాల్సి ఉంది