T20 World Cup: పొట్టి ఫార్మాట్ లో మ్యాచ్ అంటే చివరి వరకు విజేత ఎవరో చెప్పడం కష్టం. ఎందుకంటే వేగమే కొలమానంగా పొట్టి ఫార్మాట్ మ్యాచ్ సాగుతూ ఉంటుంది. దూకుడే ప్రమాణంగా పొట్టి ఫార్మాట్ లో మ్యాచ్ నడుస్తూ ఉంటుంది.
పొట్టి ఫార్మాట్ 2007లో ప్రారంభమైన తర్వాత అంచనాలకు అందకుండా సాగిపోతుంది. పొట్టి ఫార్మాట్ ప్లేయర్లకు మాత్రమే కాకుండా అభిమానులకు కూడా అద్భుతమైన క్రికెట్ ఆనందాన్ని అందిస్తోంది. అందువల్లే ఈ ఫార్మాట్ కు విపరీతమైన ఆదరణ లభిస్తున్నది. ప్రపంచ వ్యాప్తంగా పొట్టి ఫార్మాట్ అత్యంత వేగంగా విస్తరిస్తోంది. మన దేశమే కాకుండా అనేక దేశాలు పొట్టి ఫార్మాట్ లో లీగ్ పోటీలు నిర్వహిస్తున్నాయి. ఇక తాజాగా పసికూనలు నేపాల్, నెదర్లాండ్ మధ్య టి20 మ్యాచ్ జరిగింది.
ముందుగా బ్యాటింగ్ చేస్తున్న నెదర్లాండ్ జట్టు 20 ఓవర్లు పూర్తిస్థాయిలో ఆడింది. ఏడు వికెట్లు నష్టపోయి 152 రన్స్ చేసింది. ఆ తర్వాత చేజింగ్ మొదలుపెట్టిన నేపాల్ జట్టు ప్రారంభం నుంచి వికెట్లు కోల్పోయింది. దీంతో నెదర్లాండ్ విజయం ఖాయమైంది. ఈ దశలో నేపాల్ జట్టు బౌలర్ నందన్ యాదవ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఒక ఉత్కంఠ గా సాగిన చివరి ఓవర్ లో అతడు రెండు ఫోర్లు కొట్టి.. నెదర్లాండ్ జట్టు సమంగా తన జట్టు స్కోరును తీసుకొచ్చాడు. రెండు జట్ల పరుగులు సమానం కావడంతో అంపైర్లు నిబంధనల ప్రకారం సూపర్ ఓవర్ నిర్వహించారు. సాధారణంగా ఇటువంటి పరిస్థితుల్లో సూపర్ ఓవర్ నిర్వహించినప్పుడు మ్యాచ్ ఫలితం తేలుతుంది.
Also Read: T20 World Cup 2024: టీ – 20 కప్ కొడితే.. కోట్ల వర్షం.. ఐసీసీ ప్రైజ్ మనీ ఎంత పెంచిందంటే..
అంపైర్లు నిర్వహించిన సూపర్ ఓవర్ కూడా ఉత్కంఠ గా సాగింది. తొలి సూపర్ ఓవర్ లో రెండు జట్లు కూడా 19 చొప్పున సమానంగా పరుగులు చేశాయి. దీంతో అంపైర్లు టై బ్రేకర్ నిర్వహించేందుకు మొగ్గు చూపించారు. ఇక అందులో కూడా నేపాల్, నెదర్లాండ్ సమానంగా 17 పరుగులు చేశాయి. దీంతో అంపైర్లు తుది ఫలితం కోసం మరొకసారి సూపర్ ఓవర్ నిర్వహించాల్సి వచ్చింది. ఇక మూడవ సూపర్ ఓవర్లో నెదర్లాండ్ జట్టు ఆల్రౌండర్ జాచ్ లయన్ కాచెట్ అద్భుతంగా బౌలింగ్ వేశాడు. నేపాల్ జట్టుకు ఒక పరుగు కూడా ఇవ్వకుండా కట్టుదిట్టంగా బంతులు వేశాడు. 4 బంతుల్లో రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో నెదర్లాండ్ జట్టు టార్గెట్ ఒకే ఒక్క పరుగుగా మారిపోయింది. ఈ నేపథ్యంలో టార్గెట్ ను రీచ్ కావడానికి రంగంలోకి దిగిన నెదర్లాండ్ జట్టు ఫస్ట్ బాల్ కే భారీ సిక్సర్ కొట్టి విక్టరీ అందుకుంది. టి20 క్రికెట్ చరిత్రలో ఇటువంటి సూపర్ ఓవర్ ఇంతవరకు కొనసాగలేదు. దిగ్గజమైన జట్లు కూడా ఇలాంటి అనుభవాన్ని అభిమానులకు ఎప్పుడూ ఇవ్వలేదు. అనామక జట్లైనప్పటికీ నెదర్లాండ్, నేపాల్ అనితర సాధ్యమైన ఆట తీరు ప్రదర్శించాయి. అంతేకాదు అభిమానులకు అసలు సిసలైన టి20 క్రికెట్ ఆనందాన్ని అందించాయి.