T20 World Cup 2024: కోట్లు.. ఒకటి కాదు రెండు కాదు.. అంతకుమించి అనేలాగా.. క్రికెట్ కు రీచ్ పెంచేందుకు.. ఈ క్రీడకు అంతకంతకూ విస్తృతి చేసేందుకు.. ఐసీసీ కృషి చేస్తోంది. అమెరికా లాంటి ప్రాంతాల్లో క్రికెట్ ను అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తోంది. ఇందులో భాగంగానే టీ – 20 వరల్డ్ కప్ ను అమెరికా, వెస్టిండీస్ వేదికగా నిర్వహిస్తోంది. ఈసారి తొలిసారిగా 20 జట్లు టీ – 20 వరల్డ్ కప్ లో పోటీ పడుతున్నాయి. అయితే ఈసారి విజేతగా నిలిచిన జట్టుకు ఐసీసీ ఏకంగా 20.36 కోట్ల క్యాష్ రివార్డ్ ఇవ్వనుంది. టీ – 20 వరల్డ్ కప్ చరిత్రలో ఈ స్థాయి లో ప్రైజ్ మనీ ఇవ్వడం ఇదే తొలిసారి.
రన్నరప్ జట్టుకు 10.64 కోట్లు, సెమీస్ లో ఓడిన జట్లకు 6.55 కోట్ల క్యాష్ ప్రైజ్ మనీ ఇవ్వనుంది.. సూపర్ – 8 కు అర్హత సాధించిన టీం లకు 3.18 కోట్లు, 9 -12 స్థానాలలో నిలిచిన టీమ్స్ కు 2.06 కోట్లు, 13-20 స్థానాలలో నిలిచిన జట్లకు 1.87 కోట్ల ప్రైజ్ మనీ దక్కుతుంది. క్రికెట్ కు మరింత ఆదరణ పెంచేందుకు ఈ టోర్నీలో ఆయా జట్లు సాధించిన విజయానికి 25.9 లక్షలు బోనస్ గా ఇవ్వనుంది. దాదాపు 93.5 2 కోట్లను నగదు బహుమతిగా ఐసీసీ ఇవ్వనుంది. ఐసీసీ చరిత్రలో 100 కోట్లను ప్రైజ్ మనీ గా ఇవ్వడం ఇది తొలిసారి.
ఆదివారం నుంచి టి20 ప్రపంచ కప్ కు తెరలేచింది. తొలి మ్యాచ్లో కెనడాపై అమెరికా ఘనవిజయం సాధించింది.. జూన్ 29న ఫైనల్ పోరు జరుగుతుంది. ఈసారి 20 జట్లు పోటీ పడుతున్నాయి. లీగ్ దశలో నాలుగు గ్రూపులను ఏర్పాటు చేసింది..టాప్ -2 లో నిలిచిన జట్లు సూపర్ -8 పోరుకు అర్హత సాధిస్తాయి. ఈ విభాగంలోకి చేరిన జట్లను రెండు గ్రూపులుగా విభజిస్తారు.. ఈ రెండు గ్రూపుల నుంచి టాప్ -2 లో నిలిచిన జట్లు సెమీస్ వెళ్తాయి. సెమిస్ లో గెలిచిన జట్లు జూన్ 29న బార్డబోస్ వేదికగా ఫైనల్ పోరులో తలపడతాయి.. టైటిల్ ఫేవరెట్ గా ఉన్న భారత జట్టు గ్రూపు ఏ లో ఉంది. ఇందులో పాకిస్తాన్, ఐర్లాండ్, కెనడా, అమెరికా ఉన్నాయి. గ్రూప్ ఏ లో మ్యాచ్ లు మొత్తం అమెరికాలోనే జరుగుతాయి. అయితే విభిన్నమైన సమయాలలో ఈ మ్యాచ్ లు మొదలవుతాయి. భారత్ ఆడే మ్యాచ్ లు రాత్రి 8 గంటల తర్వాత షురూ అవుతాయి.. అక్కడి కాలమానం ప్రకారం ఉదయం తొమ్మిది గంటల 30 నిమిషాలకు, మరికొన్ని ఉదయం 10:30కు మొదలవుతాయి. మన కాలమానం ప్రకారం చూసుకుంటే రాత్రి 8 గంటలకు ఈ మ్యాచ్లు మొదలవుతాయి.. జూన్ 5న న్యూయార్క్ వేదికగా ఐర్లాండ్, జూన్ 9న న్యూయార్క్ వేదికగా పాకిస్తాన్, జూన్ 12న న్యూయార్క్ వేదిక అమెరికా, జూన్ 15న ఫ్లోరిడా వేదికగా కెనడా జట్లతో భారత్ తలపడుతుంది. భారత కాలమాన ప్రకారం రాత్రి 8 గంటలకు ఈ మ్యాచ్ లు మొదలవుతాయి.
93.5 CRORE PRIZE MONEY WILL BE GIVEN BY ICC IN T20I WORLD CUP 2024. pic.twitter.com/jZKmkdnJWp
— Johns. (@CricCrazyJohns) June 3, 2024