Homeజాతీయ వార్తలుKolar Gold Fields Will Reopen: KGF మళ్లీ ఓపెన్.. 80 ఏళ్ల తర్వాత ఇప్పుడు...

Kolar Gold Fields Will Reopen: KGF మళ్లీ ఓపెన్.. 80 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఎందుకు తెరుస్తున్నారంటే?

Kolar Gold Fields Will Reopen: అయితే ఈ సినిమాలో కేజీఎఫ్ లో మరో కోణాన్ని ప్రశాంత్ నీల్ ఎంతో గొప్పగా చూపించడంతో ఆ సినిమా విజయవంతమైంది. సినిమా తర్వాత కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ గురించి తెలుసుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి మొదలైంది.. ఇప్పటికీ అక్కడి బంగారు గనుల గురించి తెలుసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. గూగుల్ లో వాటి గురించి సెర్చ్ చేసేవారు చాలామంది ఉన్నారని ఇటీవల ఓ నివేదికలో తేలింది.. అయితే కేజిఎఫ్ సినిమాలో చూపించినట్టుగా గతంలో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లో బంగారాన్ని వెలికి తీసేవారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ అది మూతపడింది. దాదాపు 8 దశాబ్దాల తర్వాత ఇప్పుడు మళ్ళీ కేజిఎఫ్ కు పూర్వపు రూపు దక్కనుంది.

కర్ణాటకలో ప్రస్తుతం హస్తం పార్టీ అధికారంలో ఉంది. వి నేపథ్యంలో చారిత్రాత్మకమైన కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 80 సంవత్సరాల తర్వాత కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ పున: ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. ముఖ్యంగా భారత్ గోల్డ్ మైన్స్ సైట్ లోని 1003 ఎకరాల్లో బంగారం ఎక్కువగా ఉండే 13 టైలరింగ్ డంప్ లలో ఉపరితల మైనింగ్ చేపట్టడానికి కర్ణాటక ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అయితే వీటి ద్వారా 23 టన్నుల బంగారం లభిస్తుందని తెలుస్తోంది. ఆత్యాధునిక మైనింగ్ టెక్నాలజీ ఉపయోగించి ప్రతి ఏడాది 750 కిలోల బంగారాన్ని ఉత్పత్తి చేయడానికి అక్కడి అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.. గతంలో ఇక్కడ డంపింగ్, మైనింగ్ విస్తృతంగా జరిగేది.అనూహ్య పరిణామాల నేపథ్యంలో డంపింగ్ ఆగిపోయింది. మైనింగ్ కూడా నిలిచిపోయింది. దాదాపు 8 దశాబ్దాలుగా అక్కడ ఎటువంటి కార్యక్రమాలు జరగడం లేదు. ఇన్నాళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కీలక నిర్ణయం తీసుకోవడంతో కేజిఎఫ్ మళ్లీ పూర్వపు రూపు సంతరించుకోనుంది. వాస్తవానికి ఇక్కడ బంగారానికి విపరీతమైన డిమాండ్ ఉంటుందని.. మైనింగ్ మొదలయితే ఈ ప్రాంతం రూపురేఖలు మారిపోతాయని స్థానికులు చెబుతున్నారు. గతంలో మైనింగ్ భారీగా జరిగేదని.. మళ్లీ ఇప్పుడు ఆ తరహా వాతావరణం ఏర్పడుతుందని వారు వ్యాఖ్యానిస్తున్నారు.

Also Read: Woman Emotional Story: ఇష్టంగా పెంచుకుంటున్న కోడిని ఎవరో చంపేశారు.. తట్టుకోలేక ఈ మహిళ ఏం చేసిందంటే?

“ఇకపై ఇక్కడ మైనింగ్ మొదలవుతుంది. డంపింగ్ కూడా ప్రారంభమవుతుంది. కార్మికులకు చేతినిండా ఉపాధి దొరుకుతుంది. ఇక్కడ నుంచి వేరే ప్రాంతాలకు వెళ్లిపోయిన వారు ఇక సొంత ప్రాంతాలకు వస్తారు. అంతేకాదు ఇక్కడే ఉంటూ ఉపాధి పొందుతారు. దాదాపు 8 దశాబ్దాల తర్వాత ఇక్కడ పండుగ వాతావరణం మొదలైంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఇక్కడ వేలాదిమందికి భృతి లభిస్తుంది.. ఈ ప్రాంతం మొత్తం వాహనాల రాకపోకలతో సందడిగా ఉంటుందని” స్థానికులు చెబుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular