Homeక్రీడలుక్రికెట్‌Prema Rawat: 18వ ఓవర్లో క్రీజు లోకి.. 14 బంతుల్లో హాఫ్ సెంచరీ..వరల్డ్ రికార్డు సెట్...

Prema Rawat: 18వ ఓవర్లో క్రీజు లోకి.. 14 బంతుల్లో హాఫ్ సెంచరీ..వరల్డ్ రికార్డు సెట్ చేసిన టీమిండియా ప్లేయర్

Prema Rawat: క్రికెట్లో రికార్డు సృష్టించాలంటే ఓపెనర్ గానే బరిలోకి దిగాల్సిన అవసరం లేదు. చివరి ఓవర్లో బ్యాటింగ్ కు వచ్చినా విధ్వంసం సృష్టించవచ్చని నిరూపించింది టీమిండియా మహిళా. కేవలం 14 బంతుల్లోనే అర్థ శతకం పూర్తిచేసి.. మహిళల టి20 క్రికెట్ చరిత్రలో సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. ప్రత్యర్థి బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా బౌండరీల వరద పారించింది. ఈ రికార్డు ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో చర్చకు దారితీస్తోంది. ఇంతకు ఈ ఘనత సాధించిన టీమిండియా […]

Prema Rawat: క్రికెట్లో రికార్డు సృష్టించాలంటే ఓపెనర్ గానే బరిలోకి దిగాల్సిన అవసరం లేదు. చివరి ఓవర్లో బ్యాటింగ్ కు వచ్చినా విధ్వంసం సృష్టించవచ్చని నిరూపించింది టీమిండియా మహిళా. కేవలం 14 బంతుల్లోనే అర్థ శతకం పూర్తిచేసి.. మహిళల టి20 క్రికెట్ చరిత్రలో సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. ప్రత్యర్థి బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా బౌండరీల వరద పారించింది. ఈ రికార్డు ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో చర్చకు దారితీస్తోంది. ఇంతకు ఈ ఘనత సాధించిన టీమిండియా మహిళా క్రికెటర్ ఎవరు.. ఆమె ఇన్నింగ్స్ లో ఎన్ని ఫోర్లు.. సిక్సర్లు ఉన్నాయి..

పూణేలో సీనియర్ మహిళ టి20 ట్రోఫీ ఎలైట్ టోర్నమెంట్లో ఉత్తరాఖండ్, హైదరాబాద్ జట్లు పోటీ పడ్డాయి. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఉత్తరాఖండ్ దూకుడుగా బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో 18 ఓవర్లో 4వ స్థానంలో బ్యాటింగ్ కు దిగింది ప్రేమా రావత్. అప్పటికే ఉత్తరాఖండ్ స్కోర్ 129/2. ఇన్నింగ్స్ ముగిసేందుకు కేవలం 17 బంతులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ దశలో వేగంగా పరుగులు సాధించడమే లక్ష్యంగా బరిలోకి దిగింది ప్రేమ.. బౌలర్ల మీద దయ లేకుండా విరుచుకుపడింది.

14 బంతుల్లో 50..

క్రీజ్ లోకి వచ్చిన ప్రేమ తన దూకుడు ప్రారంభం నుంచే మొదలుపెట్టింది. సాక్షి రావు బౌలింగ్ లో వరుసగా మూడు బౌండరీలు కొట్టింది. తర్వాత ఓవర్లో సిక్సర్లు.. ఫోర్ లతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించింది. పూజ బౌలింగ్లో ఒకే ఓవర్ లో 18 పరుగులు సాధించింది. ఇక ఇన్నింగ్స్ చివరి ఓవర్లో కుంచాల నితీషా బౌలింగ్ ను లక్ష్యంగా చేసుకుంది. చివరి 4 బంతుల్లో 20 పరుగులు పిండుకుంది. దీంతో కేవలం 14 బంతుల్లోనే అర్థ శతకం పూర్తి చేసింది. ఈ ఇన్నింగ్స్ లో ప్రేమ ఆరు ఫోర్లు.. నాలుగు సిక్సర్లు కొట్టింది. అంటే ఆమె సాధించిన 50 పరుగులు 48 పరుగులు బౌండరీల రూపంలో వచ్చాయి. కేవలం మూడు బంతులను మాత్రమే ఆమె పరుగులు చేయకుండా వదిలేసింది.

ఇప్పటివరకు మహిళల టీ20 క్రికెట్లో అత్యంత వేగంగా అర్థ శతకం సాధించిన రికార్డు 15 బంతులుగా ఉండేది. ఇంగ్లాండ్ జట్టుకు చెందిన మేరీ కెలీ.. ఆస్ట్రేలియా కు చెందిన లారా హారీస్, పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనా ఈ రికార్డును అందుకున్నారు. లారా రెండుసార్లు ఈ రికార్డును సాధించింది. అయితే ఇప్పుడు ప్రేమ కేవలం 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి.. ఆ రికార్డును అధిగమించింది. మహిళల టి20 క్రికెట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన అర్ధ శతకం సాధించిన బ్యాటర్ గా ఆమె చరిత్ర పుటల్లో నిలిచింది.

ప్రేమ విధ్వంసంతో ఉత్తరాఖండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 187 పరుగులు చేసింది. కెప్టెన్ రాఘ్వి 50 బంతుల్లో 72 పరుగులతో నాట్ అవుట్ గా నిలిచింది. ప్రేమారావత్ 14 బంతుల్లో 50 పరుగులతో నాట్ అవుట్ గా నిలిచింది. అనంతరం 188 పరుగుల లక్ష్యంతో రంగంలోకి దిగిన హైదరాబాద్.. ఉత్తరాఖండ్ బౌలర్ల ధాటికి నిలబడలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 98 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ఉత్తరాఖండ్ 89 పరుగుల భారీ తేడాతో విజయం అందుకుంది.

ఇక్కడ మరో విశేషం ఏంటంటే బ్యాటింగ్ లో రికార్డు సృష్టించిన ప్రేమ బౌలింగ్ లో కూడా అదరగొట్టింది. నాలుగు ఓవర్లలో కేవలం 12 పరుగులు మాత్రమే ఇచ్చి.. రెండు వికెట్లు సొంతం చేసుకుంది. దీంతో ఆమెకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ ఇన్నింగ్స్ లో మరో ఆసక్తికరమైన విషయం ఒకటి ఉంది. ప్రేమారావత్ తన ఇన్నింగ్స్ తో ప్రపంచ రికార్డు సృష్టించాననే విషయం మ్యాచ్ ముగిసే వరకు కూడా తెలుసుకోలేదు. మ్యాచ్ అనంతరం అవార్డు ప్రజెంటేషన్ సమయంలో మ్యాచ్ రిఫరీ ఈ విషయాన్ని ఆమెకు చెప్పారు. రికార్డు సాధించిన అనంతరం ప్రేమ జైలర్ 2 సినిమా చూసింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper