Homeక్రీడలుక్రికెట్‌Abhishek Sharma: సెంచరీ తర్వాత యోగాసనం.. OG సెలబ్రేషన్ అంటే ఇదేనేమో..దాని వెనుక పెద్ద స్టోరీ

Abhishek Sharma: సెంచరీ తర్వాత యోగాసనం.. OG సెలబ్రేషన్ అంటే ఇదేనేమో..దాని వెనుక పెద్ద స్టోరీ

Abhishek Sharma: న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న టి20 సిరీస్లో టీమిండియా మరో రెండు మ్యాచ్ మిగిలి ఉండగానే.. ట్రోఫీని దక్కించుకుంది. ఇప్పటికే రెండు మ్యాచ్లలో న్యూజిలాండ్ ఓడిపోయింది. మూడో మ్యాచ్లో కూడా అదే ఫలితం రిపీట్ అయింది. ఫలితంగా టి20 టీమ్ ఇండియాకు తిరుగులేదని మరోసారి నిరూపితమైంది. ముఖ్యంగా మూడో టి20 మ్యాచ్లో టీమిండియా ఆటగాడు అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. సెంచరీ తో అదరగొట్టాడు.. ఈ సిరీస్లో తొలి రెండు మ్యాచ్లలో న్యూజిలాండ్ జట్టు […]

Abhishek Sharma: న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న టి20 సిరీస్లో టీమిండియా మరో రెండు మ్యాచ్ మిగిలి ఉండగానే.. ట్రోఫీని దక్కించుకుంది. ఇప్పటికే రెండు మ్యాచ్లలో న్యూజిలాండ్ ఓడిపోయింది. మూడో మ్యాచ్లో కూడా అదే ఫలితం రిపీట్ అయింది. ఫలితంగా టి20 టీమ్ ఇండియాకు తిరుగులేదని మరోసారి నిరూపితమైంది. ముఖ్యంగా మూడో టి20 మ్యాచ్లో టీమిండియా ఆటగాడు అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. సెంచరీ తో అదరగొట్టాడు..

ఈ సిరీస్లో తొలి రెండు మ్యాచ్లలో న్యూజిలాండ్ జట్టు ముందుగా బ్యాటింగ్ చేసింది. రెండు మ్యాచ్ల్లో కూడా ఓడిపోయింది. మూడో మ్యాచ్లో కూడా న్యూజిలాండ్ జట్టు ముందుగా బ్యాటింగ్ చేసింది.. టీమిండియా ముందు 199 పరుగుల లక్ష్యాన్ని విధించింది. కివీస్ తరఫున మిచల్ 89* పరుగులు చేసి.. టాప్ స్కోరర్ గా నిలిచాడు. అలెన్ 40 పరుగులతో ఆకట్టుకున్నాడు. జాకబ్స్ చివర్లో 39* పరుగులు చేశాడు.. టీం ఇండియా బౌలర్లలో అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, అర్ష్ దీప్ సింగ్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.

న్యూజిలాండ్ విధించిన టార్గెట్ ఫినిస్ చేసేందుకు రంగంలోకి దిగిన టీమిండియా ఏ దశలో కూడా ఓడిపోయే విధంగా కనిపించలేదు. ఓపెనర్లు వైభవ్ 45, శర్మ 113 రన్స్ చేశారు. వీరిద్దరు తొలి వికెట్ కు కేవలం 7.1 ఓవర్లలో 133 పరుగులు జోడించారు. దీంతో న్యూజిలాండ్ బౌలర్లు ప్రేక్షక పాత్రకు పరిమితమయ్యారు.. 178 పరుగులకు భారత జట్టు స్కోర్ చేరుకున్న సమయంలో రెండో వికెట్ గా శర్మ పెవిలియన్ చేరుకున్నాడు. అప్పటికే న్యూజిలాండ్ చెట్టుకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది.. సంజు శాంసన్(18), అయ్యర్ (5) అంతగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ.. టీమిండియా బ్రహ్మాండమైన విజయం సాధించింది. 13.2 ఓవర్లలో లక్ష్యం పూర్తి చేసింది. అది కూడా నాలుగు వికెట్లు నష్టపోయి.

సెంచరీ పూర్తి చేసిన తర్వాత అభి యోగాసనం వేశాడు. దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశం.. వేరే ఉంది. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో ఢిల్లీలో జరిగిన టి20 మ్యాచ్ లో అభిషేక్ శర్మ కేవలం 30 బంతులు ఎదుర్కొని సెంచరీ పూర్తి చేశాడు. ఆ తర్వాత మైదానంలో కూర్చొని ధ్యానం చేస్తున్నట్టుగా ఫోజు ఇచ్చాడు. అయితే దీని వెనక ఫుట్ బాల్ ప్లేయర్ ఎర్లింగ్ హాలాండ్ ఉన్నారు. ఎందుకంటే గోల్ కొట్టిన తర్వాత ఆయన కూడా మైదానంలో ఇలానే కూర్చొని ధ్యానం చేస్తున్నట్టుగా ఫోజు ఇస్తుంటారు. శర్మ కూడా ఇప్పుడు అలానే చేశారు. దీనివల్ల ప్రశాంతత లభిస్తుందని.. భిన్నమైన సెలబ్రేషన్ ను ప్రదర్శించవచ్చని అభిషేక్ శర్మ అప్పట్లో చెప్పారు. ఇప్పుుడు కూడా అదే రిపీట్ చేశాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper