CSK downfall reason: ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు అద్భుతమైన చరిత్ర ఉంది. ముంబై ఇండియన్స్ జట్టుతో సమానంగా చెన్నై సూపర్ కింగ్స్ ఐదుసార్లు విజేతగా నిలిచింది. ధోని నాయకత్వంలో అద్భుతమైన విజయాలు సాధించి సరికొత్త చరిత్రను సృష్టించింది.
గతాన్ని ఘనంగా చాటిన ఈ జట్టు.. ఇప్పుడు తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. ముఖ్యంగా అగ్రశ్రేణి జట్టుగా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ గత రెండు సీజన్లు గా సరిగ్గా ఆడటం లేదు. సమర్థవంతమైన ప్లేయర్లు ఉన్నప్పటికీ చెన్నై జట్టు విఫల ప్రదర్శన చేస్తోంది. మరింత దారుణంగా పాయింట్ల పట్టికలో అధమ స్థానంలో ఉండడం ఆ జట్టు ఆటగాళ్ల బేలతనాన్ని చూపిస్తోంది.
ఈ ఐపిఎల్ సీజన్లో బెంగళూరు జట్టు చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ దారుణమైన ఓటమిని మూటకటుకుంది. 15 ఓవర్ ల వరకు అద్భుతంగా బౌలింగ్ చేసిన చెన్నై బౌలర్లు.. ఆ తర్వాత చేతులెత్తేశారు. చివరి 5 ఓవర్ లలో 90 కి పైగా పరుగులు ఇచ్చి తమ నిర్లక్ష్యాన్ని చాటుకున్నారు. అయితే పరుగుల చేదనలో ప్రధాన నలుగురి బ్యాటర్లు విఫలమయ్యారు. బెంగళూరు బ్యాటర్లు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసినచోట.. చెన్నై బ్యాటర్లు విఫలం కావడం.. ఆ జట్టు అభిమానులను కలవరపాటుకు గురిచేస్తోంది.
ఐపీఎల్ లో అగ్రశ్రేణి జట్టుగా పేరుపొందిన చెన్నై ఇలా విఫలం కావడం విశ్లేషకులను సైతం ఆచారానికి గురి చేస్తోంది. ధోని నాయకత్వంలో పటిష్టంగా ఉన్న చెన్నై జట్టు.. ఆ తర్వాత ఇలా మారిపోవడం చెన్నై అభిమానులకు మింగుడు పడడం లేదు..
ప్రస్తుత సీజన్లో చెన్నై వరుసగా మూడు
ఓటములను ఎదుర్కొంది. దీంతో పరిస్థితి ఎంతకు జారిందంటే.. చెన్నై జట్టుతో తలపడినప్పుడు తమ జట్లకు సులభంగా రెండు పాయింట్లు వస్తాయని.. అది వీలైనంత త్వరగా జరగాలని ఇతర జట్ల అభిమానులు సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు. చెన్నై జట్టు అభిమానులను విపరీతంగా విమర్శిస్తున్నారు..
చెన్నై జట్టు ఇలా విఫలం కావడానికి కారణాలలో ప్రధానమైనది వారి ఓపెనింగ్ భాగస్వామ్యం. సంజు శాంసన్, రుతు రాజ్ గైక్వాడ్ మెరుగైన ఆరంభం ఇవ్వడంలో విఫలమవుతున్నారు. పవర్ ప్లే లో బంతులను వృధా చేస్తున్నారు. దీంతో చెన్నై జట్టు మెరుగైన స్కోర్ చేయలేకపోతోంది.. బలమైన మిడిల్ ఆర్డర్ కూడా లేకపోవడం వల్ల జట్టు భారీ స్కోర్ చేయలేకపోతోంది. ఆయుష్ మాత్రే, సర్ప రాజ్ ఖాన్, ప్రశాంత్ వీర్ మాత్రమే పరవాలేదు అనిపిస్తున్నారు. వీరందరితో పోల్చి చూస్తే సర్ఫ రాజ్ మాత్రమే పరవాలేదనిపిస్తున్నాడు. బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్లో అతడు హాఫ్ సెంచరీ చేశాడు.
చెన్నై బౌలర్లు తొలి మూడు మ్యాచ్లలో 600 పైగా పరుగులు ఇచ్చారు. వాస్తవానికి ఇంత దారుణంగా ఏ జట్టు బౌలర్లు కూడా పరుగులు ఇవ్వలేదు. మైదానంలో ధోని కూడా లేడు. గైక్వాడ్ అనుభవలేమి స్పష్టంగా కనిపిస్తోంది.. ఆటగాళ్లలో సమన్వయం కూడా అంతగా లేదు.. జట్టు తీవ్రమైన ఒత్తిడి లో ఉన్న నేపథ్యంలో బ్రేవిస్ ను త్వరగా తీసుకురావాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది.. ధోని ఇంకా కోలు కోకపోవడంతో.. చెన్నై జట్టు కష్టాలు ఇప్పట్లో తీరుతయా అని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.