Homeక్రీడలుChennai Super Kings : డేంజర్ ఆటగాడు వస్తున్నాడు..వరుస ఓటముల చెన్నైకి గుడ్ న్యూస్..

Chennai Super Kings : డేంజర్ ఆటగాడు వస్తున్నాడు..వరుస ఓటముల చెన్నైకి గుడ్ న్యూస్..

Chennai Super Kings : చెన్నై జట్టు ప్రస్తుత ఐపీఎల్ లో వరుసగా మూడు మ్యాచ్లలో ఓడిపోయింది. తద్వారా పాయింట్ల పట్టిక లో అధమ స్థానంలో ఉంది. ఒకప్పుడు ఐపీఎల్ మొత్తాన్ని శాసించిన ఆ జట్టు ఇలా దిగజారిపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. చెన్నై జట్టు త్వరగా కం బ్యాక్ ఇవ్వాలని వారు కోరుకుంటున్నారు.

కేవలం అభిమానులు మాత్రమే కాదు.. మాజీ ఆటగాళ్లు కూడా చెన్నై జట్టు బౌన్స్ బ్యాక్ అన్నట్టుగా ఆడాలని సూచిస్తున్నారు. మెరుగైన ప్లేయర్లు ఉన్నప్పటికీ.. చెన్నై జట్టులో బౌలింగ్ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా చివరి ఓవర్లలో చెన్నై బౌలర్లు చేతులెత్తేస్తున్నారు. ఫలితంగా పరుగుల వరద పారుతోంది. ఆదివారం బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో చెన్నై బౌలర్లు పూర్తిగా లయ తప్పారు. చివరి 5 ఓవర్లలో దారుణంగా పరుగులు ఇచ్చారు.

బౌలింగ్ లోపాలు ఇబ్బంది పెడుతుంటే.. బ్యాటింగ్లో కూడా అదే స్థాయి ప్రదర్శించడం వల్ల చెన్నై జట్టు ఓటములను కొని తెచ్చుకుంటున్నది. కొంతమంది బ్యాటర్లు సరిగా ఆడలేకపోవడం వల్ల చెన్నై జట్టు తగిన మూల్యాన్ని చెల్లించుకున్నది. ఈ నేపథ్యంలో చెన్నై జట్టుకు ఓ శుభవార్త అందింది. చెన్నై జట్టు డేంజర్ ఆటగాడు బ్రేవిస్ త్వరలోనే అందుబాటులోకి వస్తాడని తెలుస్తోంది.

గాయం వల్ల సరైన సామర్థ్యాన్ని అందుకోడంలో విఫలమైన అతడు.. కొంతకాలంగా చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో అతడు పూర్తిస్థాయిలో కోలుకున్నాడని.. సామర్థ్యాన్ని కూడా నూటికి నూరు శాతం అందుపుచ్చుకున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇదే గనుక జరిగితే బ్రేవిస్ తదుపరి మ్యాచ్ కు అందుబాటులోకి వస్తాడని తెలుస్తోంది. అదే జరిగితే చెన్నై జట్టుకు 1000 ఏనుగుల బలం లభిస్తుంది. ఎందుకంటే ఓపెనర్లు.. మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు చెన్నై జట్టులో విఫలమవుతున్నారు. సర్ఫ రాజ్, ఓవర్టన్, ప్రశాంత్ వీర్ మాత్రమే పరవాలేదు అనిపిస్తున్నారు. మిగతా వాళ్లంతా దారుణంగా విఫలమవుతున్నారు. బ్రేవిస్ జట్టులోకి వస్తే.. మిడిల్ ఆర్డర్ బలంగా ఉంటుందని చెన్నై జట్టు భావిస్తోంది.

భయం అనేది లేకుండా బ్రేవిస్ బ్యాటింగ్ చేస్తాడు. ఎలాంటి బంతులు అయినా సరే బ్రేవిస్ ఎదుర్కొంటాడు. గతంలో చెన్నై జట్టుకు అతడు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. గాయం వల్ల జట్టుకు దూరమయ్యాడు. ఇప్పుడు పూర్తి స్థాయిలో సామర్థ్యాన్ని సాధించడంతో అతడు తదుపరి మ్యాచ్ కు జట్టులోకి అందుబాటులోకి వస్తాడని తెలుస్తోంది. బ్రేవిస్ జట్టులోకి వస్తాడని తెలియగానే చెన్నై అభిమానులు సంబరాలు చేసుకుంటారు. సోషల్ మీడియా వేదికగా అతడికి ఘన స్వాగతం పలుకుతున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular