Rishabh Pant LSG win: ప్రస్తుత ఐపీఎల్ లో తొలి మ్యాచ్ లో లక్నో జట్టు ఢిల్లీ చేతిలో ఓడిపోయింది. ఈ ఓటమి నేపథ్యంలో లక్నో జట్టు యజమాని సంజీవ్ గోయంక కెప్టెన్ రిషబ్ పంత్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. పంత్ కూడా ఒకరకమైన ఆత్మ న్యూనతాభావంతో కనిపించాడు.
ఈ పరిణామం తర్వాత పంత్ మీద విపరీతమైన ఒత్తిడి ఏర్పడింది. ఈ క్రమంలో ఆదివారం హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయం లక్నో జట్టుకు సంజీవని లాగా మారింది. స్పందన పాయింట్ల పట్టికలో ఆ జట్టు ఏడవ స్థానానికి చేరుకుంది.. ఢిల్లీ జట్టుతో జరిగిన మ్యాచ్ లో ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయిన లక్నో.. హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.
ఈ విజయం తర్వాత లక్నో జట్టు యజమాని సంజీవ్ ఆనందం వ్యక్తం చేశాడు. మైదానంలో నవ్వులు చిందించాడు. తన జేబులో ఉన్న వెంకటేశ్వర స్వామి ఫోటో తీసి నమస్కారం పెట్టుకున్నాడు. అంతేకాదు హైదరాబాద్ అభిమానులతో సరదాగా ముచ్చటించాడు. మ్యాచ్ గెలిచిన అనంతరం హైదరాబాద్ యజమాని కావ్య మారన్ తో సరదాగా సంభాషించాడు. సంజీవ్ నవ్వులు చిందించడంతో సోషల్ మీడియాలో దానికి సంబంధించిన ఫోటోలు విపరీతంగా సర్కులేట్ అవుతున్నాయి.
ఈ విజయం తర్వాత పంత్ కూడా ఉత్సాహంతో కనిపించాడు. జట్టు కోసం అతడు వీరోచితమైన హాఫ్ సెంచరీ చేశాడు. అంతేకాదు నాట్ అవుట్ గా నిలిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. పంత్ అద్భుతంగా ఆడిన నేపథ్యంలో అతడికి మెన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం లభించింది. పంత్ ఆటతీరుతో అటు సంజీవ్.. ఇటు లక్నో అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. ఐపీఎల్ లో మిగతా జట్ల యజమానులు గెలుపు ఓటములను సమానంగా తీసుకుంటారు. కానీ లక్నో జట్టు యజమాని మాత్రం ఓటమిని అంత ఈజీగా అంగీకరించడు. ఆడే ప్రతి మ్యాచ్లో తన జట్టు గెలవాలని ఆయన కోరుకుంటాడు. ఓటమి ఎదురైతే తట్టుకోలేక అసహనానికి గురవుతుంటాడు. అంతేకాదు సోషల్ మీడియాలో కూడా విపరీతంగా విమర్శలకు గురవుతుంటాడు. ఇటీవల ఐపీఎల్ పూర్వ చైర్మన్ లలిత్ మోడీ సంజీవ్ ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. అతడు ఒక లూజర్ అని.. జోకర్ అని విమర్శించాడు.