Homeక్రీడలుక్రికెట్‌Punjab cricket team bad luck: బెంగళూరును గెలికింది.. అప్పటి నుంచే దరిద్రం పంజాబ్ చుట్టూ...

Punjab cricket team bad luck: బెంగళూరును గెలికింది.. అప్పటి నుంచే దరిద్రం పంజాబ్ చుట్టూ వైఫై లాగా తిరుగుతోంది..

Punjab cricket team bad luck: అత్తారింటికి దారేది అనే సినిమా చూశారా.. అందులో ఆలిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ఓ డైలాగ్ అంటాడు. నీకు అదృష్టం మెయిన్ డోర్ తట్టేలోగా.. దురదృష్టం బ్యాక్ డోర్ నుంచి బెడ్ రూమ్ లోకి వచ్చేసింది.. ఇక నిన్ను ఎవడూ బాగు చేయలేడు అంటాడు.. సేమ్ ఇప్పుడు పంజాబ్ జట్టు పరిస్థితి ఐపీఎల్లో అలాగే ఉంది. అద్భుతమైన ప్లేయర్లు ఉన్నారు. భీకరమైన బౌలర్లు ఉన్నారు. కానీ ఆ జట్టుకు ఏదీ […]

Punjab cricket team bad luck: అత్తారింటికి దారేది అనే సినిమా చూశారా.. అందులో ఆలిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ఓ డైలాగ్ అంటాడు. నీకు అదృష్టం మెయిన్ డోర్ తట్టేలోగా.. దురదృష్టం బ్యాక్ డోర్ నుంచి బెడ్ రూమ్ లోకి వచ్చేసింది.. ఇక నిన్ను ఎవడూ బాగు చేయలేడు అంటాడు.. సేమ్ ఇప్పుడు పంజాబ్ జట్టు పరిస్థితి ఐపీఎల్లో అలాగే ఉంది. అద్భుతమైన ప్లేయర్లు ఉన్నారు. భీకరమైన బౌలర్లు ఉన్నారు. కానీ ఆ జట్టుకు ఏదీ కలిసి రావడం లేదు.

ఈ ఐపీఎల్లో పంజాబ్ జట్టు వరుసగా విజయాలు సాధించింది. సర్పంచ్ సాబ్ అయ్యర్ మీద ప్రశంసల జల్లు మొదలైంది.. ఇంకేముంది పంజాబ్ ఈసారి కూడా ఫైనల్ వెళ్తుందని అందరూ అనుకున్నారు. ట్రోఫీ కూడా సాధిస్తుందని అంచనాలు వేసుకున్నారు. కొందరైతే టీమ్ ఇండియాకు కాబోయే కెప్టెన్ అయ్యర్ అంటూ కొత్త కొత్త సూత్రీకరణలకు దిగారు. కానీ ఆ తర్వాత పరిస్థితి మారిపోయింది. వరుస విజయాలు ఉత్సాహాన్ని రేపితే.. ఆ తర్వాత ఎదురైన వరుస ఓటములు పంజాబ్ జట్టు పరువు తీస్తున్నాయి. చివరికి ప్లే ఆఫ్ ఆశలు కూడా అత్యంత సంక్లిష్టంగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో పంజాబ్ జట్టు గ్రూప్ దశ నుంచి నిష్క్రమించే పరిస్థితులు ఏర్పడ్డాయి.

వరుస విజయాలు సాధించిన పంజాబ్ జట్టు.. ఇలా దిగజారి పోవడాన్ని ఆ జట్టు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అసలు తమ జట్టుకు ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఒక సంఘటన ను వారు గుర్తు చేసుకుంటున్నారు. ముఖ్యంగా బెంగళూరు తో పోటీపడిన ప్రతిసారి పంజాబ్ జట్టు ఓడిపోవడానికి ఆ జట్టు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

2017లో ఏప్రిల్ 28న రాజస్థాన్ రాయల్స్ పై పంజాబ్ 4.3 ఓవర్లలో 49 పరుగులు చేసింది. ఆ తర్వాత 49/1 అంటూ 2017లో 49కే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆల్ అవుట్ అయిన చెత్త రికార్డును టార్గెట్ చేస్తూ ట్వీట్ చేసింది. అప్పటినుంచి పంజాబ్ జట్టు బెంగళూరు తో తలపడిన అన్ని మ్యాచ్లలో ఓడిపోయింది.

తమను గేలి చేసారని.. అప్పటినుంచి పంజాబ్ జట్టుకు దురదృష్టం వెంటాడుతోందని బెంగళూరు ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. నిన్న విజయం సాధించిన తర్వాత మళ్ళీ అలా చేయకూడదని పంజాబ్ జట్టుకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు గట్టిగా కౌంటర్ ఇచ్చింది. ఇంకోసారి ఇలా చేస్తే పరిణామాలు వేరే విధంగా ఉంటాయని పరోక్షంగా హెచ్చరికలు జారీ చేసింది. తద్వారా పంజాబ్ జట్టు ఇకపై ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటుందని.. క్రికెట్లో ప్రొఫెషనలిజాన్ని ప్రదర్శిస్తుందని విశ్లేషకులు వ్యాఖ్యలు చేస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper