Sanju Samson Vs Heinrich Klaasen: చెన్నై మైదానంలో హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఉత్కంఠ సన్నివేశం చోటుచేసుకుంది. అప్పటిదాకా మ్యాచ్ హోరాహోరీగా సాగుతోంది. ఈ ఎపిసోడ్ తో ఒకసారిగా హీట్ లెవెల్ పెరిగిపోయింది. దీంతో అంపైర్లు మధ్యలో కల్పించుకోవాల్సి వచ్చింది. ఫలితంగా ఆ గొడవ సద్దుమణిగింది.
చెన్నై జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో.. హైదరాబాద్ జట్టు చేజింగ్ మొదలుపెట్టింది. అప్పటికి హైదరాబాద్ ప్లేయర్లు అభిషేక్ శర్మ, హెడ్ ఔట్ అయ్యారు. కిషన్, క్లాసెన్ ఆడుతున్నారు. ఈ దశలో క్లాసెన్ హాఫ్ సెంచరీకి దగ్గరగా ఉన్నాడు. తక్కువ బంతుల్లోనే ఎక్కువ పరుగులు చేయడంతో చెన్నై జట్టు తీవ్ర ఇబ్బందులలో పడింది. పూర్తి ప్రమాదకరంగా మారిపోయిన కిషన్, క్లాసెన్ జోడిని విడగొట్టేందుకు అనేక రకాలుగా ప్రయత్నాలు చేశాడు చెన్నై జట్టు కెప్టెన్. చివరికి క్లాసెన్ అనుకున్నట్టుగానే బుట్టలో పడ్డాడు. అప్పటిదాకా బౌండరీ లో వర్షం కురిపించిన అతడు..భారీ షాట్ కొట్టేందుకు ప్రయత్నించాడు. ఈ దశలో బంతి మిస్ అయింది. కీపర్ సంజు చేతిలో పడింది. అతడు కేవలం రెప్పపాటు వ్యవధిలో స్టంపులను నేల కూల్చాడు.
ఈ వికెట్ పడిన తర్వాత చెన్నై జట్టులో ఆనందం తారాస్థాయికి చేరింది. అయితే స్టంపు అవుట్ చేసిన తర్వాత సంజు ఎగిరి గంతులు వేశాడు. ఈ దశలో క్లాసెన్ పెవిలియన్ వెళుతుండగా సంజు సీరియస్ గా చూశాడు. దీంతో కోపగించుకున్న క్లాసెన్ సంజు వైపు కోపంతో వచ్చాడు. అదే కోపంలో ఏదో మాట అన్నాడు. నీతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకునే వాతావరణం ఏర్పడింది. అంపైర్ వచ్చి ఇద్దరినీ శాంతింప చేశాడు. దీంతో మైదానంలో మళ్లీ యధాస్థితి వాతావరణం నెలకొంది.
సాధారణంగా సంజు శాంతంగా ఉంటాడు.. క్లాసెన్ కూడా ప్రశాంతంగా బ్యాటింగ్ చేస్తూ ఉంటాడు. అటువంటి వీరిద్దరూ లయ తప్పడం ఒక్కసారిగా అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలిపోవడంతో ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అంపైర్ వచ్చి సర్ది చెప్పడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. లేకుంటే వేరే విధంగా ఉండేదని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. నిన్నటి మ్యాచ్లో వీరిద్దరి మధ్య జరిగిన వాగ్వాదం హైలైట్ గా నిలిచిందని కొంతమంది అభిమానులు సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు.
Look at the clash between Sanju Samson and Henrich Klassen
– Klassen couldn’t control his anger after getting out#CSKvsSRH #SRHvsCSKpic.twitter.com/naL1pkGgQ5
— Raja (@_raja_kumar) May 18, 2026
