Homeజాతీయ వార్తలుVijay Sangeetha Divorce: సీఎం విజయ్‌తో విడాకులు క్యాన్సిల్.. తెరవెనుక ఏం జరిగిందంటే..

Vijay Sangeetha Divorce: సీఎం విజయ్‌తో విడాకులు క్యాన్సిల్.. తెరవెనుక ఏం జరిగిందంటే..

Vijay Sangeetha Divorce: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్.. ఆయన భార్య సంగీత కొంతకాలంగా విడిగా ఉంటున్నారు. వీళ్ళిద్దరికీ ఇద్దరు పిల్లలు. అమ్మాయి విదేశాల్లో చదువుతుండగా.. అబ్బాయి దర్శకుడిగా రాణిస్తున్నాడు. ఇతడు సందీప్ కిషన్ హీరోగా సిగ్మా అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. త్వరలోనే ఆ సినిమా విడుదల కాబోతోంది. విజయ్, సంగీత మధ్య చాలా రోజులుగా విభేదాలు ఉన్నాయి. దీంతో వారిద్దరు విడిగా ఉంటున్నారు. పిల్లలు సంగీత వద్ద ఉంటున్నారు. విజయ్ పార్టీ పెట్టినప్పుడు.. కరూర్ ప్రాంతంలో […]

Vijay Sangeetha Divorce: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్.. ఆయన భార్య సంగీత కొంతకాలంగా విడిగా ఉంటున్నారు. వీళ్ళిద్దరికీ ఇద్దరు పిల్లలు. అమ్మాయి విదేశాల్లో చదువుతుండగా.. అబ్బాయి దర్శకుడిగా రాణిస్తున్నాడు. ఇతడు సందీప్ కిషన్ హీరోగా సిగ్మా అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. త్వరలోనే ఆ సినిమా విడుదల కాబోతోంది.

విజయ్, సంగీత మధ్య చాలా రోజులుగా విభేదాలు ఉన్నాయి. దీంతో వారిద్దరు విడిగా ఉంటున్నారు. పిల్లలు సంగీత వద్ద ఉంటున్నారు. విజయ్ పార్టీ పెట్టినప్పుడు.. కరూర్ ప్రాంతంలో తొక్కిసలాట జరిగినప్పుడు.. ఎన్నికలలో ఆయన పార్టీ అత్యధిక స్థానాలను సాధించినప్పుడు.. విజయ్ రెండు నియోజకవర్గాలలో ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నికైనప్పుడు.. ఇలా ఏ సందర్భంలో విజయ్ తో ఆయన కుటుంబం లేదు. పైగా ఓ నటితో విజయ్ దగ్గరగా ఉంటున్నారని ప్రచారం మొదలైంది. విజయ్, ఆమెకు మధ్య రిలేషన్ ఉందని తమిళనాడులో రకరకాల ఊహాగానాలు వినిపించాయి. డీఎంకే ఎమ్మెల్యే ఉదయనిది ఇటీవల ఆ నటిని ఉద్దేశించి దారుణమైన వ్యాఖ్యలు చేశారు.

తమిళనాడులో ఇంత జరుగుతున్న నేపథ్యంలో.. విజయ్ అనేక రకాలుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రమంలో.. ఆయన భార్య కీలక నిర్ణయం తీసుకుంది. తన భర్తతో విడాకులు తీసుకునే వ్యవహారానికి సంబంధించి కేసును వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించింది. దీంతో చెంగల్పట్టు కోర్టు ఈ కేసును శాశ్వతంగా మూసివేసింది. ఈ పరిణామం నేపథ్యంలో విజయ్, సంగీత మళ్లీ కలిసి పోతున్నారా అనే ప్రచారం మొదలైంది. ఇటీవల విజయ్ కుమారుడు జేసన్ తన తండ్రి మీద సానుకూలంగా మాట్లాడాడు. ఆయన హీరోగా నటిస్తే చూడాలని ఉందని.. ఆ సినిమాకు తానే దర్శకత్వం వహిస్తానని ప్రకటించాడు. అటు భార్య విడాకులు వెనక్కి తీసుకోవడం.. దానికంటే ముందు కుమారుడు విజయ గురించి సానుకూలంగా మాట్లాడటంతో.. మొత్తానికి విజయ్ కుటుంబం కలిసిపోయే అవకాశం ఉందని రాజకీయ వర్గాలలో ప్రచారం జరుగుతోంది.

విజయ్ విడాకులు తీసుకునే విషయంలో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడంలో రకరకాల వ్యవహారాలు జరిగాయని తెలుస్తోంది. ముఖ్యంగా సంగీత భర్తతో కలిసి ఉండడానికి సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది.. ఇరు వర్గాలకు సంబంధించిన కుటుంబ సభ్యులు చర్చలు జరిపారని.. అందువల్లే సంగీత తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్టు ప్రచారం జరుగుతుంది. పిల్లలు కూడా తండ్రితో కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారని.. వాళ్ల నిర్ణయం మేరకు సంగీత విడాకులను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించిందని సమాచారం.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper