Varun Tej: మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘కొరియన్ కనకరాజు’ నేడు భారీ అంచనాల నడుమ విడుదలై పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. సినిమాలో కొన్ని సన్నివేశాలు చాలా సిల్లీ గా ఉన్నప్పటికీ , వరుణ్ తేజ్ , సత్య కామెడీ టైమింగ్ కారణంగా ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్ వచ్చింది. కొంతమందికి అయితే కామెడీ పిచ్చిపిచ్చిగా నచ్చేసింది. దీంతో ఈ చిత్రానికి అన్ని ప్రాంతాల్లోనూ ఓపెనింగ్స్ కూడా అదిరిపోయాయి. అదే సమయం లో ఈ సినిమా ఇప్పుడు ఒక సరికొత్త వివాదం లో చిక్కుకోవడం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. కమెడియన్ సత్య సీనియర్ ఎన్టీఆర్ ని ఇమిటేట్ చేస్తూ అవమానించాడని , తక్షణమే ఈ సన్నివేశాన్ని సినిమా నుండి తొలగించాలని నందమూరి ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.
సోషల్ మీడియా లో నేడు ఉదయం నుండి ఈ సన్నివేశం గురించే చర్చ. ఇది కాసేపు పక్కన పెడితే, ఈ సినిమా విడుదలకు ముందు వరుణ్ తేజ్ , కమెడియన్ సత్య , తమన్ కలిసి ఒక ఫన్నీ ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూ లో వరుణ్ తేజ్ , తమన్ లు కలిసి నిహారిక ని ఆట పట్టించిన వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే నిహారిక నిర్మాతగా , వరుణ్ తేజ్ హీరో గా ‘బరి’ అనే సినిమా తెరకెక్కబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ‘కమిటీ కుర్రాళ్ళు’ చిత్రానికి దర్శకత్వం వహించిన ‘యాదు’ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. వాలీ బాల్ నేపథ్యం లో ఈ సినిమా తెరకెక్కనుంది. అయితే షూటింగ్ లో పాల్గొనే ముందు వాలీ బాల్ ప్రాక్టీస్ చేస్తున్న వరుణ్ తేజ్ మోకాళ్ళకు తీవ్రమైన గాయం జరిగిన సంగతి తెలిసిందే.
ఆయనకు సర్జరీ కూడా చేయాల్సి వచ్చింది. ఈ అంశం గురించి ఈ ఇంటర్వ్యూ లో తమన్ , వరుణ్ తేజ్ కలిసి నిహారిక ని ఆట పట్టించారు. ముందుగా నిహారిక వరుణ్ తేజ్ తో మాట్లాడుతూ ‘మీ వల్ల ఇంకో సినిమా షూటింగ్ పోస్ట్ పోన్ అయ్యింది అనేది అనిపిస్తుందా మీకు అసలు.. ప్రొడక్షన్ చేసుకోవాల్సిన దాన్ని ఇప్పుడు ఇంటర్వ్యూలు చేసుకుంటున్నాను మీ వల్ల’ అని అంటుంది. దానికి వరుణ్ తేజ్ కౌంటర్ ఇస్తూ ‘అసలు ఎవరి వల్ల ఇదంతా అయ్యింది అనేది మాట్లాడుకుంటే, రాళ్లు ఉన్న చోట షూటింగ్ చేయించింది , ఒక లారీ మట్టి తీసుకొచ్చి ఉండుంటే ఈరోజు నా మోకాళ్ళు విరిగేవి కాదు’ అంటూ చెప్పుకొచ్చాడు. ఈ ఫన్నీ ఇంటర్వ్యూ ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూసేయండి.