Homeఎంటర్టైన్మెంట్Super hit song remix in Aadarsha Kutumbam: 'ఆదర్శ కుటుంబం' సినిమాలో ఆ సూపర్...

Super hit song remix in Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ సినిమాలో ఆ సూపర్ హిట్ సాంగ్ ను రీమిక్స్ చేస్తున్నారా…

Super hit song remix in Aadarsha Kutumbam: వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమా కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతుంది. ఈ సినిమా విషయంలో త్రివిక్రమ్ చాలా స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమాని చాలా హంగులు ఆర్భాటాలతో చిత్రీకరిస్తున్నాడట. అయితే ఈ సినిమాలో వెంకటేష్ క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉండబోతుందనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇక ఇప్పటివరకు వెంకటేష్ చేసిన పాత్రలను మించి ఈ […]

Super hit song remix in Aadarsha Kutumbam: వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమా కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతుంది. ఈ సినిమా విషయంలో త్రివిక్రమ్ చాలా స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమాని చాలా హంగులు ఆర్భాటాలతో చిత్రీకరిస్తున్నాడట. అయితే ఈ సినిమాలో వెంకటేష్ క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉండబోతుందనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇక ఇప్పటివరకు వెంకటేష్ చేసిన పాత్రలను మించి ఈ పాత్ర ఉంటుందట. యాక్షన్ ఎపిసోడ్స్ ను సైతం వెంకటేష్ చాలా ఎఫెక్టివ్ గా చేయబోతున్నారట.

ఈ సినిమాను సక్సెస్ ఫుల్ గా నిలుపడానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ శత విధాలుగా ప్రయత్నం చేస్తున్నాడనే వార్తలైతే వస్తున్నాయి. ఇక ఇప్పటివరకు ఆయన నుంచి వచ్చిన సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. కాబట్టి ఇప్పుడు రాబోతున్న ఈ సినిమా కూడా అభిమానులతో పాటు సగటు ప్రేక్షకులను సైతం మెప్పిస్తుందని సినిమా యూనిట్ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఈ సినిమాలో వెంకటేష్ ఒకప్పటి సూపర్ హిట్ సాంగ్ ను రీమిక్స్ చేయాలని చూస్తున్నారట. ఇంతకీ ఆ సాంగ్ ఏంటంటే ‘బొబ్బిలి రాజా’ సినిమాలో బలపం పట్టి భామ బళ్లో అనే సాంగ్ ని ఈ సినిమాలో రీమిక్స్ చేస్తున్నారట. మొత్తానికైతే ఈ సాంగ్ డిఫరెంట్ గా ఉండబోతుందట. దానిని స్క్రీన్ మీద చూస్తే ఇంకా బాగా అదిరిపోతుందని సినిమా యూనిట్ నుంచి కొన్ని వార్తలైతే వస్తున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుంది.

అటు వెంకటేష్ కి, ఇటు త్రివిక్రమ్ కి సక్సెస్ ను తీసుకొచ్చి సినిమా అవుతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. వెంకటేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా అంటే ఆ సినిమాలో కామెడీ విపరీతంగా ఉంటుందని ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. మరి దానికి తగ్గట్టుగానే కామెడీ సన్నివేశాలైతే చిత్రీకరిస్తున్నట్టుగా తెలుస్తుంది. దానికి తగ్గట్టుగానే ఈ సినిమాని చిత్రీకరిస్తున్నారట…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper