spot_img
Homeఆధ్యాత్మికంToday Horoscope In Telugu: ఈ రాజుల వారికి ఈరోజు రాజయోగం.. అన్ని పనులు పూర్తి...

Today Horoscope In Telugu: ఈ రాజుల వారికి ఈరోజు రాజయోగం.. అన్ని పనులు పూర్తి చేయగలుగుతారు..

Today Horoscope In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం ద్వాదశరాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే రోజు త్రిపుష్కర యోగం ఏర్పడనుంది. దీంతో కొన్ని రాశుల వారు అనుకున్న పనులను వెంటనే పూర్తి చేస్తారు. మరికొన్ని రాశుల వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వారు ఈరోజు మానసికంగా ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. లేకుంటే తీవ్రంగా నష్టం కలిగే అవకాశం ఉంది. వ్యాపారులు కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారాలకు కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. జీవిత భాగస్వామితో ఏదో ఒక విషయంలో గొడవ ఉంటుంది. దీంతో వాదనలకు గుర అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగులు ఉల్లాసంగా ఉంటారు. అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : . ఈ రాశి వారు ఈ రోజు ఉల్లాసంగా ఉంటారు. వెళ్తారు. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. మానసికంగా ప్రశాంతంగా కనిపిస్తారు. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కొన్ని పనులు పూర్తి చేయడంతో సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగులు ఆటంకం లేకుండా కొన్ని లక్ష్యాలను పూర్తి చేస్తారు. దీంతో అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగులు పదోన్నతి పొందే అవకాశం ఉంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు.

మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): . ఈ రాశి వారి కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. చట్టపరమైన చిక్కుల్లో పడే అవకాశం ఉంది. అయితే ఏదైనా వివాదం జరిగేటప్పుడు మాటను అదుపులో ఉంచుకోవాలి. దూర ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. సొంత వాహనాలపై ఎటువంటి ప్రయాణాలు చేయవద్దు. శారీరకంగా ఏ చిన్న అనారోగ్యం ఏర్పడిన వెంటనే వైద్యుడుని సంప్రదించాలి. జీవిత భాగస్వామితో వాదనలు ఉంటాయి. కుటుంబంలో ఒకరితో జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఏదైనా వ్యాధితో బాధపడితే వెంటనే వైద్యుడు సంప్రదించాలి. ఈరోజు మనసు ఆందోళనకరంగా ఉంటుంది. అయితే విహారయాత్రలకు వెళ్లాలని ప్లాన్ చేసేవారు కొన్ని రోజులు వాయిదా వేసుకోవడం మంచిది. స్నేహితుల్లో ఒకరు ధన సహాయం చేస్తారు. కుటుంబ సభ్యుల నుంచి కొన్ని నిరాశకరమైన వార్తలు వింటారు. పిల్లల కెరీర్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఉద్యోగులు ఉన్నతాధికారాల నుంచి ప్రశంసలు పొందుతారు.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : . ఈ రాశి వారికి ఈ రోజు శుభ ఫలితాలు కలగనున్నాయి. వ్యాపారులకు వదిన ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులు కొత్త లక్ష్యాలను పూర్తి చేస్తారు. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. సొంత వాహనాలపై వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలి. ఇంటికి అతిధి రావడంతో సందడిగా ఉంటుంది. బంధువుల నుంచి ధన సహాయం అందుతుంది.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : . ఈ రాశి వ్యాపారులు కొత్త ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. ఓ ప్రత్యేకమైన వ్యక్తిని కలుస్తారు. ఇతనితో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగం కోసం ఎదురుచూసేవారికి శుభవార్తలు వింటారు. ఉద్యోగులు లక్ష్యాలను పూర్తి చేయడంతో అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. ఆర్థికంగా మెరుగైన ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. వ్యాపారులు కొన్ని రిస్కులు తీసుకుంటే అభి ప్రయోజనాలు కలిగిస్తాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారికి పెండింగ్ బకాయిలు వసూలు అవుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల్లో ఒకరితో వాదన ఉండే అవకాశం ఉంటుంది. మాటలను అదుపులో ఉంచుకోవడం వల్ల సమస్య పరిష్కారం అవుతుంది. అనవసరమైన తగాదాలకు దూరంగా ఉండటమే మంచిది. వాహనాలపై వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు. అయితే విద్యార్థుల విషయంలో ఒత్తిడి అసలు పనిచేయదు.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు విహారయాత్రలకు వెళ్లాలని ప్లాన్ చేస్తారు. స్నేహితులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. వ్యాపారులు కొత్త ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. అయితే ఈ సమయంలో పెద్దల సలహా తప్పనిసరిగా అవసరం ఉంటుంది. మరోవైపు శత్రులపై కన్నేసి ఉంచాలి. శారీరకంగా ఆరోగ్యం క్షేనించే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉండొద్దు. బంధువుల్లో ఒకరి నుంచి ధన సహాయము అందుతుంది..

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : . ఈ రాశి వారు ఏ పని మొదలుపెట్టిన ఈరోజు పూర్తి చేయగలుగుతారు. కొందరు అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నించిన అనుకున్న పనిని అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామితో వాదనలు ఉంటాయి. అయితే మాటలను అదుపులో ఉంచుకోవడం వల్ల సమస్య పరిష్కారం అవుతుంది. కుటుంబంలో ఒకరితో సంతోషంగా ఉంటారు. ఇంటికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తారు.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈ రోజు ఉల్లాసంగా ఉంటారు. ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ అనురాగాలు పెంపొందుతాయి. మాటల మాధుర్యంతో సమాజంలో గుర్తింపు లభిస్తుంది. పాతవివాదాలు ఉంటే నేటితో పరిష్కారం అవుతుంది. బకాయిలు వసూలు అవుతాయి. ఆదాయం మెరుగుపడుతుంది. కొత్తగా ప్రాజెక్టులు ప్రారంభించే వారు పెద్దల సలహా తీసుకోవాలి.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) :. ఈ రాశి వారు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. చిన్న సమస్య అయినా నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఓ ప్రయాణం కలిసి రావచ్చు. ప్రసంగానే నియంత్రించుకోవాలి. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామితో వాదన ఉండే అవకాశం. కోర్టుకు సంబంధించి కొన్ని శుభవార్తలు వింటారు. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : . ఈ రాశి వారు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ప్రియమైన వారి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం విషయంలో మీ విచారకరమైన వార్తలు వింటారు. కుటుంబంలో ఒకరి ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. ఉద్యోగులు అనుకున్న లక్ష్యాలను పూర్తి చేస్తారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
RELATED ARTICLES

Most Popular