Child Safety: కారులో ప్రయాణించేటప్పుడు ప్రమాదాల ముప్పు ఎప్పుడూ ఉంటుంది. కేవలం 3 – 4 వేల రూపాయల ఖర్చుతో లభించే ఈ పరికరాన్ని నిర్లక్ష్యం చేయడం ద్వారా మీరు మీ పిల్లల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. ఇది ప్రమాద సమయంలో వారి గాయాల నుండి ప్రాణ నష్టం వరకు ప్రమాదాన్ని పెంచుతుంది. ఇక్కడ మనం చైల్డ్ కార్ సీట్ సేఫ్టీ హార్నెస్ గురించి చర్చించుకుంటున్నాం. కారులో పిల్లల భద్రత కోసం ఇది చాలా ప్రభావవంతమైన పరికరం. ఇది ప్రమాద సమయంలో పిల్లలను గాయాల నుండి కాపాడుతుంది. వెనుక సీటులో కూర్చున్న పిల్లలను సురక్షితంగా ఉంచుతుంది.
చైల్డ్ కార్ సీట్ హార్నెస్ ఎన్ని రకాలు?
చైల్డ్ కార్ సీట్ హార్నెస్ ప్రధానంగా రెండు రకాలుగా లభిస్తుంది. ఒకటి 5-పాయింట్ హార్నెస్, మరొకటి 3-పాయింట్ హార్నెస్. 5-పాయింట్ హార్నెస్ మీ పిల్లల రెండు భుజాలు, రెండు తుంటి, కాళ్ళ మధ్య ఒక ప్రదేశం నుండి కట్టడానికి ఉపయోగపడుతుంది. ప్రమాద సమయంలో పిల్లల శరీరంపై పనిచేసే శక్తిని భుజాలు,తుంటి వంటి బలమైన భాగాలపై సమానంగా పంపిణీ చేస్తుంది. ఇది కడుపు వంటి మృదువైన భాగాలపై ఒత్తిడిని తగ్గిస్తుంది.
3-పాయింట్ హార్నెస్ వాస్తవానికి పెద్దల సీటు బెల్టు చిన్న పరిమాణం. ఇది సాధారణంగా 5 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ఉత్తమమైనది. చిన్న పిల్లలకు 5-పాయింట్ హార్నెస్ మరింత సురక్షితమైనది. మీరు పిల్లల కోసం సీటు హార్నెస్ కొనుగోలు చేసేటప్పుడు.. దాని పట్టీలు పిల్లలను ఇబ్బంది పెట్టకుండా, వారి శరీరానికి సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోండి. సీటు హార్నెస్ సరిగ్గా అమర్చాలి. లేకపోతే అది సేఫ్టీని అందించదు. పిల్లల పెరుగుతున్న వయస్సుతో సర్దుబాటు చేయడానికి చైల్డ్ కార్ సీట్ హార్నెస్ సర్దుబాటు చేయగలగాలి.
చైల్డ్ కార్ సీట్ హార్నెస్ ఎందుకు అవసరం?
కారు ప్రమాదానికి గురైనప్పుడు ఈ సీటు హార్నెస్ మీ పిల్లలను సీటు నుండి జారిపోకుండా లేదా కారు లోపల ఢీకొనకుండా చేస్తుంది. ఇది తీవ్రమైన గాయం లేదా ప్రాణ నష్టం ప్రమాదాన్ని బాగా తగ్గిస్తుంది. 5-పాయింట్ సీటు హార్నెస్ ప్రమాద శక్తిని పిల్లల శరీరం బలమైన భాగాలపై వ్యాపింపజేస్తుంది. ఇది బలహీనమైన భాగాలపై ఒత్తిడిని తగ్గిస్తుంది. వేగంగా కారు నడుపుతున్నప్పుడు సీటు హార్నెస్ పిల్లలు సీటుపై సరైన స్థితిలో ఉండేలా చేస్తుంది. ముఖ్యంగా ఆకస్మిక మలుపులు లేదా బ్రేకులు వేసినప్పుడు పిల్లలకు ఎటువంటి హాని కలగకుండా చూస్తుంది.