Pawan Kalyan and Allu Arjun : చాలా కాలం నుండి అల్లు అర్జున్(Icon Star Allu Arjun) కి మెగా ఫ్యామిలీ హీరోలకి గ్యాప్ బాగా పెరిగిపోయింది అంటూ మీడియా లో ఒక ప్రచారం జోరుగా జరుగుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. రెండు మూడు హిట్లు కొట్టగానే అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ ని దూరం పెట్టి, తానూ మెగా ఫ్యామిలీ కంటే గొప్ప అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడని కొందరు, అదే విధంగా అల్లు అర్జున్ ఎదుగుదల ని తట్టుకోలేక మెగా హీరోలే అల్లు అర్జున్ ని దూరం పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మరికొందరు సోషల్ మీడియాలో కొట్లాడారు. కానీ కష్టమొస్తే మేమంతా ఒక్కటే అని ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంది మెగా ఫ్యామిలీ. ముఖ్యంగా అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు మెగా ఫ్యామిలీ మొత్తం ఎలా నిలబడిందో మనమంతా చూసాము. పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ఆ సమయంలో అల్లు అర్జున్ ని కలవలేకపోయాడు కానీ, చిరంజీవి, నాగబాబు మాత్రం అరెస్ట్ అయిన రోజే అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారు.
Also Read : ఆ ఒక్క విషయం వల్లే అల్లు అర్జున్ కేసు విషయంలో పవన్ కళ్యాణ్ కామ్ గా ఉంటున్నాడు..?
అయితే రీసెంట్ గానే పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్(Mark Shankar) సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయాలపాలైన సంగతి అందరికీ తెలిసిందే. అల్లు అర్జున్ ఈ ఘటన పై అసలు స్పందించలేదు అని సోషల్ మీడియా లో కొంతమంది తీవ్రంగా విమర్శించారు. కానీ నిన్న సాయంత్రం అల్లు అర్జున్ హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి, ఆయన కుటుంబం మొత్తాన్ని కలిసి, మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని, సుమారుగా గంటకు పైగా పవన్ కళ్యాణ్ తో చర్చించి వెళ్ళాడట. దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఫోటోలు బయటకు వస్తాయో లేవో తెలియదు కానీ, ఒకవేళ ఫోటోలు బయటకి వస్తే మాత్రం ఇన్ని రోజులు అభిమానుల మధ్య జరిగిన గొడవలు అన్నిటికి పెద్ద ఫుల్ స్టాప్ పడుతుంది అనుకోవచ్చు.
అల్లు అర్జున్ నంద్యాలకు వెళ్లినప్పటి నుండి ఇరువురి హీరోల మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి కానీ, లేకపోతే సోషల్ మీడియా లో అంతకు ముందు అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ అభిమానుల రిలేషన్ చాలా బలంగా ఉండేది. ఇప్పుడు ఈ ఫోటోలు మళ్ళీ బయటకు వస్తే ఈ ఇరువురి హీరోల అభిమానులు మళ్ళీ పాలు, నీళ్లు లాగా కలిసిపోతారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ వార్త తెలిసిన తర్వాత అభిమానులు సోషల్ మీడియా లో ఎంతో సంతోషిస్తున్నారు. మామయ్య, అల్లుడు మళ్ళీ కలిసిపోయారు అంటూ ట్వీట్స్ వేస్తున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ నటించిన సినిమాలకే అత్యధికంగా ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. మెగా ఫ్యామిలీ లో రామ్ చరణ్ మరియు ఇతర మెగా హీరోల ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ కంటే అల్లు అర్జున్ ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ కి పవన్ కళ్యాణ్ ఎక్కువగా వచ్చాడు.