spot_img
Homeఆధ్యాత్మికంToday 3 March 2026 Horoscope: ఈ మూడు రాశుల వారికి చంద్రగ్రహణం శుభ ఫలితాలు.....

Today 3 March 2026 Horoscope: ఈ మూడు రాశుల వారికి చంద్రగ్రహణం శుభ ఫలితాలు.. ఇందులో మీ రాశి ఉందా..?

Today 3 March 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం ద్వాదశ రాశులపై ముఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే రోజు చంద్రగ్రహణం సందర్భంగా కొన్ని రాశిల వారికి శుభ ఫలితాలు ఉండగా మరికొన్ని రాశుల వారికి సాధారణ స్థితి ఉంటుంది. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వ్యాపారాలు ఈరోజు అప్రమత్తంగా ఉండాలి. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యుల సలహా తీసుకోవాలి. ఉద్యోగులు అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. కానీ ఇదే సమయంలో పని ఒత్తిడి ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే గురువుల మద్దతు అవసరం. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఏర్పడితే వెంటనే పరిష్కరించుకోవాలి.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈరోజు కొన్ని ఫలితాలు పొందాలంటే కష్టపడాల్సి వస్తుంది. విద్యార్థులు పరీక్షల్లో రాణించాలంటే శ్రమించాలి. వ్యాపారులకు ప్రత్యర్థుల బెడద ఉంటుంది. ఉద్యోగులకు అధికారుల నుంచి వేధింపులు ఉంటాయి. అయితే కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. దీంతో విహారయాత్రలకు ప్లాన్ చేస్తారు. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు.

మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వ్యాపారులు ఈరోజు ప్రణాళికతో ముందుకు వెళ్తారు. దీంతో అనుకున్న దానికంటే ఎక్కువగా లాభాలు పొందుతారు. వీరికి పెద్దల మద్దతు ఉండడంతో గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు పొందుతారు. ఉద్యోగులు అదనపు ఆదాయం పొందేందుకు మార్గం ఏర్పడుతుంది. బంధువుల నుంచి ధన సహాయము అందుతుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈ రోజు శ్రమకు తగిన ఫలితం పొందుతారు. అయితే నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థుల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. పెద్దల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. వ్యాపారులు కొత్త వారితో ఆర్థిక వ్యవహారాలు జరపకుండా ఉండాలి. ఉద్యోగులు నైపుణ్యాన్ని ప్రదర్శించడం ద్వారా అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ఈ రోజు సంతృప్తిగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. వ్యాపారులు ఆదాయాన్ని పొందేందుకు కొత్త వ్యక్తులను కలుస్తారు. కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తే ఇదే మంచి సమయం. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఈరోజు తోటి వారితో కలిసి మెలిసి పనిచేస్తారు. దీంతో లాభాలు అధికంగా పొందే అవకాశం ఉంది. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉంటుంది. ప్రియమైన వారికోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామితో కలిసి షాపింగ్ చేస్తారు. దుబారా ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. గ్రహణం సందర్భంగా వీరికి శుభ ఫలితాలు ఉంటాయి. ఇష్ట దైవాన్ని ఎప్పుడు స్మరిస్తూ ఉండడం వల్ల అనుకున్న పనులు నెరవేరుతాయి. బంధువుల నుంచి ధన సహాయం అందుతుంది.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈ రోజు కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించేందుకు ప్రణాళికలు వేస్తారు. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. ఈ రాశి వారికి చంద్రగ్రహణం కలిసి వస్తుంది. వీరు అనుకున్న పనులను పూర్తి చేయగలుగుతారు. అయితే ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టేటప్పుడు పెద్దలను సంప్రదించడం మంచిది.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఈ రోజు శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనవసరపు వివాదాల్లోని తలదూర్చకుండా ఉండాలి. కొత్తగా పెట్టుబడును పెట్టాల్సి వస్తే పెద్దలను సంప్రదించడం మంచిది. ఈ రాశి వారికి ఈ రోజు చంద్రగ్రహణం సాధారణ ఫలితాన్ని ఇస్తుంది. అందువల్ల కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : మీ రాశి వారు ఈ రోజు అన్ని పనులను పూర్తి చేయగలుగుతారు. అయితే కొందరు నిరుత్సాహ పరిచేందుకు ప్రయత్నిస్తారు. ఇలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామితో ఆర్థిక వ్యవహారాలు పంచుకుంటారు. కొత్తగా వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి డబ్బు ఇచ్చే ప్రయత్నం చేయవద్దు.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈరోజు బంధువులతో సంతోషంగా గడుపుతారు. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేసుకుంటారు. కొత్తగా వ్యాపారం పెట్టాలని అందుకు సంబంధించిన కార్యకలాపాలు జరుపుతారు. ముఖ్యమైన విషయాల్లో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈ రోజు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఉద్యోగులకు అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. గతంలో ఆగిపోయిన పనులను ఇప్పుడు పూర్తి చేస్తారు. చంద్రగ్రహణం సందర్భంగా ఈ రాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

INS Mahendragiri

INS Malvan : సైన్యం చేతికి మరో యుద్ధ నౌక… శత్రు సబ్‌మెరైన్లకు ఇక చుక్కలే!

INS Malvan భారత సైన్యం చేతికి మరో యుద్ధ నౌక చేరింది. ఇటీవలే విశాపట్నంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఒక నౌకను నేవీకి అప్పగించారు. తాజాగా భారత నేవీ తన సబ్‌మెరైన్‌ వ్యతిరేక...

Telangana ACB : కిలోల కొద్ది బంగారం.. అంతకుమించి నోట్ల కట్టలు.. ఈ అధికారి అవినీతిలో అనకొండ

Telangana ACB : రెండు కిలోల బంగారం.. 52 లక్షల నగదు.. మూడు కార్లు.. 30 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు.. 20 అత్యంత ఖరీదైన విదేశీ మద్యం సీసాలు.. అంతేకాదు ఆయన...
Harish Rao

Harish Rao : హరీష్ రావును ఎందుకు తొక్కేస్తున్నారు

Harish Rao : భారత రాష్ట్ర సమితిలో ఒకప్పుడు హరీష్ రావు నెంబర్ 2 గా ఉండేవారు. ఎప్పుడైతే కేటీఆర్ అమెరికా నుంచి వచ్చి.. గులాబీ పార్టీ కండువా కప్పుకున్నారో.. అప్పుడే పరిస్థితి...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద...

The Odyssey : క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన లేటెస్ట్ ఎపిక్ బ్లాక్ బస్టర్ 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఓవర్సీస్ మార్కెట్స్ లోనే కాదు , ఈ...
Akhil Akkineni

Akhil Akkineni : ‘లెనిన్’ 12 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ‘మా ఇంటి బంగారం’ ని అందుకోవడం...

Akhil Akkineni : అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా 12 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. మొదటి మూడ్ రోజుల్లోనే బ్రేక్...
Oktelugu Epaper