spot_img
Homeఆధ్యాత్మికంToday 1 October 2025 Horoscope: ఈ రాశి వారికి ముందే పండుగ వాతావరణం.. లాభాలే...

Today 1 October 2025 Horoscope: ఈ రాశి వారికి ముందే పండుగ వాతావరణం.. లాభాలే లాభాలు..

Today 1 October 2025 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై పూర్వాషాడ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈ సమయంలో కొన్ని రాశుల వారు అనుకోకుండా ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వారు ఈ రోజు స్నేహితుల నుంచి మద్దతు పొందుతారు. వైవాహిక జీవితం బాగుంటుంది. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. పిల్లల భవిష్యత్తుపై కీలకమైన నిర్ణయం తీసుకుంటారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించే వారు పెద్దలను సంప్రదించాలి. బంధువుల నుంచి ధన సహాయం అందుతుంది.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈరోజు స్థిరాస్తికి సంబంధించిన శుభవార్తను వింటారు. ఉద్యోగులకు తోటి వారి నుంచి మద్దతు లభిస్తుంది. గతంలో అనుకున్న కొన్ని పనులు ఈరోజు నెరవేరుతాయి. ఇతరులు ధన సహాయం చేసే అవకాశం ఉంది. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ఏవైనా వివాదాలు ఉంటే వాటికి దూరంగా ఉండాలి. స్నేహితులు నుంచి ధన సహాయం అందుతుంది. తల్లిదండ్రుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.

మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వారు నాణ్యమైన ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి. వైవాహిక జీవితంలో విభేదాలు ఉండే అవకాశం ఉంటుంది. అందువల్ల జీవిత భాగస్వామితో మాట్లాడే సమయంలో జాగ్రత్తగా ఉండాలి పిల్లలా అనారోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఒక లక్ష్యాన్ని పూర్తి చేయడంలో తీవ్రంగా కష్టపడాల్సి వస్తుంది. ఈ సమయంలో కొందరు సహాయం చేసే ప్రయత్నం చేస్తారు. స్నేహితుల నుంచి మద్దతు ఉంటుంది.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వ్యాపారులు ఈరోజు మంచి లాభాలను పొందుతారు. ఉద్యోగులు కొత్త వ్యక్తులను కలుస్తారు. ప్రాజెక్టులను పూర్తి చేయడానికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. సొంత వాహనాలపై వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలి. ఇంటి నిర్మాణానికి సంబంధించిన కొన్ని వస్తువులు కొనుగోలు చేస్తారు.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు జీవిత భాగస్వామితో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఏవైనా కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తే పెద్ద సలహా తీసుకోవాలి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. ఉద్యోగులకు శత్రువుల బెడద ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ప్రతి ఒక్కరితో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. తల్లిదండ్రులతో సంతోషంగా ఉంటారు. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఈ రోజు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. గతంలో ఉన్న మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు. విద్యార్థుల ఆరోగ్యపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. మిగిలిపోయిన పనులను ఈరోజు పూర్తి చేస్తారు. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఒక పనిని పూర్తి చేయడానికి తీవ్రంగా కష్టపడాల్సి వస్తుంది. వ్యాపారులు అనుకోకుండానే తగిన ఫలితాలు పొందుతారు. దూర ప్రయాణం చేయాల్సివస్తుంది.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : . ఈ రాశి వారికి సమాజంలో గౌరవం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. స్నేహితులతో కలిసి విహారయాత్రాలకు వెళ్తారు. కొత్తగా పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఇదే మంచి సమయం. ఎవరికైనా డబ్బు ఇవ్వాల్సి వస్తే ఆలోచించాలి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఉద్యోగులు అదన ఆదాయం పొందడానికి మార్గం ఏర్పడుతుంది. అనవసరపు వివాదాలకు దూరంగా ఉండాలి.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఇంట్లో సానుకూల వాతావరణాన్ని ఎదుర్కొంటారు. నిరుద్యోగులు శుభవార్తలు విని అవకాశం ఉంది. ఉద్యోగులు అదనపు ఆదాయం కోసం ఎదురు చూస్తే వారు ఈరోజు అనుకున్న పనిని పూర్తి చేస్తారు. తల్లిదండ్రులకు బహుమతులు కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. పిల్లల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. వ్యాపారులకు ప్రత్యర్థులు ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉంది.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఈరోజు మానసికంగా ఒత్తిడిని ఎదుర్కొంటారు పిల్లల భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకుంటారు. ఉద్యోగులు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. కొందరికి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో ఉల్లాసంగా గడుపుతారు. స్నేహితులతో కలిసి సరదాగా ఉంటారు. లక్ష్యాన్ని పూర్తి చేయడానికి కాస్త కష్టపడాల్సి వస్తుంది. ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈ రోజు జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. అనుకోకుండా వివాదాల్లోకి చిక్కుకోవాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో మౌనంగా ఉండడమే మంచిది. జీవిత భాగస్వామి సలహాతో వ్యాపారంలో లాభాలు పొందుతారు. మాటలను అదుపులో ఉంచుకోవాలి. కొత్త వారితో ఆర్థిక వ్యవహారాలు జరపకుండా ఉండాలి. కొన్ని విషయాల్లో రహస్యాలు దాచడమే మంచిది.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : . ఈ రాశి వారు ఈ రోజు సాయంత్రం ఉల్లాసంగా ఉంటారు. జీవిత భాగస్వామితో కలిసి షాపింగ్ చేస్తారు. అనుకోకుండా కొత్త వ్యక్తిని కలిసే అవకాశం ఉంది. ఉద్యోగులు సకాలంలో అనుకున్న పనులను పూర్తి చేయడంతో సంతోషంగా ఉంటారు. సొంత వాహనాలపై వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈరోజు పిల్లల భవిష్యత్తు పైకి ఇలాగ నిర్ణయం తీసుకుంటారు. ఉద్యోగులు తోటి వారితో సంయమనం పాటించాలి. ఏవైనా వివాదాలు తలెత్తితే మౌనంగా ఉండటమే మంచిది. తండ్రి సలహాతో వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెడతారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper