Deepika Padukone: ఈమధ్య కాలం లో వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన హీరోయిన్స్ లో ఒకరు దీపికా పదుకొనే(Deepika Padukone). పాన్ ఇండియా లెవెల్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరోయిన్స్ లో ఒకరు ఈమె. ఇప్పటి వరకు మన సౌత్ లో కేవలం ప్రభాస్ ‘కల్కి’ చిత్రంలో మాత్రమే నటించింది. అంతకు ముందు ఈమె దర్శకులను కానీ, నిర్మాతలను కానీ ఇబ్బంది పెట్టినట్టు ఎక్కడా మనం చూడలేదు. కానీ రీసెంట్ సమయం లో సందీప్ వంగ మరియు కల్కి నిర్మాతలు బహిరంగంగా ఈమెపై మండిపడుతూ , అసహనం తో ట్వీట్లు వేయడం అందరినీ షాక్ కి గురి చేస్తుంది. కారణం ఏమిటంటే ఈమె డిమాండ్స్ హద్దులు దాటుతుందని, రెమ్యూనరేషన్ కి బదులుగా లాభాల్లో భారీ వాటాలను అడుగుతుందని, పని గంటలు కూడా బాగా తగ్గిస్తేనే కాల్ షీట్స్ ఇస్తానని, ఇలా రకరకాల షరతులు పెట్టి ఆ రెండు సినిమా మేకర్స్ కి చిరాకు రప్పించడం వల్లే ఈమెని తప్పించారని టాక్.
ఈ రెండు సంఘటనలు ప్రభాస్ సినిమాలకు మాత్రమే జరగడం గమనార్హం. దానిని బట్టీ చూస్తుంటే ప్రభాస్ కి దీపికా పదుకొనే కి పడట్లేదని స్పష్టంగా అర్థం అవుతుంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరోపక్క ఈమె అల్లు అర్జున్, అట్లీ సినిమా నుండి కూడా తప్పుకుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గానే ఈమె IMDB సంస్థ 2000 సంవత్సరం నుండి 2025 వరకు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి అత్యంత ప్రేక్షాధారణ సంపాదించుకున్న నటీనటుల జాబితాలను ప్రకటిస్తూ అవార్డ్స్ ఈవెంట్ ఏర్పాటు చేసింది. ఈ జాబితా లో దీపికా నాల్గవ స్థానం లో నిల్చింది. మొదటి మూడు స్థానాల్లో షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ మరియు హృతిక్ రోషన్ రోషన్ నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో అమితాబ్ బచ్చన్, రణబీర్ కపూర్, సల్మాన్ ఖాన్, ఐశ్వర్య రాయ్ మరియు అనుష్క శర్మ వంటి వారు నిలిచారు.
ఈ జాబితా లో తనకు దక్కిన స్థానం గురించి దీపికా పదుకొనే మాట్లాడుతూ, పరోక్షంగా ఇటీవల కాలం లో తనపై వచ్చిన ఆరోపణలకు కూడా సమాధానం చెప్పింది. ఆమె మాట్లాడుతూ ‘నా కెరీర్ లో ఇప్పటి వరకు ఎన్నో సక్సెస్ లు చూసాను, ఫెయిల్యూర్స్ చూసాను. ఈ ప్రయాణం లో నేను ఎన్నో గొప్ప విషయాలు నేర్చుకున్నాను. ఎంతో గొప్పవాళ్లను చూసాను, వెన్నుపోటు పొడిచేవాళ్ళను కూడా చూసాను. నా వెనుక చేరి మాట్లాడుకునే వాళ్ళు ఇప్పటికీ చాలా మంది ఉన్నారు. నా సక్సెస్ తోనే వాళ్లకు సమాధానం చెప్తూ వచ్చాను. ఈ ప్రయాణం లో నాకు తోడున్న అభిమానులకు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు’ అంటూ చెప్పుకొచ్చింది దీపికా పదుకొనే.