Homeఆధ్యాత్మికంToday 1 January 2026 Horoscope: ఈ రాశుల వారికి ఈరోజు కొత్త సంవత్సరం...

Today 1 January 2026 Horoscope: ఈ రాశుల వారికి ఈరోజు కొత్త సంవత్సరం కిక్కు.. లాభాలే లాభాలు..

Today 1 January 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం ద్వాదశ రాశులపై రోహిణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో వ్యాపారులకు కొత్త ఏడాది కలిసి రానుంది. ఉద్యోగులకు అధికారుల నుంచి మద్దతు ఉండడంతో అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వారికి కొత్త సంవత్సరం సందర్భంగా అన్నీ అనుకూలమైన ఫలితాలు ఉండలు ఉన్నాయి. ఉద్యోగులకు తోటి వారి సపోర్టు ఉండటంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేయగలుగుతారు. కుటుంబంతో మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. విద్యార్థులకు గురువుల మద్దతు ఉంటుంది.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈరోజు కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు. కొన్ని పనులు పూర్తి కావడంతో సంతోషంగా ఉండగలుగుతారు. ప్రియమైన వారి కోసం వస్తువులను కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామితో విహారయాత్రలకు వెళ్తారు. కుటుంబ సభ్యులతో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. కొత్త ప్రాజెక్టు చేయడానికి అధికారుల మద్దతు తీసుకుంటారు.

మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వారు ఈ రోజు ఏ పని ప్రారంభించిన దానిని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. కొందరి నుంచి డబ్బు అందుతుంది. బంధువులతో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. ఉన్నట్లుండి వ్యాపారులకు లాభాలు పెరుగుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : . ఈ రాశి వారు ఈ రోజు కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. వ్యాపారులకు ధనయోగం ఉండనుంది. మీరు ఏదైనా కొత్త పనిని ప్రారంభిస్తే దానిని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. పెద్దల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. కొత్త వస్తువులు కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారికి ఈ రోజు కుటుంబ సభ్యుల మద్దతు ఉండటంతో వ్యాపారులు లాభాలు పొందుతారు. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. ఉద్యోగులకు తోటి వారి మద్దతు ఉండటంతో అనుకున్న పనులను పూర్తి చేయగలుగుతారు. దీంతో పదోన్నతి వచ్చే అవకాశం ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : . ఈ రాశి వారు ఈ రోజు అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. పోటీ పరీక్షలో పాల్గొనే విద్యార్థులు శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యుల మద్దతు ఉండడంతో కొందరు ముఖ్యమైన పనులను పూర్తి చేయగలుగుతారు. పూర్వికులు ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సివస్తుంది.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు శత్రువుల బెడద తొలగిపోతుంది. దీంతో జీవితం ప్రశాంతంగా సాగుతుంది. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేయడంతో మానసికంగా సంతోషంగా ఉండగలుగుతారు. వ్యాపారులకు అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వ్యాపారులకు ఈరోజు లాభాల పంట పండుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు పొందుతారు. అనుకోకుండా కొత్త స్నేహితులను కలిసి అవకాశం ఏర్పడుతుంది. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగులు ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థుల పోటీ పరీక్షలో పాల్గొంటే వీరికి గురువుల మద్దతు ఉంటుంది.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) :. ఈ రాశి వారు ఈరోజు పనులన్నీ పూర్తి చేయగలుగుతారు. దీంతో సమాజంలో గౌరవం లభిస్తుంది. ఉద్యోగులకు తోటి వారి మద్దతు ఉండడంతో కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులను పూర్తి చేయగలుగుతారు. జీవిత భాగస్వామితో వ్యాపారం చేసేవారు అధిక లాభాలు పొందుతారు. విదేశాలనుంచి వ్యాపారం చేసే వారికి లాభాలు ఎక్కువగా ఉంటాయి.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈరోజు జీవితంలో అత్యున్నత సంతోషంతో గడుపుతారు వ్యాపారులకు సానుకూల ఫలితాలు రావడంతో సంతృప్తిగా ఉంటారు. గతంలో చేపట్టిన ఒక ప్రాజెక్టు విజయవంతంగా పూర్తి అవుతుంది. దీంతో మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. విద్యార్థులకు తల్లిదండ్రుల మద్దతు ఉంటుంది. పోటీ పరీక్షలో పాల్గొనడానికి సిద్ధమవుతారు.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈరోజు కుటుంబంతో సరదాగా గడుపుతారు. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారులకు కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. అయితే వీరితో డబ్బు వ్యవహారాలు జరపకుండా ఉండడమే మంచిది. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉండడంతో పదోన్నతి వచ్చే అవకాశం ఉంటుంది.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈ రోజు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. వ్యాపారులకు మెరుగైన లాభాలు ఉంటాయి. మాటలతో ఆకట్టుకోవడంతో సమాజంలో గౌరవం పెరుగుతుంది. గతంలో కంటే ఇప్పుడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. పిల్లల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తే సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండడమే మంచిది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Dharmendra Pradhan

Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక.. ఇంత జరిగిందా..

Dharmendra Pradhan: నరేంద్ర మోడీ ఒప్పుకోలేదు. అమిత్ షా అంగీకరించలేదు. కేంద్ర మంత్రివర్గం కూడా ఈ విషయంలో సానుకూలంగా లేదు. అయినప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేశారు.. రాజీనామా చేయాల్సిన...
Kargil Vijay Diwas

Kargil Vijay Diwas: దేశం గర్వించే దినం.. కార్గిల్‌ విజయం

Kargil Vijay Diwas: దాయాది దేశం పాకిస్తాన్‌తో 1999లో జరిగిన కార్గిల్‌ యుద్ధం భారత సైనిక చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. నిట్టనిలువు పర్వతాల మీద, అత్యంత కఠినమైన పరిస్థితుల్లో సైనికులు చూపిన...
Samsung Galaxy S25

Samsung Galaxy S25: ఈ ఫోన్ పై రూ.18,000 తగ్గింపు.. బ్యాంక్ ఆఫర్స్ కూడా వర్తింపు..

Samsung Galaxy S25: ప్రముఖ మొబైల్ కంపెనీ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్లు అంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. కాస్త ధర ఎక్కువైనా అద్భుతమైన ఫీచర్లు, అనుకూలమైన సాఫ్ట్...
Festivals this year

Festivals this year: ఈ ఏడాదిలో ముఖ్యమైన పండుగలు ఏ తేదీల్లో ఉన్నాయంటే..

Festivals this year: తెలుగు పంచాంగం ప్రకారం.. ఆషాడ మాసం లో వచ్చే తొలి ఏకాదశి తో పండుగల సీజన్ ప్రారంభమైనట్లు గా భావిస్తారు. ఆషాడ మాసం పూర్తికాగానే వరుసగా పండుగలు వస్తుంటాయి....
YCP Leaders

YCP Leaders: కుమారులతో వైసిపి నేతలకు తలవంపులు!

YCP Leaders: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వింత పరిస్థితి కనిపిస్తోంది. ఆ పార్టీలో దూకుడు కలిగిన నేతలు చుట్టూ ఇప్పుడు కేసులు అలుముకుంటున్నాయి. అయితే అవి కూటమి ప్రభుత్వం పెట్టిన కేసులు కాదు....
Oktelugu Epaper