Homeఆధ్యాత్మికంBalapur Ganesh Laddu: రికార్డు స్థాయిలో బాలాపూర్ లడ్డు వేలం.. ఈసారి ఎంత దక్కిందంటే

Balapur Ganesh Laddu: రికార్డు స్థాయిలో బాలాపూర్ లడ్డు వేలం.. ఈసారి ఎంత దక్కిందంటే

Balapur Ganesh Laddu: హైదరాబాద్ నగరంలో ఖైరతాబాద్ గణపతి తర్వాత.. ఆ స్థాయిలో గుర్తింపు సంపాదించుకుంది బాలాపూర్ గణపతి లడ్డు. ఈ లడ్డుకు ప్రతి ఏడాది రికార్డు స్థాయిలో వేలంలో ధర లభిస్తూ ఉంటుంది. ఈసారి కూడా అదే స్థాయిలో లభించింది. లడ్డును చాలామంది వ్యాపారులు.. శ్రీమంతుడు వేలంపాట పాడారు. అత్యధిక ధరకు సొంతం హైదరాబాదులో ఎంతో ప్రత్యేకతను బాలాపూర్ గణేష్ లడ్డూ సొంతం చేసుకుంది. ఈసారి ఈ గణపతి లడ్డూను అత్యంత ఘనంగా వేలం నిర్వహించారు. […]

Balapur Ganesh Laddu: హైదరాబాద్ నగరంలో ఖైరతాబాద్ గణపతి తర్వాత.. ఆ స్థాయిలో గుర్తింపు సంపాదించుకుంది బాలాపూర్ గణపతి లడ్డు. ఈ లడ్డుకు ప్రతి ఏడాది రికార్డు స్థాయిలో వేలంలో ధర లభిస్తూ ఉంటుంది. ఈసారి కూడా అదే స్థాయిలో లభించింది. లడ్డును చాలామంది వ్యాపారులు.. శ్రీమంతుడు వేలంపాట పాడారు.

అత్యధిక ధరకు సొంతం

హైదరాబాదులో ఎంతో ప్రత్యేకతను బాలాపూర్ గణేష్ లడ్డూ సొంతం చేసుకుంది. ఈసారి ఈ గణపతి లడ్డూను అత్యంత ఘనంగా వేలం నిర్వహించారు. పోటాపోటీగా వ్యాపారులు వేలంలో పాల్గొన్నారు. ఒకరిని మించి ఒకరు అన్నట్టుగా పాట పాడారు. చివరికి సామ ప్రణీత్ రెడ్డి అనే వ్యక్తి ఈ లడ్డును సొంతం చేసుకున్నారు. 39 లక్షలకు ఆయన వేలంపాట పాడి ఈ లడ్డును దక్కించుకున్నారు. పోటీదారులు ఒక్కొక్కరుగా లడ్డు ధరను పెంచారు. చివరికి లడ్డు విలువ 39 లక్షలకు చేరుతుంది. ప్రణీత్ అత్యధిక ధరను ప్రకటించి లడ్డూను దక్కించుకున్నారు.

మంచి జరుగుతుందని నమ్మకం

బాలాపూర్ లడ్డు వేలానికి ప్రత్యేకత ఈ స్థాయిలో ఉండడానికి ప్రధాన కారణం.. ఇది కేవలం లడ్డు ప్రసాదం మాత్రమే కాదు.. లడ్డూను సొంతం చేసుకున్న వారికి మంచి జరుగుతుందని భక్తులు నమ్ముతుంటారు. అందువల్లే ప్రతి ఏడాది వేలంలో భారీ మొత్తానికి లడ్డును దక్కించుకుంటారు. ఈ ఏడాది 39 లక్షల దలతో బాలాపూర్ లడ్డు మరోసారి వార్తల్లో నిలిచింది. లడ్డు వేలం ప్రక్రియ ముగిసిన తర్వాత ప్రణీత్ రెడ్డి పేరు కూడా సోషల్ మీడియాలో విపరీతంగా చర్చకు దారి తీస్తోంది.. గత ఏడాది బాలాపూర్ లడ్డూను కర్మాన్ ఘాట్ ప్రాంతానికి చెందిన లింగాల దశరథ్ గౌడ్ సొంతం చేసుకున్నారు. ఈయన ఏకంగా 35 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు. 2024లో 30.1 లక్షలకు లడ్డు వేలంపాటలో అమ్ముడుపోయింది.

బాలాపూర్ లడ్డుకు విశేషమైన చరిత్ర

బాలాపూర్ లడ్డుకు విశేషమైన చరిత్ర ఉంది. ఈ లడ్డు వేలం సంప్రదాయం 1994లో మొదలైంది. ఆ ఏడాది స్థానికంగా ఉన్న రైతు కొలను మోహన్ రెడ్డి 450 రూపాయలకు సొంతం చేసుకున్నారు. 1995లో కూడా ఆయన 4500 కు లడ్డును దక్కించుకున్నారు. ఆ తర్వాత ఈ లడ్డు ధర క్రమంగా పెరగడం మొదలైంది. 2002లో లక్ష రూపాయల వరకు దాటింది 2015లో 10.3 2 లక్షలు దక్కించుకుంది. 2019లో ఏకంగా 17.60 లక్షలు దాటింది. 2020లో కరోనా వల్ల లడ్డు వేలం పాట నిర్వహించలేదు. 2021లో 18.90 లక్షలు.. 2022లో 24.60 లక్షలు.. 2023లో 27 లక్షలు.. 2024లో 30.1 లక్షలకు ఈ లడ్డును వేలం పాటలో దక్కించుకున్నారు. 2025లో మాత్రం 35 లక్షల ధర పలికింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper