Horoscope Today: 2024 జూన్ 14 శుక్రవారం రోజున ద్వాదశ రాశులపై ఉత్తర పాల్గుణి నక్షత్రాల ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు మిథున రాశిలో సంచారం చేయనున్నాడు. ఈరోజు త్రిగ్రహి కలయిక ఉండనుంది. దీంతో కొన్ని రాశులపై ప్రభావం ఉండనుంది. మేషం నుంచి 12 రాశుల వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి:
ఉద్యోగులు పదోన్నతులు పొందే అవకాశం. వ్యాపారులకు అనుకోని లాభాలు ఉంటాయి. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. అనుకోని అదృష్టం వరిస్తుంది.
వృషభ రాశి:
మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఉద్యోగాలు మారే వారికి అనుకూల వాతావరణం. అనసవర ఖర్చులను నియంత్రించుకోవాలి. పాత స్నేహితులను కలుసుకుంటారు.
మిథున రాశి:
ఉద్యగులకు సీనియర్ల మద్దతు లభిస్తుంది. వ్యాపారులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. పిల్లల కెరీర్ కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారు.
కర్కాటక రాశి:
కొన్ని బహుమతులు స్వీకరిస్తారు. బంధువుల నుంచి శుభవార్త వింటారు. సాయంత్రం ఉల్లాసంగా ఉంటారు. వ్యాపారానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు.
సింహారాశి:
ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. స్నేహితుల సహకారంతో ఉత్సాహంగా ఉంటారు. ఆదాయం పెరుగుతుంది. పెద్ద మొత్తంలో డబ్బు వచ్చి చేరుతుంది.
కన్య రాశి:
ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అనవసరంగా కోపం తెచ్చుకోకుండా ఉండాలి. ఉన్నత విద్యకు సంబంధించి కొన్ని శుభవార్తలు వింటారు. పూర్వ ఆస్తి నుంచి కొన్ని శుభవార్తలు వింటారు.
తుల రాశి:
కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. సాయంత్రం ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెరుగుతుంది. కొన్ని కష్టాలను ఎదుర్కొంటారు.
వృశ్చిక రాశి:
మనసు ప్రశాంతంగా ఉంటుంది. కొన్ని విషయాల్లో అనుకోని ఆదాయం వస్తుంది. ఉద్యోగులకు సీనియర్ల మద్దతు ఉంటుంది. ఆహ్లదకరమైన వాతావరణంలో ఉంటారు.
ధనస్సు రాశి:
మాటలను అదుపులో ఉంచుకోవాలి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. అనుకోని ప్రయాణాలు ఉంటాయి. కొన్ని పనుల కోసం కష్టపడాల్సి వస్తుంది. వివాదాలకు దూరంగా ఉండాలి.
మకర రాశి:
శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యల మద్దతు ఉంటుంది. అనుకున్న పనులు పూర్తవుతాయి. పెండింగు సమస్యలు పరిష్కారం అవుతాయి.
కుంభరాశి:
జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని పనుల కారణంగా బిజీగా ఉంటారు. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు.
మీనరాశి:
ఆదాయం పెరుగుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారుల పెట్టుబడులకు లాభాలు ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Read MoreWeb Title: Horoscope today people of this zodiac will hear good news today 2
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com