Money: ప్రస్తుతం సమాజాన్ని నడిపిస్తున్న అత్యంత శక్తివంతమైన సాధనం ఏంటంటే డబ్బనే చెబుతారు చాలా మంది. డబ్బు లేనిదే ఎలాంటి పని జరగడం లేదు. కచ్చితంగా డబ్బు ఉండాల్సిందే. లేదంటే ఇంట్లో నుంచి కాలు బటయకూడా పెట్టలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒకవైపు ధరలు పెరుగుతుంటే జీతాలు మాత్రం పెరగడం లేదు. వ్యయం ఎక్కువ ఆదాయం తక్కువగా ఉంటుంది. మరి ఇలాంటి సమయంలో ఆ దేవుడి మీద భారం వేసి బతికే వారు చాలా మంది ఉన్నారు. ఇక మీకు ధనప్రాప్తి కలగాలి అంటే ఒక చిన్న పని చేయండి.
భార్యాభర్తల బంధం గురించి ఎంతో మంది కవులు చెప్పారు. కానీ ఎంత రాసిన తరగని ప్రేమ ఆ బంధానిది. కానీ ఈ మధ్య చిన్న చిన్న విషయాలకు మనస్పర్థలతో గొడవలు పెట్టుకుంటూ విడాకులు తీసుకుంటున్నారు. ఇక ఈ భార్యాభర్తల మధ్య సఖ్యత బాగుంటే కచ్చితంగా ఇంట్లో డబ్బు నిలుస్తుంది. అయితే భార్యాభర్తలు ఎలా ఉంటే ఇంట్లో డబ్బు నిలుస్తుందో ఓ సారి తెలుసుకోండి.
పురుషులకు కాళ్ల వేళ్ల నుంచి మోకాళ్ల వరకు ఉన్న భాగం శనిది. స్త్రీ చేతి వేళ్ల కొనల నుంచి అరచేయి వరకు ఉన్న భాగం శుక్రుడిది అంటారు పండితులు. అందుకే స్త్రీ తన భర్త కాళ్లు పట్టడం ద్వారా శనపై శుక్రుడి ప్రభావం పడి ఆ ఇంట్లో ధనప్రాప్తి కలుగుతుంది అంటారు. అన్యోన్యంగా ఉన్న భార్యాభర్తలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఆ దేవుళ్ల మెప్పు కూడా పొందవచ్చు.
భార్యాభర్తల బంధం లో ఇలాంటి చిన్న చిన్న సేవలు చేసుకోవడం వల్ల ఆ జంట కలకాలం సంతోషంగా జీవిస్తుంటుంది. ఒకరికి ఒకరు కలిసి మెలిసి ఉండాలి. కష్టసుఖాల్లో పాలు పంచుకోవాలి. ఎంత కష్టం వచ్చినా విడిపోమనే ధైర్యం ఇవ్వాలి. ఇలాంటి బంధం ఎంత కష్టమైనా సరే సంతోషంగా జీవిస్తుంటారు. అందుకే మీ భార్య/భర్తతో ఆనందంగా ఉండటానికి ప్రయత్నించండి. ప్రతి విషయంలో సంతోషం వెతకండి.
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read MoreWeb Title: Do this one thing to get money
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com