Pahalgam Attack : దేశమంతా ఒకటే చర్చ. ఉగ్రవాదులు కాల్చే ముందు ఏ మతమో నిర్ధారణ చేసుకొని ఎందుకు కాల్చారు. ఇది కొత్తరకమైన క్రూరం.. ముస్లింలు కానివారినే కాల్చారు. ఒక్క ముస్లిం వారిని ఎదురించాడు కాబట్టి చంపారు. అతడు లోకల్ వ్యక్తి. ముస్లింయేతరులను కాల్చాడానికి కారణం.. ‘రాడికల్ ఇస్లాం’ను నమ్మినవారు ఈ ఉగ్రవాదులు..
రాడికల్ ఇస్లాంకు డిఫెనేషన్ అనేదే లేదు. 7వ శతాబ్ధంలో మహ్మద్ ప్రవక్త పాటించనవాటిని, ఖురాన్ లో చెప్పిన వాటిని.. ఇప్పుడు పాటించాలని నమ్మేవారు రాడికల్ ఇస్లాం వ్యక్తులు. ఆధునిక సమాజ పోకడలను వీరు పాటించరు. షరియత్ చట్టాలను అమలు చేయాలి. మహిళలు బయటకు వెళ్లొద్దు.. ఎవరో ఒకరు తోడు లేనిదే బయటకు రావద్దు.బురఖా ధరించాలి. అప్గనిస్తాన్ లో అదే అమలు చేస్తోంది. మహిళలు కేవలం పిల్లలను కనేదానికే ఉండాలి. నమ్మనివారు ఇస్లాంను పాటించని వారు లెక్క.
ప్రధానంగా ప్రపంచంలో రెండే రెండు రాడికల్ ఇస్లాం దేశాలు ఉన్నాయి. అప్ఘనిస్తాన్, ఇరాన్ దేశాలు రాడికల్ ఇస్లాం కేటగిరీలో ఉన్నాయి. ప్రపంచం మొత్తాన్ని ఇస్లాం మతంలో ఉండాలి. మొత్తం ఒకటే దేశంగా ఉండాలి. ఇందుకోసం ప్రాణత్యాగం చేయాలి. జిహాద్ చేయాలి. జిన్నత్ అప్పుడు తక్కుతుందని నమ్ముతారు. దాని కోసం ఇక్కడ ప్రాణమైనా తీసుకుంటారు.
ఉగ్రవాదులు ముస్లిమేతరుల్నే ఎందుకు కాల్చారు? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.