Kitex Sabu Jacob party joins NDA: ఈరోజు తిరువనంతపురంలో మోడీ బహిరంగ సభ.. కార్యకర్తల సమావేశం. తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిస్తే బ్లూప్రింట్ ఓపెన్ చేస్తామని.. మోడీని తీసుకొచ్చి మరీ ప్రకటించాడు కేరళ బీజేపీ నేత రాజీవ్ చంద్రశేఖర్. చేసి చూపించాడు ఈ నేత. ఒక మున్సిపల్ కార్పొరేషన్ బ్లూప్రింట్ ఆవిష్కరణకు ప్రధాని మోడీని రప్పిస్తామని హామీ ఇచ్చి రప్పించడం గొప్ప విషయంగా చెప్పవచ్చు.
ఆదర్శ పంచాయతీలు, వస్తువులు సహా ఎన్నో సేవలు చేసిన ‘కైటెక్సస్’ ఎండీ సాబు జాకోబ్ కేరళలో 2013లో ఒక కొత్త పార్టీ పెట్టాడు. 2020కి వాగ్ధానాలు అమలు చేస్తానన్నాడు.
సొసైటీ పెట్టి.. గ్రాసరీ సూపర్ మార్కెట్ స్థాపించి అందరికీ ఇళ్లు, విద్యాసంస్థలు సహా ఎన్నో అద్భుతంగా చేసి చూపించాడు. ఎల్డీఎఫ్, యూడీఎఫ్ లకు ప్రత్యామ్మాయ రాజకీయ పార్టీని చేసి చూపిస్తానని సాబు చెప్పాడు. కానీ ఇప్పుడు బీజేపీలో చేరాడు.
మోడీ సమక్షంలో కైటెక్సస్ సాబు జాకోబ్ పార్టీ NDA లో చేరిక.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.