Homeఅంతర్జాతీయంPakistani Army Officer: పహల్గాం దాడి మాస్టర్‌మైండ్‌ ఖతం.. మట్టుబెట్టిన అజ్ఞాత సాయుధులు

Pakistani Army Officer: పహల్గాం దాడి మాస్టర్‌మైండ్‌ ఖతం.. మట్టుబెట్టిన అజ్ఞాత సాయుధులు

Pakistani Army Officer: 2025, ఏప్రిల్‌ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాద దాడి జరిగింది. ఇందులో 26 మంది యాత్రీకులు చనిపోయారు. ఈ దాడి దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ దాడికి ప్రతిగా భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌ నిర్వహించింది. కానీ, మహల్గాం దాడికి మూలమైన వ్యక్తిని గుర్తించినా పట్టుకోలేదు. అయితే తాజాగా అతడు ఖతమయ్యాడు. పాకిస్తాన్‌ సైనిక అధికారి లెఫ్ట్‌నెంట్‌ కల్నల్‌ ఇమ్రాన్‌ దయాల్‌ను అజ్ఞాత సాయుధులు కాల్చి చంపారు. 2025 ఏప్రిల్‌ 22న జరిగిన […]

Pakistani Army Officer: 2025, ఏప్రిల్‌ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాద దాడి జరిగింది. ఇందులో 26 మంది యాత్రీకులు చనిపోయారు. ఈ దాడి దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ దాడికి ప్రతిగా భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌ నిర్వహించింది. కానీ, మహల్గాం దాడికి మూలమైన వ్యక్తిని గుర్తించినా పట్టుకోలేదు. అయితే తాజాగా అతడు ఖతమయ్యాడు. పాకిస్తాన్‌ సైనిక అధికారి లెఫ్ట్‌నెంట్‌ కల్నల్‌ ఇమ్రాన్‌ దయాల్‌ను అజ్ఞాత సాయుధులు కాల్చి చంపారు. 2025 ఏప్రిల్‌ 22న జరిగిన పహల్గాం దాడికి ప్లానింగ్, ఉగ్రవాదుల శిక్షణ, హ్యాండ్లింగ్‌లో కీలక పాత్ర పోషించాడు. దాడి తర్వాత భారత సరిహద్దు విధులకు దూరం చేసి లోపలి పనులు కేటాయించారు. ఆపరేషన్‌ ముగించుకుని వెళ్తుండగా ఆకస్మిక కాల్పులతో మృతి చెందాడు.

సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు
అధికారికంగా షహీద్‌గా ప్రకటించి పూర్తి గౌరవాలతో అంత్యక్రియలు చేశారు. లష్కర్‌–ఎ–తౌబా, హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌ ఉగ్రవాదుల మరణానికి పట్టించుకోకపోయినా, సైనిక అధికారి మరణానికి ప్రాధాన్యత చూపారు.

భారత వ్యతిరేకుల హత్యలు
ఇలాంటి ఘటనలు కొత్తవి కావు. 2018లో సీఆర్‌పీఎఫ్‌ క్యాంప్‌ దాడి ప్లానర్‌ షేక్‌ మహ్మద్‌ ముజాహిద్, 2023లో పఠాంకోట్‌ దాడి కీలకి షహీద్‌ లతీఫ్, 2025 నవంబర్‌లో జైష్‌–ఎ–మహ్మద్‌ సూత్రధారి రహీముల్లా, గతంలో జాయింట్‌లా అజ్ఞాతుల చేత చనిపోయారు. మొత్తం 107 మంది భారత వ్యతిరేక కార్యకర్తలు ఇలా హతమయ్యారు. పాకిస్తాన్‌ భారత రా ఏజెంట్లను ఆరోపిస్తోంది. అయితే, ఐఎస్‌ఐ అవసరం అయిపోయిన సూత్రధారులను తొలగిస్తోందని అనుమానం. పహల్గాం దాడికి సహకరించినవారిని ఒక్కొక్కరుగా నిర్మూలిస్తున్నారు.

భారత్‌ ఆపరేషన్‌ మహావీర్‌లో ముగ్గురు ఉగ్రవాదులను సంహరించింది. పాక్‌ మిలిటరీ ప్లానింగ్, ఐఎస్‌ఐ శిక్షణ అందించినా, తమ స్థాయి నుంచే క్లీనప్‌ చేస్తున్నారు. ఇది భారత దాడులు తగ్గడానికి, పాక్‌ ఇంటర్నల్‌ క్లీనప్‌కు కారణమవుతోంది. ఉగ్రవాద నెట్‌వర్క్‌ బలహీనపడుతోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper