Pawan Kalyan : గత కొంతకాలం గా ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం(Pithapuram) నియోజకవర్గంలో టీడీపీ, జనసేన పార్టీల మధ్య తరచూ గొడవలు జరుగుతూ వస్తున్న సంగతి తెలిసిందే. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, శాసనమండలి సభ్యులు కొణిదెల నాగబాబు పిఠాపురం మాజీ టీడీపీ ఎమ్మెల్యే SVSN వర్మ పై సెటైర్ల వర్షం కురిపించడం పెద్ద దుమారమే రేపింది. సోషల్ మీడియా లో నాగ బాబు చేసిన ఆ వ్యాఖ్యలు ఇరు పార్టీల అభిమానుల మధ్య కాక రేపింది. ఇప్పటికీ ఆ వ్యాఖ్యల తాలూకు వేడి సోషల్ మీడియాలో ఇరు పార్టీల మధ్య కనిపిస్తూనే ఉంది. అంతే కాకుండా పిఠాపురం జనసేన పార్టీ ఇంచార్జ్ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు వర్మ ని ఆహ్వానించకపోవడం, అందుకు వర్మ వర్గం ఫైర్ అవ్వడం వంటివి మనం చూసాము.
Also Read : అక్షరాలా 172 కోట్ల రెమ్యూనరేషన్..ఆల్ టైం రికార్డు నెలకొల్పిన పవన్ కళ్యాణ్!
నాగబాబు పర్యటన లో కూడా వర్మ వర్గం చేసిన రచ్చ అంతా ఇంత కాదు. దీంతో కొంతమంది టీడీపీ కార్యకర్తలపై కేసులు కూడా నమోదు చేయించారు. ఇలా ఇరు పార్టీల మధ్య గొడవలు తారాస్థాయికి చేరాయి. రేపో మాపో వర్మ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ పై, జనసేన పార్టీ పై విరుచుకుపడుతాడని, టీడీపీ పార్టీ కి రాజీనామా చేసి వైసీపీ లోకి వెళ్తాడని, ఇలా ఎన్నో రకాల ఊహాగానాలు మీడియాలో ప్రచారం అయ్యాయి. ఈ ఊహాగానాలకు నేడు తెరపడినట్టే అనుకోవచ్చు. నేడు పిఠాపురం లో పర్యటించిన పవన్ కళ్యాణ్ 100 కోట్ల రూపాయిల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసాడు. ముఖ్యంగా పిఠాపురం ప్రజలు ఎన్నో ఏళ్ళ నుండి ఎదురు చూస్తున్న వంద పడకల హాస్పిటల్ కి నేడు ఆయన శంకుస్థాపన చేసాడు. అలాగే ఉప్పాడ ప్రాంతంలో టీటీడీ కల్యాణ మండపం తో పాటు పలు దేవాలయాలు, సిమెంట్ రోడ్డులు, బీటీ రోడ్లకు కూడా శంకుస్థాపన చేసాడు.
ఈ కార్యక్రమాలన్నిటికీ పవన్ కళ్యాణ్ తో పాటు వర్మ కూడా హాజరు అయ్యాడు. పవన్ కళ్యాణ్ వర్మ ని ఆప్యాయతతో దగ్గర తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. అభివృద్ధి కార్యక్రమాల అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో కూడా వర్మ పాల్గొన్నాడు. దీంతో వర్మ ని జనసేన పార్టీ వాళ్ళు పట్టించుకోవడం లేదు అనే వాదనకు తెరపడినట్టు అయ్యింది. అయితే రాజకీయ విశేల్షకుల నుండి మరో వాదన కూడా వినిపిస్తుంది. వర్మ ని దూరం పెడుతున్న విషయాన్ని గమనించిన పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ పై వ్యతిరేకతతో ఉన్నాడని, ఇది గ్రహించి వెంటనే నేడు చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు వర్మని స్వయంగా పవన్ కళ్యాణ్ ఫోన్ చేసి ఆహ్వానించాడని అంటున్నారు. ఏది ఏమైనా పిఠాపురం లో ఇప్పటికీ ఇరు పార్టీల మధ్య గొడవలు కొనసాగుతున్న విషయం వాస్తవం.
Also Read : స్టార్ నిర్మాతలతో పవన్ కళ్యాణ్ అత్యవసర భేటీ..విషయం ఏమిటంటే!
పిఠాపురం టౌన్ లో 30 గదులతో కూడిన 100 పడకల ఆసుపత్రి నిర్మాణం శంకుస్థాపన చేసిన గౌ|| ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan
గారు.#Pithapuram #AndhraPradesh pic.twitter.com/v21whv6SjA— JanaSena Shatagni (@JSPShatagniTeam) April 25, 2025