Rahul Gandhi : రాహుల్ గాంధీ ఈరోజు సంభాల్ యాత్ర పేరుతో రోడ్లన్నీ బ్లాక్ చేశాడు. ఢిల్లీ నుంచి మీరట్ వెళ్లే వారికి నరకప్రాయంగా మార్చాడు. బాధ్యతగల ప్రతిపక్ష నేత అయిన రాహుల్ గాంధీ అక్కడ యాత్ర చేయడంతో కమ్యూటర్స్ తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
కమ్యూటర్స్ ఈ రోడ్డు దిగ్బంధంపై కాంగ్రెస్ కార్యకర్తలతో ఘర్షణపడ్డారు. కొట్లాడుకున్నారు. రాహుల్ గాంధీ పర్యటన కేవలం షో చేయడానికే వెళ్లాడని అందరికీ తెలుసు. సంభాల్ లో ప్రార్థనలకు అలో చేశారు. కోర్టు సర్వే చేయమని తీర్పునిచ్చింది. అది నచ్చకపోతే పైకోర్టుకు వెళ్లాలి. కానీ వెళ్లే వారిపై రాళ్లు వేయడం.. కాల్పులు జరపడం దారుణం. దీన్ని రాహుల్ గాంధీ ఖండించడం లేదు. మరింత రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారు.
సమాజ్ వాదీ పార్టీ అక్కడ ప్రతిపక్షంలో ఉంది కాబట్టి రాజకీయం చేయడంలో తప్పులేదు. కానీ జాతీయ పార్టీగా ఉండి రాహుల్ గాంధీ ఈ ప్రచార యావ వివాదాస్పదమైంది.
ప్రేమను పంచాలంటే ముందు నవ్వు ముఖం వుండాలి రాహుల్ గాంధీ.. ఆయన వ్యవహరిస్తున్న తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.