Hindenburg Research : హిండెన్ బర్గ్ రీసెర్చ్.. దీని యజమాని అండర్ సన్ తాజాగా ఆ కంపెనీని క్లోజ్ చేస్తున్నట్టు ప్రకటించాడు. కొన్ని సామ్రాజ్యాలను షేక్ చేశాడట.. మ్యాట్ అండర్సన్ ప్రకటన ఇచ్చారు. ఆయన అనుకున్న లక్ష్యం నెరవేరిందట.. సామ్రాజ్యాలను షేక్ చేశాడట..జార్జ్ సోరోస్ ఫండ్స్ తో నడిచిన సంస్థ హిండెన్ బర్గ్ రీసెర్చ్.
చాలా మంది న్యూట్రల్ గా ఉండే వాళ్లకు కూడా అదానీ మీద బయటపెట్టాడు అనుకుంటున్నారు కానీ భారత్ కు వ్యతిరేకంగా జరిగిన కుట్రలో భాగం అని గ్రహించడం లేదు. ఒక వార్తను వార్తగానే చూడొద్దు.. దాని వెనుకున్న లక్ష్యాన్ని ఛేదించాల్సిన అవసరం ఉంటుంది.
మోడీని డైరెక్ట్ గా అటాక్ చేయలేక.. భారత్ ను వీక్ గా చేయాలని హిండెన్ బర్గ్ ను ఉపయోగించుకొని ఈ కుట్ర చేశారని అర్థమవుతోంది. అదానీ సుద్దపూస ఏం కాదు.. కానీ అమెరికా ఎవరు ఈ కుట్ర చేయడానికి.. అమెరికా సంస్థలు భారత్ లోని సంస్థలపై దర్యాప్తు చేస్తారా? అమెరికా వ్యాపారవేత్తలపై భారత్ దర్యాప్తు చేయగలదా? వ్యాపారం చేసుకునే షార్ట్ సెల్లర్ పార్లమెంట్ సమావేశాల ముందు రిపోర్ట్ రాసి రాహుల్ గాంధీ రచ్చ చేయడం.. భారత్ ప్రతిష్టను దెబ్బతీయాలని పనిచేయడంలో కుట్ర కోణం ఉంది.
హిండెన్ బర్గ్ రిపోర్టు న్యూయార్క్ కోర్టు కేసు అంతర్జాతీయ కుట్రలో భాగమా? అన్న దానిపై ‘రామ్ ’గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు