Operation Sindoor: ఎక్కడ మారుమూల గుజరాత్లో మొదలైన అతని ప్రస్థానం.. ఈరోజు మన దేశ అపర కుబేరుడిగా ఎదిగేలా చేసింది. మీడియా నుంచి మొదలుపెడితే నౌకాశ్రయాల వరకు అతడు చేయని వ్యాపారం లేదంటే అతిశయోక్తి కాదు. అందువల్లే అదానీ సరికొత్త వ్యాపారిగా.. శూన్యంలోనూ అవకాశాలను సృష్టించే వ్యక్తిగా పేరు పొందాడు. సాధారణంగా మనదేశంలో ఎవరైనా డెవలప్ అయితే.. అతనిపై నిప్పులు పోసుకునేవారు చాలామంది ఉంటారు. అదా నీపై కూడా చాలామంది ఇలాగే నిప్పులు పోశారు. అతని కంపెనీలపై ఆరోపణలు చేశారు.ఓ సంస్థ ఇచ్చిన నివేదికను గుడ్డిగా నమ్మి అడ్డగోలుగా ప్రచారం చేశారు. చివరికి ఆ కంపెనీ అన్ని మూసుకోవాల్సి వచ్చింది. అంతిమంగా ఆదాని కంపెనీలదే విజయమైంది. అమెరికాలో అవినీతి ఆరోపణలను ఆదాని కంపెనీలు ఎదుర్కొన్నాయి. చివరికి అందులో కూడా విజయం సాధించాయి. ఇలా ఎదురైన ప్రతి అవరోధాన్ని అదాని తనకు అనుకూలంగానే మలుచుకున్నారు. అందువల్లే ఆయన నెంబర్ వన్ వ్యాపారి అయిపోయారు.
Also Read: ఐపీఎల్ రీస్టార్ట్.. పీఎస్ఎల్ పరిస్థితి ఏంటంటే?
తాజాగా ఏం చేశారంటే
పొరుగు దేశమైన పాకిస్తాన్ మనతో కయ్యానికి కాలు దువ్వుతోంది కదా.. ఈ సమయంలో భారత్ దానికి గట్టిగా గుణపాఠం చెప్పాలని భావించింది. అందువల్లే దానిమీద సరైన సమయంలో.. సరైన స్థాయిలో ఎదురుదాడి చేసింది. మన దేశం ఉగ్రవాద దేశంపై ఎదురుదాడికి దిగడానికి అత్యంత అధునాతనమైన ఆయుధ సామాగ్రిని ఉపయోగించింది. అందులో అదాని గ్రూపునకు సంబంధించి ఆల్ఫా డిజైన్ టెక్నాలజీస్ డెవలప్ చేసిన స్కై స్ట్రైకర్ డ్రోన్లు ఆపరేషన్ సిందూర్ లో అదరగొట్టాయి. మన దేశంలోని అనేక నగరాలపై దాయాది దేశం చేసిన దాడులను తిప్పికొట్టాయి.. అంతేకాదు అదానీ గ్రూప్ తయారుచేసిన కామికేజ్ డ్రోన్లను ఉపయోగించింది. వీటిని స్కై స్ట్రైకర్ డ్రోన్లు అని పిలుస్తుంటారు. వీటిని బెంగళూరులోని అదాని గ్రూపు ఆధ్వర్యంలో పనిచేసే ఆల్ఫా డిజైన్ టెక్నాలజీస్.. ఇజ్రాయిల్ దేశానికి చెందిన ఎల్బిట్ సెక్యూరిటీ సిస్టమ్స్ జాయింట్ గా డెవలప్ చేశారు. ఈ మోడరన్ డ్రోన్లు 100 కిలోమీటర్ల పరిధిలో టార్గెట్లపై దాడి చేస్తాయి. ఆల్ఫా డిజైన్ టెక్నాలజీస్ వీటిని ఆర్మీకి ఎక్స్పోర్ట్ చేస్తోంది. ఇవి ఐదు నుంచి పది కిలోల వరకు మందు గుండు సామగ్రిని తీసుకెళ్తాయి.. స్కై స్ట్రైకర్ నాన్ హ్యూమన్ విమాన వ్యవస్థ లాగా గాలిలోకి ఎగిరి.. మిస్సైల్ లాగా ఎటాక్ చేస్తుంది.. టార్గెట్ ఏరియాలో తిరుగుతూ.. టార్గెట్ పై అటాక్ చేస్తుంది. లో సౌండ్ చేస్తుంది కాబట్టి.. లో హైట్ లో ఎగిరినప్పటికీ దీనిని గుర్తించడం అత్యంత కష్టం. మొన్నటిదాకా అదాని గ్రూప్ పై విపరీతమైన విమర్శలు చేసిన వారు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. అంతేకాదు డిఫెన్స్ లో అదాని గ్రూపు తయారు చేస్తున్న పరికరాలు దేశ రక్షణకు ఉపయోగపడుతున్న తీరును చూస్తూ ఆశ్చర్యపోతున్నారు. అందుకే ప్రతికూల పరిస్థితుల్లో అవకాశాలను వెతుక్కునేవారు.. వాటిని తమకు అనుకూలంగా మలుచుకునేవారు విజయవంతమైన వ్యాపారులవుతారు. అందుకు గౌతమ్ అదాని బెస్ట్ ఎగ్జాంపుల్.