Adani Group: పదేపదే అవే ఆరోపణలు.. కేంద్ర ప్రభుత్వం మీద.. అన్నింటికీ మించి అదా నీ గ్రూప్ మీద అవే విమర్శలు.. వ్యూహాత్మకంగా విదేశీ మీడియా సంస్థలు అదా నీ గ్రూపును లక్ష్యంగా చేసుకొన్నట్టు కనిపిస్తున్నాయి. అదానీ గ్రూప్ మీద.. అందులోకి వస్తున్న పెట్టుబడుల మీద పదేపదే తీవ్రాతి విమర్శలు చేస్తాయి.. మొన్నటిదాకా హిండెన్ బర్గ్ సంచలన నివేదికలతో అల్లకల్లోలం చేస్తే.. ఇప్పుడు వాషింగ్టన్ పోస్ట్ ఆ జాబితాలో చేరింది. అదాని గ్రూప్ మీద తీవ్రమైన ఆరోపణలు చేసింది.
వాషింగ్టన్ పోస్ట్ తాజాగా ప్రచురించిన కథనం ప్రకారం.. గౌతం అదానీ ఆధ్వర్యంలోని అదానీ సంస్థలు కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం, నీతి అయోగ్ కలిసి ఎల్ఐసి ని 33 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పట్టించేందుకు ఒప్పించాయని వాషింగ్టన్ పోస్ట్ ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది.. పెట్టుబడుల విషయంలో తమను ఎవరూ ప్రభావితం చేయలేరని ఎల్ఐసి చెప్పినప్పటికీ.. వాషింగ్టన్ పోస్ట్ ప్రచురించిన కథనం ప్రకారం సృష్టించింది. అదానీ కంపెనీ షేర్ల ధరలను కృత్రిమంగా పెంచాలని 2023 లో హిండెన్ బర్గ్ ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై సెబీ దర్యాప్తు చేసింది. అవన్నీ నిజం కాదని తేల్చి చెప్పింది.
ఇప్పుడు వాషింగ్టన్ పోస్ట్ సంచలన విషయాలతో ఒక కథనాన్ని ప్రచురించింది. 2014లో మోడీ తన ప్రచారానికి అదాని కి చెందిన ప్రవేటు జెట్ ను వాడుకున్నారని వాషింగ్టన్ పోస్ట్ తన కథనంలో పేర్కొంది. అంతే కాదు అదానీ గ్రూప్ సంస్థల్లో పెట్టుబడులు ఇబ్బందితో కూడుకున్న వ్యవహారం అని.. అనేక సంస్థలు ఇచ్చిన నివేదికలను వాషింగ్టన్ పోస్ట్ తన కథనంలో పేర్కొంది.
2023 లో హిండెన్ బర్గ్ ఇదే తరహాలో అదానీ గ్రూప్ మీద ఆరోపణలు చేసింది. దీంతో అదాని గ్రూపు తీవ్ర ఇబ్బందుల్లోకి వెళ్ళింది. అంతేకాదు అమెరికా కంపెనీల తరఫున భారతదేశంలో రాజకీయ నాయకులకు లంచాలు ఇచ్చారని స్వయంగా అమెరికాని ఆ శాఖ దృవీకరించింది. దీంతో 2024లో కూడా అదానీ గ్రూప్ ఇదే స్థాయి లో ఒడిదుడుకులకు గురైంది. ఈ క్రమంలో వాషింగ్టన్ పోస్ట్ ప్రచురించిన కథనం సంచలనం కలిగించింది. అదానీ గ్రూప్ సంస్థలు చెల్లింపుల సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. గత మే నెలలో ఎల్ఐసి తో 3.9 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టించే ప్రతిపాదన చేసిందని వాషింగ్టన్ పోస్ట్ ఆ కథనంలో పేర్కొంది.
చెల్లింపుల సంక్షోభాన్ని పరిష్కరించుకోవడానికి మార్కెట్ నుంచి 585 బిలియన్ డాలర్లను బాండ్ల రూపంలో సేకరిస్తున్నట్టు అదానీ ప్రకటించింది. ఆ తర్వాత కొద్ది రోజులకే ఎల్ఐసి ఈ డబ్బులు మొత్తాన్ని సమకూర్చుతుందని అదానీ సంస్థ ప్రకటించింది. వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రకారం కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదన మొత్తం 3.9 మిలియన్ డాలర్లు అయితే.. ప్రస్తుతం ఆదాని గ్రూప్ కంపెనీల విలువ మార్కెట్ రేట్ ప్రకారం 90 బిలియన్ డాలర్లు. తమకు అవసరమైన సొమ్ము ఎల్ఐసి నుంచి సేకరిస్తున్నట్టు గత నెలలో అదానీ గ్రూప్ ప్రకటించినప్పుడు ప్రతి పక్ష పార్టీలు ఆందోళనలు చేశాయి. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించాయి.
ఈ కథనంపై ఎల్ఐసి తన వాణి వినిపించింది. తాము పెట్టుబడి పెట్టే వ్యవహారాన్ని ఎవరూ ప్రభావితం చేయలేరని ఎల్ఐసి స్పష్టం చేసింది. స్వతంత్రంగానే.. ఆమె విధివిధానాలకు లోబడి నిర్ణయం తీసుకున్నామని ప్రకటించింది. ఈ నిర్ణయాలలో ఎవరి జోక్యమూ లేదని పేర్కొంది.. 3,900 బిలియన్ డాలర్ల పెట్టుబడి ప్రతిపాదన వ్యవహారం లో కేంద్రం, నీతి ఆయోగ్, ఎల్ఐసి మధ్య చర్చకు రాలేదని స్పష్టం చేసింది. 41 లక్షల కోట్ల ఆస్తులు ఉన్న ఎల్ఐసి 351 కంపెనీలలో పెట్టుబడులు పెట్టిందని.. ఈ ప్రకారం చూసుకుంటే అదాని గ్రూపులో పెట్టిన పెట్టుబడి కేవలం రెండు శాతం మాత్రమేనని.. ఇండియాలో 500 టాప్ లిస్టెడ్ కంపెనీల విలువ గడిచిన 10 సంవత్సరాలలో 10 రెట్లు పెరిగిందని ఎల్ఐసి స్పష్టం చేసింది.