
Kavitha vs TV9 Rajinikanth : కల్వకుంట్ల వారి ఆడబిడ్డ.. లిక్కర్ క్వీన్ బిరుదాంకితురాలు బతుకమ్మకు తానే బ్రాండ్ అంబాజిడర్ అని చెప్పుకునే కవిత సడెన్‌గా మహిళా రిజర్వేషన్‌పై పోరాటం ప్రారంభించారు. ఈనెల 10న ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద దీక్ష చేయాలని నిర్ణయించారు. భారత జాగృతిని ఈ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తం చేయాలనుకుంటున్నానని చెబుతున్న కవిత, ఈ కర్యక్రమంపై భజన మీడియాకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. అయితే అదే ఇంటర్వ్యూ ఇప్పుడు నెటిజన్లు ఎడిట్ చేసి కవితను తెగ ట్రోల్ చేస్తున్నారు. ఈ ప్రశ్నలకు బదులేది అని నిలదీస్తున్నారు.
రజినీ ఇలా బుక్ చేశారు..
తన అనుకూల చానెల్ కదా.. అని ఇంటర్వ్యూకు సై అకన్న ఎమ్మెల్సీ, తెలంగాణ ముఖ్యమంత్రి గారాల పట్టి కల్వకుంట్ల కవిత టీవీ9కు ఇంటర్వ్యూ ఇచ్చారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఈనెల 10న తాను చేపట్టే దీక్షకు ప్రచారం వస్తుందనుకుంటే… సీన్ రివర్స్ అయింది. టీవీ9 జరినీకాంత్ ప్రశ్నలకు కవితను బుక్ చేశారు. ఆ ప్రశనలకు కవిత సమాధానం చెప్పలేక నీళ్లు నమలడం కొసమెరుపు..
ఈ ప్రశ్నలకు సమాధానం లేదు..
– 2014లో తెలంగాణలో టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కవిత తండ్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నాలుగున్నరేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. కానీ, తన క్యాబినెట్‌లో ఒక్క మహిళా మంత్రిని నియమించలేదు.
– 2014 నుంచి 2019 వరకు కవిత లోక్‌సభ సభ్యురాలిగా ఉన్నారు. నిజామాబాద్ నుంచి గెలిచిన కవిత ఐదేళ్లలో ఒక్కనాడు కూడా పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి మాట్లాడలేదు.
– ఒక మíß ళ గవర్నర్‌గా తెలంగాణలో ఉన్నారు. ఆమె తనకు స్థానిక ప్రభుత్వం కనీస ప్రోటోకాల్ పాటించడం లేదని, గౌరవం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు కూడా గవర్నర్‌ను గౌరవించకుండా కేసీఆర్ చేశారు. దీనిపై గవర్నర్ తమిళిసై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
– 2014 నుంచి ఇప్పటి వరకు టీఆర్‌ఎస్(ప్రస్తుతం బీఆర్‌ఎస్) అధికారంలో ఉంది. ఇప్పటి వరకు ఒక్క మహిళను రాజ్యసభకు మాత్రం పంపలేదు.
మహిళ రిజర్వేషన్‌పై కమిట్‌మెంట్ ఉన్నట్లేనా?
రజనీకాంత్ అడిగిన నాలుగు ప్రశ్నలపై కవిత కనీసం స్పందించలేదు. నీళ్లు నమలాల్సి వచ్చింది. చిరవకు విధిలేక బీఆర్‌ఎస్ అతీతం కాదు అని సరిపుచ్చాల్సి వచ్చింది. బీఆర్‌ఎస్ కూడా పితృస్వామ్య పార్టీ అని కవిత అంగీకరించాల్సిన పరిస్థితి. అందుకే తాను రిజర్వేషన్ బిల్లుపై బీఆర్‌ఎస్ తరఫున కాకుండా భారత జాగృతి తరఫున పోరాటం చేస్తున్నట్లు ప్రకటించుకున్నారు.
మొత్తంగా లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ త్వరలో ఉండబోతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో కవితకు మహిళా రిజర్వేషన్ గుర్తొంచిందనే వాస్తవం. కానీ ఇంటినే ^è క్కబెట్టలేని కవిత, ఇప్పుడు భారత ప్రభుత్వాన్ని ప్రశ్నించాలనుకోవడం నవ్వు తెప్పిస్తోంది. దీంతో కవిత ఇంటర్వ్యూను నెటిజట్లు తెగ ట్రోల్ చేస్తున్నారు.