Samantha is terminally ill : స్టార్ హీరోయిన్ సమంత కష్టాలు వీడడం లేదు. ఇప్పటికే నాగచైతన్యతో విడాకులు తీసుకొని అష్టకష్టాలు పడుతూ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆమెకు మరో ప్రాణాంతక వ్యాధి పట్టుకుంది. చైతన్యతో విడాకులతో డిప్రెషన్ లోకి వెళ్లిన సమంత ఎడా పెడా సినిమాలు ఒప్పుకొని చేస్తోంది. హిందీలోనూ పాపులర్ అయ్యింది. వెబ్ సిరీస్ లు, యాడ్స్ కూడా చేస్తోంది.

ప్రస్తుతం తెలుగు, దక్షిణాది భాషలు, హిందీల్లో వరుస సినిమాలు చేస్తోంది. తెలుగులో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న మూవీలోనూ సమంతనే హీరోయిన్ . ఇక ‘శాకుంతలం’లో కూడా మెయిన్ రోల్ పోషించింది. ఇటీవలే ఆమె బర్త్ డే సందర్భంగా అందరూ విషెస్ తెలిపారు.
సమంత జీవితం ఇక కుదుటపడుతుందనుకుంటున్న సమయంలో మరో షాకింగ్ వార్త చెప్పింది. అది సినీ ఇండస్ట్రీతోపాటు అభిమానులను షాక్ కు గురిచేసింది.
తనకు ప్రాణాంతకమైన ‘మైయోసిటీస్’ అనే వ్యాధి ఉన్నట్లు ఇన్ స్టాగ్రామ్ లో సమంత షాకింగ్ విషయం చెప్పింది. చేతికి సెలైన్ ఎక్కించుకుంటున్న ఫొటోను వెనుక నుంచి చూపిస్తూ లవ్ గుర్తును సింబాలిక్ గా పెట్టి ఫొటో షేర్ చేసింది.
సమంతకు ప్రాణాంతకమైన ఈ వ్యాధి సోకిందన్న వార్త బయటపెట్టడంతో ఆమె అభిమానులంతా షాక్ అవుతున్నారు. అసలేంటి వ్యాధి? సమంత బతకదా? ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు… ఆరాతీస్తున్నారు. త్వరగా కోలుకోవాలని పోస్టులు పెడుతున్నారు.
-అసలేంటి మైయోసిటీస్ వ్యాధి
మైయోసిటిస్ అనేది కండరాల దీర్ఘకాలిక, కండర వాపుకు సంబంధించిన వ్యాధి. దీన్ని చర్మ వ్యాధి అని కూడా పిలుస్తారు. ఈ వ్యాధి సోకితే చర్మం దద్దుర్లుతో మంటపుట్టిస్తుంటుంది. ఈ అరుదైన వ్యాధిని నిర్ధారించడం కష్టం, కారణం కొన్నిసార్లు తెలియదు. లక్షణాలు కాలక్రమేణా వేగంగా.. క్రమంగా కనిపిస్తాయి. ప్రాథమిక లక్షణాలుగా కండరాల నొప్పి, పుండ్లు పడడం, అలసట, మింగడంలో ఇబ్బంది , శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటివి కలిగి ఉండవచ్చు. పురుషుల కంటే స్త్రీలు ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఉంది. అతిగా మేకప్ వేసుకోవడం వల్ల చికిత్సల వల్ల ఈ వ్యాధి సమంతకు వచ్చి ఉండవచ్చని అంటున్నారు.