KCR Jagan: తెలుగు రాష్ట్రాల్లో 40 ఇయర్స్ పాలిటిక్స్ చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేయగలరన్న పేరు సంపాదించారు. ఆయన చేతిలో తెలుగు రాష్ట్రాల్లోనే బలమైన మీడియా ఉంది. చంద్రబాబు తలుచుకుంటే ఒక్కరోజులో రాజకీయాన్ని మార్చేయగలరు. అలాంటి చంద్రబాబును తెలుగు రాష్ట్రాల్లో భయపెట్టి సాగనంపింది కేవలం ఒకే ఒక్కడు అతడు తెలంగాణ సీఎం కేసీఆర్.. ఏపీ, తెలంగాణ విడిపోయినప్పుడు హైదరాబాద్ ఉండి తెలంగాణ సర్కార్ ను అస్థిరపరుస్తున్న నాటి ఏపీ సీఎం చంద్రబాబును ‘ఓటుకు నోటు’ కేసులో అడ్డంగా బుక్ చేసి ఏపీకి సాగనంపాడు కేసీఆర్.
Also Read: ఢిల్లీకి కేసీఆర్.. తేల్చుకునే వస్తామని సవాల్

ఇప్పటికే చంద్రబాబు లాంటి బలమైన నేతను గట్టి దెబ్బ కొట్టిన ఘనత కేసీఆర్. కేసీఆర్ రాజకీయ వ్యూహాలకు చంద్రబాబు లాంటి నేతనే కుదేలయ్యాడని పేరుంది. అలాంటి రాజకీయ చాణక్యుడు కేసీఆర్ ఇప్పుడు తన ప్రియ మిత్రుడైన జగన్ ను ఓ పెళ్లిలో కలిసి చాలా సేపు రహస్యంగా మాట్లాడుకోవడం హాట్ టాపిక్ గా మారింది.
తెలంగాణ శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి మనవరాలి వివాహానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. శంషాబాద్ లో జరిగిన వివాహానికి తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా కేసీఆర్, జగన్ పక్కపక్కనే కూర్చొని కాసేపు ముచ్చటించుకున్నారు. చంద్రబాబును ఎలా మెయింటేన్ చేయాలనే దానిపైనే వీరిద్దరూ చర్చించుకున్నారన్న ప్రచారం సాగుతోంది.
ఏపీ అసెంబ్లీ పరిణామాలు.. వైసీపీ నేతల బూతులపై చంద్రబాబు మీడియా ముందు కన్నీళ్లు కార్చి సెంటిమెంట్ తెచ్చుకున్నారు. నందమూరి ఫ్యామిలీ, టాలీవుడ్ హీరోలు, ఇతరుల నుంచి సానుభూతి తెచ్చుకున్నాడు. ఈ సింపతితో జగన్ సర్కార్ డిఫెన్స్ లో పడిపోయింది. ఈ క్రమంలోనే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనే పోచారం కూతురు పెళ్లికి కేసీఆర్ రావడం.. దానికి జగన్ కూడా వచ్చి ఇద్దరూ ఏకాంతంగా మాట్లాడుకోవడం చర్చనీయాంశమైంది. చంద్రబాబును ముప్పు తిప్పలు పెట్టిన కేసీఆర్ సలహాల కోసమే జగన్ వచ్చాడని.. బాబును ఎలా కంట్రోల్ చేయాలి? ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలన్న దానిపై జగన్ కు కేసీఆర్ హితబోధ చేయాలని.. డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని జగన్ కు కేసీఆర్ సూచించినట్టుగా రాజకీయవర్గాల్లో ప్రచారం సాగుతోంది.
ఏ రాజకీయాలను అయినా ఓటమిల్లో వెంటనే డైవెర్షన్ పాలిటిక్స్ తో మార్చేసే కేసీఆర్ ఐడియాలను జగన్ పాటించి ఏదో ఒకటి చేయబోతున్నారని వీరి భేటి తర్వాత అందరికీ అర్థమవుతోంది.

Also Read: నేతల తిట్లు.. అసభ్యతకే మెట్లు.. రాష్ర్టంలో శృతిమించుతున్న రాజకీయాలు