Samantha: ఓ సామాన్య మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చిన సమంత స్టార్ హీరోయిన్ గా ఎదిగిన తీరు చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం వేస్తుంది. చిన్నప్పటి నుండే సమంత ఇండిపెండెంట్ నేచర్ కలిగిన అమ్మాయి. చదువుల్లో చురుగా ఉండే సమంత, పాకెట్ మనీ కోసం చదువుకునే రోజుల్లో మోడలింగ్ వైపు అడుగులు వేసింది. తన సొంత ఖర్చులకు అవసరమైన డబ్బులు స్వయంగా సంపాదించుకునేది. మనసులో ఏమి అనిపించినా దాచుకోని తత్త్వం ఆమెది. స్టార్ హీరోయిన్ గా ఫార్మ్ లో ఉన్నవారు వివాదాల జోలికి అసలు వెళ్లరు. ఎక్కడ కెరీర్ పై నెగిటివ్ ప్రభావం చూపుతుందో అని భయపడతారు.
Also Read: “అమ్మ చెప్పింది” అంటూ సెటైరికల్‌గా పోస్టు పెడుతోన్న సామ్!

కానీ సమంత(Samantha) హీరో, హీరోయిన్స్ రెమ్యూనరేషన్ లో వ్యత్యాసం పై ఓపెన్ గా కామెంట్స్ చేశారు. ఓ మూవీ విజయంలో హీరో హీరోయిన్ లకు సమానమైన భాగం ఉంటుంది. కానీ రెమ్యూనరేషన్ లో మాత్రం భారీ వ్యత్యాసం ఉంటుంది, ఇది సరైన పద్ధతి కాదని, కుండ బద్దలు కొట్టింది. పెళ్లి తర్వాత కూడా సమంత ఇదే బిహేవియర్ కొనసాగించారు. సూపర్ డీలక్స్ లాంటి చిత్రంలో బోల్డ్ రోల్ చేశారు. సినిమా ఫంక్షన్స్ లో స్కిన్ షో చేస్తూ… డ్రెస్ ధరించేవారు. నచ్చింది చేయడమే సమంతకు ఇష్టం, అదే ఆమె ఫాలో అవుతారు.
ఎవరేమంటే నాకేంటి అనే ఆమె నేచర్ కి మరొక ఉదాహరణ..పర్సనల్ స్టైలిష్ట్ ప్రీతమ్ జుకల్కర్ తో స్నేహం కొనసాగించడం. నాగ చైతన్యతో విడాకులు తర్వాత స్టైలిష్ట్ ప్రీతమ్ జుకల్కర్ పేరు మీడియాలో మారుమ్రోగింది. అతడితో ఉన్న సన్నిహిత సంబంధం కారణంగానే సమంత-చైతూ మధ్య విబేధాలు తలెత్తాయని కథనాలు వెలువడ్డాయి. ఇది నిజం కాదని ప్రీతమ్ వివరణ ఇచ్చారు. అయినా అతడిపై సోషల్ మీడియా దాడి ఆగలేదు.
ప్రీతమ్ విషయంలో అంత రచ్చ జరిగాక, ఎవరైనా కొన్నాళ్ళు అతనికి దూరంగా ఉండాలని అనుకుంటారు. అందరిలా ఆలోచిస్తే ఆమె సమంత ఎందుకు అవుతుంది. ఎవరు ఏమనుకున్నా ఐ డోంట్ కేర్.. అంటూ అతనితో దుబాయ్ ట్రిప్ కి వెళ్ళింది. ప్రీతమ్ తో సమంత స్నేహం మరింత బలంగా మారింది. ఆయన డిజైన్ చేసిన దుస్తులలో వరుస ఫోటో షూట్స్ చేస్తూ, తన బోల్డ్ యాటిట్యూడ్ నిరూపించుకుంటుంది. సమంత ఎంత స్ట్రాంగ్ అమ్మాయో చెప్పడానికి ఇదొక గట్టి ఉదాహరణ.
Also Read: ఘనంగా హీరో కార్తికేయ వివాహం… ముఖ్య అతిధిగా హాజరైన మెగాస్టార్