Home Blog Page 86

అనిల్ రావిపూడి పేరు వాడుకుంటూ బడా మోసం.. హెచ్చరించిన నిర్మాతలు..

Anil Ravipudi Rayalaseema Dialect
Anil Ravipudi Rayalaseema Dialect

Anil Ravipudi casting scam : టాలీవుడ్ క్రేజీ టాప్ డైరెక్టర్స్ లో ఒకరు అనిల్ రావిపూడి. ఆయన సినిమా వస్తుందంటే చాలు , ఫ్యామిలీ ఆడియన్స్ ఎగబడిపోతుంటారు. వరుసగా రెండు సంక్రాంతి సీజన్స్ లో రెండు ఇండస్ట్రీ హిట్స్ ని అందుకున్న ఆయన , ఇప్పుడు ముచ్చటగా మూడవ ఇండస్ట్రీ హిట్ కి రెడీ అయిపోయాడు. విక్టరీ వెంకటేష్ , కళ్యాణ్ రామ్ లతో ఆయన ఒక మల్టీస్టార్రర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. నేటి నుండి ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఈ సందర్భంగా కొందరు అనిల్ రావిపూడి పేరు వాడుకొని మోసాలకు పాల్పడే ప్రయత్నాలు చేయడం ఈ చిత్ర నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ గుర్తించింది. దీంతో కాసేపటి క్రితమే సోషల్ మీడియా ద్వారా అభిమానులకు ఒక ముఖ్యమైన ప్రెస్ నోట్ విడుదల చేసింది.

వాళ్ళు మాట్లాడుతూ ‘మా సినిమా పేరుతో కొంతమంది ఒక నకిలీ క్యాస్టింగ్ కాల్ సోషల్ మీడియా మరియు ఇతర మాధ్యమాల్లో ప్రకటన ఇచ్చి ప్రచారం చేస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. ఆ క్యాస్టింగ్ కాల్ కి మా చిత్ర బృందానికి ఎలాంటి సంబంధం లేదు. దయచేసి అలాంటి మోసపూరిత ప్రలోభాలకు లొంగిపోకండి. మా సినిమా పేరుతో ఆ వ్యక్తులు మీ వద్దకు వచ్చి డబ్బులు , వ్యక్తిగత వివరాలు , ఫోటోలు , ఇంటి పత్రాలు వంటివి అడిగితే ఇవ్వద్దని విజ్ఞప్తి. ఒకవేళ మేము క్యాస్టింగ్ చేయాలనుకుంటే మా అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ప్రకటన ఇస్తాము. దయచేసి జాగ్రత్త వహించాల్సిందిగా ప్రార్ధన. మోసగాళ్ల వలలో చిక్కుకొని నష్టపోకండి’ అంటూ చెప్పుకొచ్చారు. ఇలాంటివి ఈమధ్య కాలంలో సర్వసాధారణం అయిపోయింది . సినిమాలంటే పిచ్చి ఉన్న వాళ్ళు , ఇలాంటి ప్రభోలకు చాలా తేలికగా లొంగిపోయి లక్షల రూపాయలు నష్టపోయిన వాళ్ళు , తద్వారా ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు.

ఇలాంటి వ్యక్తుల నుండి కాస్త దూరంగా ఉండండి. ఇక ఈ చిత్రం విషయానికి వస్తే , రీసెంట్ గానే పూజ కార్యక్రమాలతో చాలా గ్రాండ్ గా ఈ చిత్రాన్ని మొదలు పెట్టారు. అనంతరం మ్యూజిక్ డైరెక్టర్ ప్రకటన ఎంత విన్నూతనంగా చేశారో మనమంతా చూశాము . జీవీ ప్రకాష్ కుమార్ ని వైజాగ్ బీచ్ ఇసుక లో కప్పేసి, మ్యూజిక్ సిట్టింగ్స్ వేసిన విధానం చూసి నెటిజెన్స్ పొట్ట చెక్కలు అయ్యేలా నవ్వుకున్నారు. మరోసారి అలాంటి అరుదైన కాన్సెప్ట్ తో నిన్న ఈ చిత్రానికి సంబంధించిన జానర్ ని ప్రకటించారు అనిల్ రావిపూడి. నేటి నుండి విరామం లేకుండా రెగ్యులర్ షూటింగ్ చేసి , వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఛార్లెట్‌లో తానా ఆధ్వర్యంలో ఘనంగా ఫాదర్స్ డే వేడుకలు

tana-charlotte-celebrates-fathers-day-with-grand-hiking-event

TANA Fathers Day : ఛార్లెట్: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఛార్లెట్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఫాదర్స్ డే హైకింగ్ ఈవెంట్ ఘన విజయాన్ని సాధించింది. జూన్ 21న నిర్వహించిన ఈ కార్యక్రమంలో మూడు తరాలకు చెందిన సుమారు 60 మంది ఉత్సాహంగా పాల్గొని ఆహ్లాదకరమైన వాతావరణంలో సందడి చేశారు.

అందమైన ప్రకృతి దృశ్యాల నడుమ జరిగిన హైకింగ్‌లో చిన్నారుల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన అల్పాహారం, కేక్ కటింగ్ కార్యక్రమం, పరస్పర ఆత్మీయ సంభాషణలు ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కుటుంబ సభ్యులందరూ కలిసి గడిపిన ఈ వేడుక చిరస్మరణీయ అనుభూతిని అందించిందని పాల్గొన్నవారు తెలిపారు.

ఈ సందర్భంగా తానా ఛార్లెట్ నాయకులు మాట్లాడుతూ, తెలుగు సమాజాన్ని ఒకే వేదికపైకి తీసుకురావాలనే లక్ష్యంతో తానా నిరంతరం సేవా, సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తోందని చెప్పారు. కుటుంబానికి మార్గదర్శి, బలమైన ఆధారం నాన్న అని పేర్కొంటూ, ఫాదర్స్ డే సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.

తెలుగు కుటుంబాల మధ్య ఐక్యత, స్నేహభావం మరింత బలోపేతం కావాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా కొత్త కుటుంబాలు ఒకరినొకరు పరిచయం చేసుకునే అవకాశం లభించిందని, కమ్యూనిటీ బంధాలు మరింత బలపడినట్లు పేర్కొన్నారు.

కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్క పాల్గొన్న వారికి, స్వచ్ఛంద సేవకులకు, నిర్వాహక బృందానికి తానా ప్రతినిధులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమం నిర్వహణలో నాని వడ్లమూడి, ఠాగూర్ మల్లినేని, కిరణ్ కొత్తపల్లి, మాధురి ఏలూరి, నాగ పంచుమర్తి, పట్టాభి కంఠమనేని, అన్నే రమణ తదితరులు విశేషంగా కృషి చేశారు.

ఐ ఫోన్ 18 కెమెరాపై షాకింగ్ న్యూస్.. ఇది ఎలా ఉందో తెలుసా..

iPhone 18 Camera Leaks
iPhone 18 Camera Leaks

iPhone 18 Camera Leaks: భారతదేశంలో ఐఫోన్ కు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో కొత్త సిరీస్ మార్కెట్లోకి వస్తుందంటే ముందు నుంచే క్యూ కడుతూ ఉంటారు. అయితే ఈ సెప్టెంబర్ లో 18 సిరీస్ ఫోన్ రాబోతుంది. దీని గురించి వస్తున్న లీక్‌లు, తాజా సమాచారం ప్రకారం.. ఈ ఫోన్ డిజైన్‌లో పెద్ద మార్పులేవీ ఉండకపోవచ్చు కానీ కెమెరా విభాగంలో మాత్రం భారీ అప్‌గ్రేడ్‌లు ఉండే అవకాశం ఉందని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఈ విషయంపై పూర్తి వివరాల్లోకి వెళితె..

ఐఫోన్ 18 ప్రో డిజైన్ పరంగా ఐఫోన్ 17 ప్రోకి చాలా దగ్గరగా ఉండే అవకాశం ఉంది. ఆపిల్ తన సిగ్నేచర్ ‘ట్రిపుల్ కెమెరా’ సెటప్‌ను అలాగే కొనసాగించనుంది. అయితే లీక్ అవుతున్న సమాచారం ప్రకారం.. ఫోన్ వెనుక భాగంలో ఉండే కెమెరా ‘ప్లాటూ’ లేదా మాడ్యూల్ గతంతో పోలిస్తే కొంచెం మందంగా మారే అవకాశం ఉంది. అలాగే, వెనుక గ్లాస్, ఫ్రేమ్ మధ్య వ్యత్యాసం తగ్గి, మరింత ‘సీమ్‌లెస్’ ఫినిషింగ్‌ను ఆపిల్ తీసుకురానుంది.

ఈ ఫోన్‌లో అత్యంత ఆకర్షణీయమైన అప్‌గ్రేడ్ ‘వేరియబుల్ ఎపర్చరు’ టెక్నాలజీ. ఇది ఐ ఫోన్లలో ఇదే మొదటిసారి. సాధారణంగా డిజిటల్ కెమెరాల్లో ఉండే ఈ ఫీచర్ ద్వారా, ఫోటో తీసేటప్పుడు లెన్స్‌లోంచి ఎంత కాంతి లోపలికి రావాలో మనం నియంత్రించవచ్చు. దీనివల్ల తక్కువ వెలుతురులో అద్భుతమైన ఫోటోలు రావడం, అలాగే బ్యాక్‌గ్రౌండ్ బ్లర్ మరింత సహజంగా ఉండటం జరుగుతుంది.

అదీ గాకుండా ఆపిల్ తన కెమెరా సెన్సార్ల కోసం ఇప్పటివరకు సోనీపై ఆధారపడేది. కానీ ఐఫోన్ 18 ప్రో కోసం శామ్‌సంగ్ తయారు చేసిన కొత్త ‘త్రీ-లేయర్ స్టాక్డ్ ఇమేజ్ సెన్సార్’ను వాడనున్నట్లు సమాచారం. ఈ సెన్సార్ వల్ల ఫోటోలలో నాయిస్ తగ్గి, డైనమిక్ రేంజ్ పెరుగుతుంది. దీంతో కెమెరా రెస్పాన్స్ టైమ్ వేగవంతం అవుతుంది. అలాగే, ప్రధాన కెమెరా 48 మెగాపిక్సెల్ ఫ్యూజన్ కెమెరాగా కొనసాగుతూనే, పైన పేర్కొన్న అధునాతన ఫీచర్లతో మెరుగైన అవుట్‌పుట్‌ను ఇస్తుంది.

ముందు భాగంలో ఉండే సెల్ఫీ కెమెరాను కూడా ఆపిల్ అప్‌గ్రేడ్ చేసే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఉన్న 18MP కెమెరా స్థానంలో కొత్త 24MP సెన్సార్ వచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇది వీడియో కాల్స్ మరియు తక్కువ వెలుతురులో సెల్ఫీలకు మరింత స్పష్టతను ఇస్తుంది. ఐఫోన్ 18 ప్రో రూపం మారకపోయినా, దాని కెమెరా సామర్థ్యం మాత్రం ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీకి మరింత దగ్గరగా వెళ్లనుంది.

నేను ఆ కథ విని ఉంటే మహేష్ బాబు ను చేయనిచ్చేవాడిని కాదు: కృష్ణ..వైరల్ వీడియో..

Mahesh Babu Early Career Story
Mahesh Babu Early Career Story

Mahesh Babu Early Career Story: తెలుగు సినిమా ఇండస్ట్రీకి సూపర్ స్టార్ కృష్ణ చాలా సంవత్సరాల పాటు తనదైన రీతిలో సేవలను అందించాడు. ఆయన నుంచి ఒక సినిమా వచ్చింది అంటే చాలు ఆ సినిమా మినిమం గ్యారంటి సినిమా గా ఉండేది. ప్రొడ్యూసర్లు సైతం కృష్ణ తో సినిమా చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపించేవారు. అలాంటి కృష్ణ ఆ తర్వాత కాలంలో స్టార్ హీరోగా అవతరించడమే కాకుండా తన కొడుకు అయిన మహేష్ బాబు ను సైతం సూపర్ స్టార్ గా మార్చడంలో తీవ్రమైన కృషి చేశాడు. ఇక అలాంటి మహేష్ బాబు విషయంలో చాలా కేర్ఫుల్ గా వ్యవహరించాడు. కెరియర్ స్టార్టింగ్ లో మహేష్ బాబు చేసే సినిమా కథ లను కృష్ణ విని ఫైనల్ చేసేవాడు.

కానీ ఒక కథను మాత్రం కృష్ణ వినలేదట. అందువల్లే ఆ సినిమా ప్లాప్ అయిందని ఆ కథ వినుంటే మహేష్ బాబు చేత ఆ మూవీ చేయనిచ్చేవాడిని కాదని చాలా స్పష్టంగా చెప్పాడు… ఇంతకీ ఆ సినిమా ఏంటి ఆ కథ ఏంటి అంటే ఎస్ జే సూర్య దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా చేసిన ‘నాని’ సినిమా కావడం విశేషం…

ఈ సినిమాలో మహేష్ బాబు 12 గంటలు పిల్లాడిలా, 12 గంటలు పెద్దవాడిలా కనిపిస్తాడు. ఒక స్టార్ హీరో ఇమేజ్ ఉన్న నటుడు అలాంటి కథ చేయడం కరెక్ట్ కాదని నాకు సినిమా స్టార్ట్ అవ్వకముందే కథ చెబితే సినిమాని తీయనిచ్చెవాడిని కాదని చెప్పాడు. ఇక ఈ మూవీ తమిళంలో హిట్ అయిందంటే అక్కడ దర్శకుడు ఎస్ జె సూర్య హీరోగా ఈ సినిమాని చేశాడు.

అతనికి ఎలాంటి క్రేజీ లేదు. కాబట్టి అక్కడ ఆడింది ఇక్కడ ఇమేజ్ ఉన్న హీరోతో అలాంటి సినిమా చేస్తే అది ఆడదని ఈ సినిమా విషయంలో అదే ప్రూవ్ అయిందని కృష్ణ చాలా క్లారిటిగా చెప్పాడు. ఇక ఏది ఏమైనా కూడా అప్పుడెప్పుడో కృష్ణ చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. మహేష్ బాబు కెరీర్ స్టార్టింగ్ లో చాలా కథలను కృష్ణ నే సెలెక్ట్ చేశాడు. ఆ మూవీస్ కూడా సూపర్ హిట్ అయ్యాయి. కృష్ణను కాదని మహేష్ బాబు సెలెక్ట్ చేసుకున్న సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. ఒక రకంగా కృష్ణ అనుభవమే మహేష్ బాబుని స్టార్ హీరోను చేయడంలో హెల్ప్ అయిందని చాలామంది నమ్ముతుంటారు…

పదవి నుంచి తప్పుకున్న కీర్ స్టార్మర్.. కారణమేంటి.. బ్రిటన్ లో ప్రధాన మంత్రులకు ఏమాత్రం విలువ లేదా..

Keir Starmer resigns
Keir Starmer resigns

Keir Starmer resigns: మనదేశంలో ఒక వార్డుకు కార్పొరేటర్ అయితేనే.. పెద్ద హంగామా ఉంటుంది. ఫార్చునర్ కారు.. చుట్టూ మందీ మార్బలం.. అనుచరులు.. ఆ లెవెల్ వేరే రేంజ్ లో ఉంటుంది. అటువంటిది ఒక దేశానికి ప్రధానమంత్రి అయితే.. చెప్పడానికి ఏముంది.. చుట్టూ కాపలా కాసే పోలీసులు.. అధికారులు.. వాహనశ్రేణి.. సెక్యూరిటీ.. ఆ లెవలే ఒక లెవెల్ లో ఉంటుంది. ప్రధానమంత్రి గురించి ఈ రేంజ్ లో చెప్పాం కదా.. కానీ ఆదేశంలో పెద్దగా విలువ ఉండదు. అందువల్లే ఆ పదవిలో ఉన్న వారు రాజీనామా చేస్తూ ఉంటారు. ఇంతకీ ఏమా దేశం.. ఇక్కడ ఆ కథ అంటే..

మన దేశాన్ని 200 సంవత్సరాలు పాటు పరిపాలించిన బ్రిటన్ దేశంలో రాజకీయ అస్థిరత కొనసాగుతోంది. ఆ దేశానికి సంబంధించిన ప్రధానమంత్రి చీఫ్ స్టార్మర్ ఊహించని విధంగా తన పదవికి రాజీనామా చేశారు. అంతేకాదు వెళ్తూ వెళ్తూ ఆయన సంచలన ఆరోపణలు చేశారు. కొంతకాలంగా స్టార్మర్ బ్రిటన్ ప్రధానమంత్రిగా కొనసాగుతున్నారు. అక్కడ ఆయన అనేక రకాల నిర్ణయాలు తీసుకున్నారు. ఇవన్నీ కూడా బ్రిటన్ చరిత్రలోనే విప్లవత్మకంగా మారిపోయాయి. అంతా సాఫీగానే జరుగుతోంది అనుకుంటున్న క్రమంలో.. స్టార్మర్ తన పదవికి రాజీనామా చేశారు.

స్టార్మర్ తన పదవికి రాజీనామా చేయడానికి లేబర్ పార్టీ ఒత్తిడి కారణమని బ్రిటన్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆయన పదవిలో ఉన్నంతకాలం విలువలు కొనసాగించారని.. బ్రిటన్ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించారని అక్కడి మీడియా ప్రసారం చేసిన కథనాల ద్వారా తెలుస్తోంది. స్టార్ మార్ 2024లో బ్రిటన్ దేశానికి ప్రధాన మంత్రిగా పనిచేయడం మొదలుపెట్టారు. ఇటీవల ఎన్నికల్లో లేబర్ పార్టీ దారుణమైన ఫలితాలను చవి చూసింది. మేకర్ ఫీల్డ్ పార్లమెంటరీ ఎన్నికల్లో బర్న్ హామ్ అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. దీంతో స్టార్మర్ మీద ఒత్తిడి పెరిగిపోయింది. దీనికి తోడు ఇటీవల ఎఫ్ స్టీన్ వ్యవహారం వెలుగులోకి రావడం.. అందులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తన స్నేహితుడు పీటర్ మాండిల్సన్ ను అమెరికా రాయబారిగా నియమించాలని స్టార్మర్ నిర్ణయించారు.

స్టార్మర్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అయింది. దీంతో ఆయన పదవికి ముప్పు వాటిల్లింది. ఒత్తిడి కూడా పెరిగిపోవడంతో పదవి నుంచి తప్పుకున్నారు. ఇటీవల ఆయన పరిపాలన గురించి రకరకాల వార్తలు రావడంతో ఖండించారు. కానీ చివరికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. సరిగ్గా ఆదివారం ట్రంప్ స్టార్మర్ రాజీనామా గురించి ప్రస్తావించారు. ట్రంప్ చెప్పిన కొద్ది గంటల్లోనే స్టార్మర్ రాజీనామా చేయడం విశేషం.

బ్రిటన్ దేశంలో గడిచిన 10 సంవత్సరాల కాలంలో పదవులకు రాజీనామా చేసిన ప్రధాన మంత్రుల సంఖ్య ఏకంగా ఆరుకు పెరిగింది. దీన్ని బట్టి అక్కడ ప్రధానమంత్రి పదవికి పెద్దగా విలువలేదని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. పదవిలో చేరిన వారు ఎక్కువ కాలం ఉండకపోవడం వల్ల అంతర్జాతీయ మీడియా రకరకాలుగా కథనాలను ప్రసారం చేస్తోంది. గ్రేట్ బ్రిటన్ లో ఇటువంటి పరిపాలన రాహిత్యం కొనసాగడం బాధాకరమని వ్యాఖ్యానిస్తోంది.

పవన్ కళ్యాణ్ చేసిన సినిమాల్లో ఆయనకి నచ్చని సినిమా ఏంటంటే..?

Pawan Kalyan
Pawan Kalyan

Pawan Kalyan Movies List: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన చాలా సినిమాలు అతన్ని టాప్ లెవెల్ నిల్చబెట్టాయనే చెప్పాలి. కెరియర్ స్టార్టింగ్ లో వరుసగా ఏడు సినిమాలు సూపర్ సక్సెస్ అవ్వడంతో ఆయనకు తిరుగుండదని అందరు అనుకున్నారు. పవర్ స్టార్ ఇమేజ్ ని సంపాదించుకొని తెలుగులో నెంబర్ వన్ హీరోగా మారుతున్నాడు అని అనుకున్నప్పటికి ఖుషి సినిమా తర్వాత అతనికి దాదాపు 10 సంవత్సరాలపాటు ఒక్క సక్సెస్ కూడా రాలేదు. ఎట్టకేలకు గబ్బర్ సింగ్ సినిమాతో పూర్వ వైభవం అందుకున్న ఆయన ఆ తర్వాత చేసిన అత్తారింటికి దారేది సినిమా సైతం సూపర్ సక్సెస్ ను సాధించింది. ఇక పవన్ కళ్యాణ్ మరోసారి పెను సంచలనాన్ని క్రియేట్ చేస్తూ ముందుకు సాగాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ లాంటి హీరో ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. ఇక ఈ సంవత్సరం ఇప్పటికే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాతో భారీగా దెబ్బతిన్న ఆయన ఇప్పుడు చేయబోతున్న సినిమాల విషయంలో స్పెషల్ కేర్ తీసుకున్నాడు.

ఇక ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని మెప్పించగలిగే కెపాసిటి తన సొంతం అంటూ ఆయన పలు విధాలుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు…ఇక తన ఎంటైర్ కెరీర్ లో ఆయన చేసిన సినిమాల్లో అతనికి నచ్చని ఒక సినిమా అయితే ఉందట. ఇంతకీ ఆ సినిమా ఏంటంటే ఎస్ జే సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన ‘పులి’ సినిమా కావడం విశేషం…

ఆ సినిమా మీద మొదట్లో భారీ అంచనాలు ఉన్నప్పటికి మొదట అనుకున్న కథకి తీసిన దానికి సంబంధం లేకుండా పోయింది. అందువల్లే ఈ సినిమా తనకు నచ్చదని పలు సందర్భాల్లో పవన్ కళ్యాణ్ చెప్పాడు. ఇక ఏది ఏమైనా కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి వచ్చే సినిమాలు తన అభిమానులను అలాగే ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తుంటాయి.

ఇక పవన్ కళ్యాణ్ కి తన సినిమాల్లో పులి సినిమా నచ్చదని చెప్పడం అతని అభిమానులను కూడా తీవ్రమైన నిరాశకి గురి చేస్తుంది. కారణం ఏంటంటే ఆ సినిమా కోసం మూడు సంవత్సరాల సమయాన్ని కేటాయించాడు. అయినప్పటికి దర్శకుడు ఆ సినిమాని అనుకున్న రేంజ్ లో తీర్చిదిద్దలేదని పవన్ కళ్యాణ్ కామెంట్స్ చేశాడు…

రామ్ చరణ్ కొన్ని సీన్స్ లో నటించేటప్పుడు చిరంజీవిని కాపీ చేస్తున్నాడా..?

Ram Charan copying Chiranjeevi
Ram Charan copying Chiranjeevi

Ram Charan copying Chiranjeevi: సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఎనలేని గుర్తింపైతే ఉంది. గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా స్థాయిని పెంచుతూ ఎప్పటికప్పుడు కొత్త పంథాలో సినిమా ఇండస్ట్రీని నడిపిస్తున్న ఘనత కూడా తనకే దక్కింది. అలాంటి చిరంజీవిని ఇప్పటివరకు బీట్ చేసే హీరోలు ఎవరూ లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఆయన నటన ముందు ఎవరైనా దిగదుడుపే మరి ఇప్పుడు ఆయన తన నట వారసుడు అయిన రామ్ చరణ్ ను సైతం భారీ ఎత్తున ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. మెగా పవర్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్లడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని సైతం మెప్పించే స్థాయికి వెళ్తున్నాడు…రామ్ చరణ్ ఈ మధ్యకాలంలో చేసిన సినిమా విషయంలో చాలా క్లారిటిని మెయింటైన్ చేస్తున్నాడు.

ఇక ఇదిలా ఉంటే రామ్ చరణ్ కొన్ని సన్నివేశాల్లో నటించేటప్పుడు చిరంజీవిని కాపీ చేస్తున్నాడు అంటూ కొన్ని కామెంట్లు వస్తున్నాయి. నిజానికి చిరంజీవి నట వారసుడు కాబట్టి అతని జీన్స్ అయితే రామ్ చరణ్ కూడా వర్తిస్తుంది. కాబట్టి అనుకోకుండా కొన్ని సిచువేషన్ లో ఆయన చిరంజీవి తాలూకు నటనను కూడా రిప్రజెంట్ చేయగలుగుతున్నాడు.

ఇన్బిల్ట్ గా అతని లోపల నుంచే ఎక్స్ప్రెషన్స్ వస్తున్నాయి తప్ప ఇమిటేషన్ చేస్తే వచ్చేవి కావు అని ఇంకొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. చిరంజీవి ఎంత గొప్ప నటుడో మనందరికి తెలిసిందే. ఈ ఏజ్ లో కూడా డిఫరెంట్ తరహా సినిమాలను చేస్తూ ముందుకు సాగడం అనేది మామూలు విషయం కాదు… ఇక రామ్ చరణ్ నటనలో చిరంజీవి హవా భావాలు కూడా కనిపిస్తాయి అంటూ వచ్చే వార్తలకు గతంలో చిరంజీవి క్లారిటీ ఇచ్చాడు…

అలా ఎందుకు కనిపిస్తాయి అంటే చరణ్ నా రక్తం కాబట్టి అంటు ఆయన అప్పట్లో కొన్ని మాటలైతే మాట్లాడాడు… ప్రస్తుతం రామ్ చరణ్ సుకుమార్ తో ఒక సినిమా చేస్తున్నాడు. మేకర్స్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలనే లక్ష్యంతో రామ్ చరణ్ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది…

అనిల్ రావిపూడి - అల్లు అర్జున్ కాంబోలో మిస్ అయిన మూవీస్ ఇవేనా..?

Anil Ravipudi Allu Arjun Combo
Anil Ravipudi Allu Arjun Combo

Anil Ravipudi Allu Arjun Combo: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అల్లు అర్జున్ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఇప్పటివరకు తన నుంచి వచ్చిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. ఇక ప్రస్తుతం ఆయన అట్లీ డైరెక్షన్లో ‘రాకా’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో తనదైన రీతిలో సత్తా చాటుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక అల్లు అర్జున్ మొదటినుంచి డిఫరెంట్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించాడు. కమర్షియల్ సినిమాల వైపు అడుగులు వేసినప్పటికి దాని నుంచి తేరుకొని డిఫరెంట్ సబ్జెక్టులను క్యారెక్టరైజేషన్ మీద రన్ అయ్యే సినిమాలను మాత్రమే చేయడానికి ఆయన ఎక్కువగా ఇంట్రెస్ట్ అయితే చూపించాడు.

ఇక ఈ క్రమంలోనే పుష్ప సినిమాతో తనదైన రీతిలో సత్తా చాటుకున్నాడు. నిజానికి రేసుగుర్రం సినిమా తర్వాత అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఒక సినిమా చేయాల్సిందే. కానీ అనుకోని కారణాల వల్ల ఆ సినిమా అయితే చేయలేకపోయాడు. నిజానికి అనిల్ రావిపూడి కమర్షియల్ సబ్జెక్ట్ లను చాలా బాగా డీల్ చేయగలడనే నమ్మకం అయితే వచ్చింది.

ఇక ఆ సమయంలోనే తనతో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకున్నాడు. అందరు కలిసి నవ్వుకునేలా చాలా ఆహ్లాదకరంగా ఉండే సినిమా చేయాలనుకున్నప్పుడు అనిల్ రావిపూడి తో చేయడం బెటర్ అని తనకి కొంతమంది సలహాలు ఇచ్చారని కూడా అడిగారంట. కానీ అనిల్ చెప్పిన కథలు అతనికి పెద్దగా ఎక్కకపోవడంతో వీళ్ళ కాంబినేషన్ సెట్ అవ్వలేదని అప్పట్లో కొన్ని కథనాలైతే వెలువడ్డాయి. ఇక ఏది ఏమైనా కూడా ఇప్పుడు అల్లు అర్జున్ స్టార్ హీరో గా వెలుగొందుతున్నాడు…

ఇక అనిల్ రావిపూడి సైతం కమర్షియల్ సినిమాలను చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ ముందుకు సాగుతున్నాడు. కాబట్టి ఆయన ఇప్పుడు చేస్తున్న ఈ సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు దూసుకెళ్తుండటం విశేషం…చూడాలి మరి ఇక మీదట వీళ్ళు చేసే సినిమాలు ఎలా ఉంటాయి…సగటు ప్రేక్షకులను మెప్పిస్తాయా లేదా అనేది…

నష్టాల ఊబి నుంచి కోట్ల లాభాలకు..సామ్ సంగ్ కే చెక్ పెట్టింది.. ఈ కంపెనీ

SK Hynix Profit Growth
SK Hynix Profit Growth

SK Hynix Profit Growth: అసలు ఆ కంపెనీ కోలుకోదు అన్నారు. నష్టాల నుంచి బయటపడదు అన్నారు. ఆస్తులు మొత్తం అమ్మేసుకోవడం ఉత్తమం అన్నారు. అసలు వీళ్ళకి వ్యాపారం చేయడం వచ్చా అంటూ ఎగతాళి చేశారు. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు సంవత్సరాల పాటు సాగింది. ఏం చేయాలో తెలియలేదు. ఇక ఆ కంపెనీ నిర్వాహకులు ఏదో ఒక నిర్ణయం తీసుకోబోతుండగా అద్భుతం జరిగింది. అది సినిమాను తలపించింది.

ప్రపంచంలో టెక్నాలజీ దిగ్గజ కంపెనీలలో సామ్ సంగ్ ఒకటి. దక్షిణ కొరియాలోని ఇది అతి పెద్ద కంపెనీ. ఎలక్ట్రానిక్స్ రంగంలో ఈ కంపెనీకి తిరుగులేదు. గడిచిన 20 సంవత్సరాలుగా మార్కెట్ విలువను పెంచుకుంటూ లీడింగ్ స్థానంలో కొనసాగుతోంది. ఈ కంపెనీని అధిగమించడం పెద్దపెద్ద సంస్థల వల్ల కూడా కాలేదు. అయితే ఇప్పుడు ఈ కంపెనీని దాటి.. ఒక సంస్థ ఎదిగింది. అద్భుతాన్ని కళ్ళ ముందు ఉంచింది. అంతేకాదు అప్పుల ఊబి నుంచి కోట్ల లాభాలను అందిపుచ్చుకుంది. అదే కాదు ఏకంగా సాంసంగ్ కంపెనీకే షాక్ ఇచ్చింది. ఈ కంపెనీ పేరు ఎస్.కె హైనిక్స్.

ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ముఖ్యంగా ఎలక్ట్రానిక్ విభాగంలో చిప్ వ్యాపారం జోరుగా సాగుతోంది. ఏ ఐ బూమ్ కూడా తోడు కావడంతో చిప్ లకు విపరీతమైన గిరాకీ ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో ఎస్.కె హైనిక్స్ ఈ బూమ్ ను అందిపుచ్చుకుంది. మార్కెట్ గిరాకిని అనుసరించి రకరకాల చిప్ లు తయారు చేయడం మొదలుపెట్టింది. చివరికి సాంసంగ్ కంపెనీకి షాక్ ఇచ్చింది.

ఎస్.కె హైనిక్స్ కంపెనీ మార్కెట్ విలువ 2082.5 ట్రిలియన్ వాన్ లు. డాలర్ ప్రకారం చూసుకుంటే 1.35 ట్రిలియన్లు. సాంసంగ్ విలువ 2081.3 ట్రిలియన్ వాన్ లు గా ఉంది. 2000 సంవత్సరం నుంచి దక్షిణ కొరియాలో అతిపెద్ద కంపెనీగా సాంసంగ్ కొనసాగుతోంది. అయితే ఇప్పుడు దీనిని హైనిక్స్ అధిగమించింది. ఒకవేళ తమ ప్రిఫర్డ్ షేర్లను లెక్కిస్తే విలువ అధికంగా ఉంటుందని సాంసంగ్ కంపెనీ చెబుతున్నది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ లో కీలకమైంది హై బ్రాండ్ విత్ మెమొరీ చిప్స్. వీటిని హైనిక్స్ కంపెనీ తయారు చేస్తోంది. గూగుల్.. ఎన్ వీడియా వంటి కంపెనీలకు హైనిక్స్ సరఫరా చేస్తోంది. హై బ్యాండ్ విడ్త్ మెమొరీ చిప్స్ మార్కెట్లో దాదాపు 61 శాతం హైనిక్స్ కంపెనీకి ఉంది. ఇందులో సాంసంగ్ 17%.. మైక్రోన్ కంపెనీకి 21 శాతం వాటా ఉంది.

హైనిక్స్ కంపెనీని 1983లో హ్యుందాయ్ ఏర్పాటు చేసింది. 2003 వరకు ఈ కంపెనీ తీవ్రమైన నష్టాలలో కూరుకుపోయింది. ఒక దశలో కంపెనీని మూసివేద్దామనుకున్నారు. మైక్రాన్ అనే కంపెనీకి అమ్ముదామని భావించారు. అనుకోకుండా డీల్ క్యాన్సిల్ అయింది. ఆ తర్వాత 2003లో hyundai కంపెనీ దీని నిర్వహణ నుంచి తప్పుకుంది. ఆ తర్వాత ఎస్.కె గ్రూప్ దీనిని దక్కించుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో ఈ కంపెనీ రూపురేఖలు మారిపోయాయి. ఇదే ఊపులో ఎస్.కె హైనిక్స్ త్వరలోనే అమెరికా స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవ్వడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నది.

పక్కన ఉన్నది వాడేనా.. ఓసారి చూపించు.. కన్నీరు తెప్పిస్తున్న రాధా గాయత్రి చివరి మాటలు

Radha Gayatri Last Words
Radha Gayatri Last Words

Radha Gayatri Last Words: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతి రాధా గాయత్రి ఇటీవల ముసోరి ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఈమె మరణం మీద ఆది నుంచి అనుమానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి పోలీసులు ఆమె భర్త శ్రీ చరణ్ మీద హత్య కేసు నమోదు చేశారు. ఈ కేసులో తాను నిరపరాధిని అంటూ శ్రీ చరణ్ చెబుతున్నారు. మరోవైపు తమ కూతురుది హత్యా అని రాధా గాయత్రి తల్లిదండ్రులు చెబుతున్నారు.

రాధా గాయత్రి ఐటి సంస్థలో పనిచేస్తోంది. ఇటీవల తన భర్తతో కలిసి ఉత్తరాఖాండ్ రాష్ట్రంలోని ముస్సూరీ ప్రాంతానికి వెళ్ళింది. అక్కడ అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. కూతురు మరణాన్ని జీర్ణించుకోలేక తల్లిదండ్రులు గుండెలు పగిలే విధంగా రోధిస్తున్నారు. ఈ క్రమంలోనే రాధా గాయత్రి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు నేపథ్యంలో ముసోరి పోలీసులు రాధా గాయత్రి భర్త మీద కేసు నమోదు చేశారు. ఈ ఘటన రోజురోజుకు కొత్త కొత్త విషయాలను వెలుగులోకి తీసుకొస్తోంది. ప్రస్తుతం ఓ ఆడియో క్లిప్ వెలుగులోకి వచ్చింది. అందులో రాధా గాయత్రి మాటలు వినిపిస్తున్నాయి. ఆమె తన తల్లితో మాట్లాడుతున్నప్పుడు రికార్డ్ చేసినట్టు తెలుస్తోంది. ఇవే రాధా గాయత్రి తన చివరి మాటలు.

రాధా గాయత్రి తన తల్లితో మాట్లాడుతున్న మాటల్లో ఆర్ద్రత కనిపిస్తోంది. ఆవేదన ధ్వనిస్తోంది.” నన్ను అనుమానిస్తున్నాడు. ప్రతిక్షణం ఇబ్బంది పెడుతున్నాడు. ఫోన్ చేస్తే పక్కన ఎవరున్నారు అడుగుతున్నాడు. ఒకసారి వీడియో కాల్ చేసి చూపించు అంటున్నాడు. మగ గొంతు వినిపిస్తోంది.. పక్కన ఉన్నది వాడేనా అని అంటున్నాడు. అతడి మీద నాకు నమ్మకం పోయింది. మనసు విరిగిపోయింది. అనుమానం విపరీతంగా పెంచుకుంటున్నాడు. తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. ఒకవేళ నేను తప్పు చేస్తే నన్ను నేరుగా అడగమని చెప్పేశాను. వాళ్ళ అమ్మతో కూడా చెప్పాను. అతనితో మాట్లాడాలంటే ఇబ్బందిగా ఉంది. ఒకవేళ మీకు ఏదైనా సమస్య ఉంటే మా అమ్మానాన్నతో మాట్లాడమని చెప్పాను. సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. అవన్నీ కూడా దాటిపోయాయి.. అతడు దారుణంగా ప్రవర్తిస్తున్నాడని” రాధా గాయత్రి తన తల్లితో చెప్పినట్టు తెలుస్తోంది.

ఈ కేసులో రాధా గాయత్రి తండ్రి కూడా సంచలన విషయాలను చెప్పాడు. రాధా గాయత్రి బ్యాగులో శ్రీ చరణ్ ట్రాకర్ పెట్టాడని అతడు ఆరోపించాడు. వివాహం జరిగినప్పటి నుంచి మానసికంగా వేధింపులకు గురి చేశాడని రాధా గాయత్రి తండ్రి వివరించాడు. శ్రీచరణ్ గురించి అనేక పర్యాయాలు తమకు చెప్పిందని రాధా గాయత్రి తండ్రి వాపోతున్నారు. రాధా గాయత్రి కి లోబీపీ సమస్య లేదని.. ఈ దారుణం జరిగిన రోజు శ్రీ చరణ్ రక్త నమూనాలు సేకరించకపోవడం పట్ల రాధా గాయత్రి తండ్రి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రాధా గాయత్రి కి మద్యం తాగే అలవాటు లేదని.. తన కూతురు అలాంటిది కాదని ఆయన చెబుతున్నారు.

ఆధార్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. ఆరు నెలలు ఇవి ఫ్రీ..

Aadhaar Card Latest Benefits
Aadhaar Card Latest Benefits

Aadhaar Card Latest Benefits: ప్రస్తుత రోజుల్లో ఆధార్ కార్డ్ చాలా ఇంపార్టెంట్. ఏ పని కోసమైనా దీనిని ఉపయోగించాల్సిందే. అయితే ఈ ఆధార్ కార్డును ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవాలని అనుకునేవారికి భారతీయ ప్రత్యేక గుర్తింపు ప్రాధికార సంస్థ (Unique Identification Authority of India (UIDAI)) శుభవార్త తెలిపింది. అదేంటో చూద్దాం..

ఆధార్‌లో కొన్ని విషయాలను మార్చుకోవాలంటే సెంటర్ కు వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఈమెయిల్ చిరునామాను అప్‌డేట్ చేసుకునేందుకు ప్రస్తుతం వసూలు చేస్తున్నారు. రూ.75 సేవా రుసుమును 6 నెలలపాటు పూర్తిగా మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా కోట్లాది ఆధార్ హోల్డర్లకు ప్రయోజనం కలగనుంది. ప్రస్తుతం ఆధార్ మొబైల్ యాప్ ద్వారా ఈమెయిల్ ఐడీని జోడించాలన్నా, మార్చాలన్నా వినియోగదారులు రూ.75 చెల్లించాల్సి వస్తోంది. అయితే UIDAI తాజా నిర్ణయం ప్రకారం వచ్చే నెల 1వ తేదీ నుంలటచి డిసెంబర్ 31 వరకు ఈ సేవను పూర్తిగా ఉచితంగా అందించనుంది. దీంతో ఆధార్ వివరాలను సులభంగా నవీకరించుకునే అవకాశం లభిస్తుంది.

అయితే ఈ ఉచిత సేవ కేవలం ఆధార్ మొబైల్ యాప్ ద్వారా చేసే అప్‌డేట్లకే వర్తిస్తుందని UIDAI స్పష్టం చేసింది. ఆధార్ సేవా కేంద్రాలు లేదా ఇతర ఆఫ్‌లైన్ విధానాల ద్వారా ఈమెయిల్ అప్‌డేట్ చేయించుకుంటే సాధారణ ఛార్జీలు కొనసాగుతాయి. అందువల్ల వినియోగదారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

ఆధార్‌తో ఈమెయిల్ చిరునామా లింక్ చేసి ఉంచడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఆధార్‌కు సంబంధించిన ముఖ్యమైన నోటిఫికేషన్లు, అప్‌డేట్‌ల సమాచారం, ధృవీకరణ సందేశాలు నేరుగా ఈమెయిల్‌కు చేరుతాయి. దీంతో ఆధార్ ఖాతా భద్రత కూడా మెరుగుపడుతుంది. ముఖ్యంగా మొబైల్ నంబర్ మారిన సందర్భాల్లో కూడా ఈమెయిల్ ద్వారా సమాచారం అందుకునే అవకాశం ఉంటుంది.

డిజిటల్ సేవలను మరింత ప్రోత్సహించడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశమని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ మంది వినియోగదారులు తమ ఆధార్ వివరాలను సకాలంలో అప్‌డేట్ చేసుకునేలా చేయడంతో పాటు, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల వినియోగాన్ని పెంచేందుకు UIDAI ఈ ప్రత్యేక సడలింపును తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.

ఆధార్‌లో ఇప్పటికీ ఈమెయిల్ చిరునామా నమోదు చేయని వారు లేదా పాత ఈమెయిల్ ఉపయోగిస్తున్న వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు. డిసెంబర్ 31 వరకు ఉచితంగా ఈమెయిల్ అప్‌డేట్ చేసుకునే అవకాశం ఉండటంతో వినియోగదారులు ముందుగానే తమ వివరాలను ధృవీకరించుకోవాలని సూచిస్తున్నారు.

అనిల్ రావిపూడి రాయలసీమ యాస నేర్చుకోవాల్సిందేనా..?

Anil Ravipudi Rayalaseema Dialect
Anil Ravipudi Rayalaseema Dialect

Anil Ravipudi Rayalaseema Dialect: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. చాలామంది స్టార్ హీరోలు వైవిద్య భరితమైన కథాంశాలతో సినిమాలను చేస్తూ ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ ను సంపాదిస్తున్నారు. కొంతమంది దర్శకులు వరుస సక్సెస్ లను తమ ఖాతాలో వేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నారు. ఇక అని రావిపూడి లాంటి దర్శకుడు ఇప్పటివరకు చేసిన 9 సినిమాలు కూడా సూపర్ సక్సెస్ లను సాధించడం విశేషం…తన తోటి దర్శకులందరు కొంతవరకు డీలాపడుతుంటే అనిల్ రావిపూడి ఇప్పుడు మాత్రం అసలు ఎక్కడ తగ్గడం లేదు. ప్రతి సినిమా విషయంలో తను చాలా క్యాలిక్యులేటెడ్ గా ముందుకు సాగుతున్నాడు. సక్సెస్ లను సాధించడమే తన ఎజెండాగా పెట్టుకొని ముందుకు దూసుకెళ్తుండడం విశేషం…

ఇక ఇప్పటివరకు అనిల్ రావిపూడి ఇప్పటి వరకు సాధించిన విజయాలు, ఇప్పుడు సాధించబోతున్న సక్సెస్ లు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. ప్రస్తుతం వెంకటేష్ – కళ్యాణ్ రామ్ లను హీరోలుగా పెట్టి ఆయన చేస్తున్న సినిమా రాయలసీమ యాసలో ఉండబోతుంది. అయితే దానికోసం ఆయన సెపరేట్ గా రాయలసీమ యాస ను కూడా నేర్చుకుంటున్నట్టుగా తెలుస్తుంది.

తనతో పాటు తన హీరోలకు కూడా ఆ యాస నేర్పించే ప్రయత్నం చేస్తున్నాడు. తను అనుకున్నట్టుగానే యాసలో పర్ఫెక్ట్ డైలాగులను చెప్పించగలుగుతాడా? లేదా అనేది ఇప్పుడు పెద్ద టాస్క్ గా మారబోతుంది. ఇంతకుముందు అనిల్ రావిపూడి చేసిన సినిమాల్లో తెలంగాణ, ఆంధ్ర స్లాంగ్ లో కనిపించడం మనం చూస్తూనే వచ్చాం…

కానీ ఫస్ట్ టైం రాయలసీమ స్లాంగ్ లో ఆయన సినిమాలు చేస్తుండడం విశేషం… ఇప్పటివరకు మన హీరోలందరు వివిధ స్లాంగ్ లో మాట్లాడుతూ ప్రేక్షకులను వాళ్ళ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు… ఒక హీరో ఒక స్లాంగ్ లో మాట్లాడితే అక్కడి ప్రజలందరూ వాళ్ళము ఓన్ చేసుకుంటారు. అందుకే యాస లకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది… ఇక ఇప్పుడు వెంకటేష్ – కళ్యాణ్ రామ్ లు రాయలసీమ యాస లో ఎలా మెప్పిస్తారు అనేది తెలియాల్సి ఉంది…

ఉద్యోగులకు కష్టకాలం.. మనుషుల ప్లేసులో రోబోలు.. మరో విపత్తు తప్పదా

AI Replacing Human Jobs
AI Replacing Human Jobs

AI Replacing Human Jobs: అప్పట్లో శంకర్ తీసిన రోబో సినిమాలో హ్యూమానాయిడ్ రోబో.. మనుషుల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని చూపించారు. అప్పట్లో దీనిని చాలామంది తేలికగా తీసుకున్నారు. పైగా రోబో మనిషి జీవితంతో ఆటలాడుకోవడం ఏంటని అందరూ భావించారు. కానీ తర్వాత కాలంలో రోబోలు మనిషి జీవితంలో ముఖ్యమైన పాత్ర మాత్రమే కాదు.. మనిషి జీవితాలనే ప్రభావితం చేసే స్థాయికి ఎదిగిపోయాయి.

రోబోలు జీవితాలనే కాదు.. మనుషులకు జీవితమే లేకుండా చేస్తున్నాయి. కంపెనీలు మ్యాన్ పవర్ తగ్గిస్తున్నాయి. లాభాల కోసం యంత్రాలతో పని చేయించుకుంటున్నాయి. ఇప్పటివరకు ఇది ఐటీ ఫీల్డ్ వరకే అనుకునేవారు. కానీ ఇప్పుడు అంతకుమించి అనే స్థాయికి రోబోలు ఎదిగిపోయాయి. అసలు యంత్రాలు బ్లూ కాలర్ ఫీల్డ్ లోకి రావు అనుకుంటున్న క్రమంలో.. అవి దర్జాగా వచ్చేశాయి. దానికి సంబంధించిన పరిణామం అమెరికాలో జరిగిపోయింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా ఆటోమేషన్.. రోబోలతో పని చేయించుకుంటున్న విధానం చర్చకు దారితీస్తున్నాయి.

అమెరికాలో అతిపెద్ద ఆటోమొబైల్ కంపెనీ అయిన జనరల్ మోటార్స్ దాదాపు 1000 మందికి పైగా ఉద్యోగులను తొలగించింది. ఆర్థిక సంక్షోభం వల్ల ఇలా చేసింది అనుకుంటే పొరపాటే.. ఆ కంపెనీ భారీగా మిగులుబాటు చేసుకోవడానికి.. యంత్రాలతో పనులు చేయించుకోవడానికి సిద్ధమైంది. అందువల్లే వెయ్యి మంది ఉద్యోగులను ఒకేసారి తొలగించింది. ఆ ఉద్యోగుల స్థానంలో 50 రోబోలను భర్తీ చేసింది. వెహికల్ అసెంబ్లింగ్ యూనిట్ లో మిగతా సిబ్బందితో కలిసి ఈ రోబోలు పనిచేస్తాయి.. ఈ పరిణామం మేధావులు ఊహించినట్టుగానే జరుగుతోంది. అయితే అక్కడి ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మా ఉద్యోగాలు మాకు కావాలంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇదే కనుక కొనసాగితే భవిష్యత్తు కాలంలో మనుషులకు ఉద్యోగాలు ఉండవని.. కేవలం యంత్రాలు మాత్రమే పనిచేస్తాయని.. ఉపాధి లేకపోవడంతో మనుషులంతా దిక్కులేని చావు చస్తారని జనరల్ మోటార్స్ సంస్థ తొలగించిన ఉద్యోగులు అంటున్నారు.

జనరల్ మోటార్స్ గతంలో ఆర్థిక సంక్షోభం బారిన పడినప్పుడు ఇదే స్థాయిలో ఉద్యోగులను తొలగించింది. ఆ తర్వాత మార్కెట్లో పరిస్థితి మారిపోయిన తర్వాత మళ్లీ కొత్తగా ఉద్యోగులను నియమించుకుంది. ఇప్పుడు ఆ కంపెనీ బ్యాలెన్స్ షీట్ బ్రహ్మాండంగా ఉంది. పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండానే సాగిపోతోంది. ఊహించని విధంగా బ్లూ కాలర్ విభాగంలోకి రోబోలను ప్రవేశపెట్టి ఉద్యోగులను మెడ మీద కత్తి పెట్టింది. అంతేకాదు 1000 మందికి ఉద్వాసన పలికింది. దీనివల్ల జనరల్ మోటార్స్ సంస్థకు ఎంత మిగులుతాయో తెలియదు గానీ.. వెయ్యి మంది ఉద్యోగుల కుటుంబాలు మాత్రం రోడ్డు మీద పడ్డాయి. టెక్నాలజీ మనిషి జీవితాన్ని సుఖవంతం చేస్తుంది అనుకుంటే.. చివరికి మనిషికే జీవితం లేకుండా చేసేసింది.

సముద్ర బలంపై మోదీ దృష్టి.. పాకిస్థాన్‌ కుట్రలకు చెక్‌

Modi Maritime Security Strategy
Modi Maritime Security Strategy

Modi Maritime Security Strategy: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ అభివృద్ధి, భద్రత, ఆర్థిక ప్రగతి అన్నీ సముద్రాలతో ముడిపడి ఉన్నాయని స్పష్టం చేశారు. సముద్రాలపై బలమైన నైపుణ్యం లేకుండా ఏ దేశం కూడా ప్రపంచ స్థాయి శక్తిగా ఎదగలేదని ఆయన అభిప్రాయపడ్డారు. బలమైన సముద్ర సామర్థ్యాలు ఉన్న దేశాలు ఆర్థికంగా, వ్యూహాత్మకంగా మరింత శక్తివంతంగా మారతాయని ఆయన వివరించారు.

కోల్‌కతాలో మూడు స్వదేశీ నౌకలు..
కోల్‌కతాలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ మూడు అధునాతన స్వదేశీ నిర్మాణ నౌకలను అధికారికంగా నౌకాదళంలో చేర్చారు. ఈ నౌకలు రక్షణ రంగంలో ఆత్మనిర్భరతను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

కొత్త నౌకల విశేషాలు..
ఐఎన్‌ఎస్‌ దునగిరి శత్రు రాడార్లను తప్పించుకుని దాడి చేయగల స్టెల్త్‌ ఫ్రిగేట్‌. ఐఎన్‌ఎస్‌ సంశోధక్‌ సముద్ర మార్గాలను వివరంగా పరిశీలించే సర్వే నౌక. ఐఎన్‌ఎస్‌ అగ్రే జలాంతర్గాములను ఎదుర్కొనేందుకు రూపొందించిన యాంటీ–సబ్‌మెరైన్‌ వార్‌ఫేర్‌ నౌక. ఈ మూడు నౌకలు నావికాదళానికి యుద్ధ సామర్థ్యం, సర్వే సామర్థ్యం, జలాంతర్గామి వ్యతిరేక కార్యకలాపాలలో గణనీయమైన మెరుగుదలను అందిస్తాయి.

రక్షణ రంగంలో స్వావలంబన లక్ష్యంభారత్‌ కేవలం ఆయుధాలు కొనుగోలు చేసే దేశంగా మిగిలిపోకూడదని ప్రధాని నొక్కి చెప్పారు. ప్రపంచ దేశాలకు భారత సాయుధ దళాలు కేవలం వాణిజ్య మార్కెట్‌గా మారకూడదని కూడా ఆయన హెచ్చరించారు. స్వదేశీ సాంకేతికతతో తయారైన ఈ నౌకలు ఆ దిశగా ముఖ్యమైన అడుగు అని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఈ చర్యలు ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్తాన్‌ వైపు నుంచి వచ్చే కుట్రలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సరైన సమయంలో సరైన వ్యూహాత్మక స్పందనగా చూడవచ్చు.

యుద్ధంలో ఇరాన్‌ గెలిచింది.. 92 శాతం ఇజ్రాయెలీల మాట ఇదే!

Iran Israel War Analysis
Iran Israel War Analysis

Iran Israel War Analysis: ఇరాన్‌–అమెరికా, ఇజ్రాయెల్‌ మధ్య జరిగిన యుద్ధం ముగిసింది. శాంతి ఒప్పందం తుది దశకు చేరుకుంటోంది. స్విట్జర్లాండ్‌ వేదికగా జరిగిన చర్చలు కొలిక్కి వస్తున్నాయి. ఈ తరుణంలో ఇరాన్‌–అమెరికా, ఇజ్రాయెల్‌ వైపుల నుంచి వచ్చిన వ్యాఖ్యలు పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయి. ఇజ్రాయెల్‌లోని ప్రజల్లో ఎక్కువ మంది యుద్ధంలో ఇరాన్‌ గెలిచిందని భావిస్తుండగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మాత్రం ఇరాన్‌కు తీవ్ర నష్టం జరిగిందని, అమెరికా లేదా ఇజ్రాయెల్‌కు ఎలాంటి నష్టం లేదని వాదిస్తున్నారు. ఈ వ్యతిరేక అభిప్రాయాలు యుద్ధం ఫలితాలపై ఎంత భిన్నమైన అవగాహనలు ఉన్నాయో చెబుతున్నాయి.

ఇజ్రాయెల్‌లో సర్వే ఫలితాలు..
జెరూసలెంలోని హెబ్రూ యూనివర్సిటీ, అగమ్‌ ఇనిస్టిట్యూట్‌ నిర్వహించిన సర్వే ప్రకారం, 92 శాతం మంది ఇజ్రాయెలీలు యుద్ధంలో ఇరాన్‌ ఎక్కువ లాభపడిందని అభిప్రాయపడ్డారు. యుద్ధం తర్వాత ఇజ్రాయెల్‌ భద్రతా వ్యవస్థ బలహీనపడిందని 82.9 శాతం మంది అభిప్రాయపడ్డారు. అలాగే, యుద్ధం ముగింపుకు సంబంధించిన డీల్‌ను 63 శాతం మంది వ్యతిరేకించారు. ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు మాటలపై 73 శాతం మంది నమ్మకం లేదని తెలిపారు. జూన్‌ 17 నుంచి 20 వరకు 3,644 మందిపై జరిగిన ఈ సర్వే ఇజ్రాయెల్‌ ప్రజల్లో యుద్ధం ఫలితంపై తీవ్ర అసంతృప్తి, నిరాశను స్పష్టంగా చూపిస్తోంది.

ఇరాన్‌కు తీవ్ర నష్టం..
మరోవైపు, డొనాల్డ్‌ ట్రంప్‌ యుద్ధంలో అమెరికా లేదా ఇజ్రాయెల్‌ నష్టపోలేదని గట్టిగా వాదించారు. ఇరాన్‌ సైన్యం, నేవీ, ఎయిర్‌ఫోర్స్, లాంచింగ్‌ ప్యాడ్లు, మిసైల్స్, డ్రోన్లు దాదాపు పూర్తిగా నాశనం అయ్యాయని, వారి టాప్‌–2 లీడర్లు హతమయ్యారని పేర్కొన్నారు. ఇరాన్‌లో ద్రవ్యోల్బణం 250 శాతానికి చేరిందని, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని, హార్ముజ్‌ జలసంధి తెరవడంతో భారీగా ఆయిల్‌ సరఫరా జరుగుతోందని, అమెరికా మార్కెట్లు లాభాల్లో ఉన్నాయని ట్రంప్‌ పోస్ట్‌లో వివరించారు. యుద్ధం తర్వాత నాలుగు నెలల్లో ఏమి మారిందని ప్రశ్నిస్తూ, ఇరాన్‌కు భారీ నష్టం జరిగిందని ఆయన వాదన.

ఇజ్రాయెల్‌ ప్రజలు యుద్ధం ఫలితాన్ని ఓటమిగా చూస్తుండగా, ట్రంప్‌ మాత్రం విజయంగా చిత్రీకరిస్తున్నారు. ఇది రెండు వేర్వేరు కోణాలను సూచిస్తోంది. ఇజ్రాయెల్‌ ప్రజల్లో భద్రతా ఆందోళన, నెతన్యాహు నాయకత్వంపై అవిశ్వాసం బలంగా ఉంది. యుద్ధం తర్వాత భద్రత వీక్‌ అయిందని చెప్పడం ద్వారా, భవిష్యత్తులో మరిన్ని ముప్పులు ఎదురవుతాయని వారు భయపడుతున్నట్లు అర్థమవుతోంది. మరోవైపు, ట్రంప్‌ వాదనలు సైనిక, ఆర్థిక నష్టాలను హైలైట్‌ చేస్తూ, యుద్ధం ఉద్దేశం సాధించబడిందని చెబుతున్నాయి. అయితే, ఇజ్రాయెల్‌ ప్రజల అభిప్రాయాలు ఈ వాదనలను పూర్తిగా తిరస్కరిస్తున్నాయి.

అల్లు అర్జున్ కి బ్లాక్ బస్టర్ హిట్ పడితే ఎన్ని వందల కోట్లు వసూలు చేయగలడు..

Allu Arjun Movie Collections Analysis
Allu Arjun Movie Collections Analysis

Allu Arjun Movie Collections Analysis: ప్రస్తుతం ఇండియాలో ఉన్న స్టార్ హీరోలు ఒక్కొక్కరు ఒక్కో స్ట్రాటజీ ని మైంటైన్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. కొంతమంది డిఫరెంట్ సబ్జెక్టులను సినిమాలుగా చేస్తూ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగుతుంటే మరి కొంతమంది మాత్రం మంచి సినిమాలను చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే వాళ్ల నుంచి వచ్చే సినిమాల విషయంలో కూడా వాళ్ళు చాలావరకు కేర్ ఫుల్ గా వ్యవహరిస్తుండడం విశేషం… ఇక అల్లు అర్జున్ లాంటి నటుడు సైతం పెను సంచలనాలను క్రియేట్ చేస్తున్నాడు. గతంలో పుష్ప సినిమాతో పెను ప్రభంజనాన్ని క్రియేట్ చేసిన ఆయన ఇప్పుడు మరోసారి ‘రాకా’ సినిమాతో ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేయాలని చూస్తున్నాడు. నిజానికి అల్లు అర్జున్ కి ఒక సాలిడ్ సక్సెస్ పడితే మాత్రం అది 2000 కోట్లకు పైన కలెక్షన్స్ ని రాబడుతుందనే అంచనాలో మేకర్స్ అయితే ఉన్నారు.

‘పుష్ప 2’ సినిమా 1850 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబట్టింది. అదే రేంజ్ లో అంతే ఇంటెన్స్ తో ఒక సినిమా కనుక వచ్చినట్లయితే మాత్రం ఆ మూవీ భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ గా నిలుస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక దానికి తోడుగా 2000 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబట్టడం అంటే మామూలు విషయం కాదు.

ఇక ఇప్పుడు మరోసారి ఆ రెంజ్ సక్సెస్ అతనికి దక్కుతుందా?లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఇప్పటికే ఇండస్ట్రీలో ఉన్న టైర్ వన్ హీరోల మధ్య తీవ్రమైన పోటీ ఉంది. ఈరోజు ఎవరు టాప్ పొజిషన్ కి వెళ్తారు.?

ఎవరు ఏ రోజు డౌన్ ఫాల్ అవుతారు అనేది చెప్పడం చాలా కష్టమవుతుంది. ఒక్క సక్సెస్ తో టాప్ పొజిషన్ కి వెళ్ళినవాళ్ళు ఓకే ఫ్లాప్ తో పాతాళానికి పడిపోతున్నారు. కాబట్టి వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని హీరోలు వాళ్ళు చేసే సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తే మంచిదని మరికొంతమంది సినిమా మేధావులు సైతం భావిస్తున్నారు…

ఎన్టీఆర్ ఆ సినిమాలో మహేష్ బాబు స్టైల్ ను కాపీ చేశాడా..? అందుకే ఆ మూవీ ప్లాప్ అయిందా..?

NTR copy Mahesh Babu Style
NTR copy Mahesh Babu Style

NTR copy Mahesh Babu Style: సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోల మధ్య తీవ్రమైన పోటీ ఉంటుంది. పర్సనల్ విషయాల్లో వాళ్ళు ఫ్రెండ్స్ అయినప్పటికి సినిమాల విషయంలో మాత్రం ఎప్పటికప్పుడు పోటీ పడుతూనే ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఒక హీరో ఒక సినిమా చేస్తే అలాంటి సినిమాని మరొక హీరో చేసి సూపర్ సక్సెస్ ను సాధించాలని చూస్తూ ఉంటాడు. కొన్ని సందర్భాల్లో అయితే ఇతర హీరోల స్టైల్స్ ని కూడా కొంతమంది హీరోలు కాపీ కొడుతుంటారు. మహేష్ బాబు పోకిరి సినిమా ఎప్పుడైతే చేశాడో అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సైతం మహేష్ బాబు స్టైల్ ను కాపీ చేసి ‘కంత్రి’ అనే సినిమా చేశాడు. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ డెలివరీ మొత్తం మహేష్ బాబు లాగానే ఉంటుంది. కానీ ఈ సినిమా అనుకున్న మేరకు సక్సెస్ ని సాధించకపోవడంతో జూనియర్ ఎన్టీఆర్ భారీగా డీలాపడ్డాడు. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో తనకంటూ ఒక ఐడెంటిటిని తెచ్చుకుంటానని అనుకున్నప్పటికి ఎన్టీఆర్ ఏ రకంగానూ ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు…

మంచి నటుడు అయినప్పటికి అవతలి వాళ్ళని ఇమిటేట్ చేయడం వల్ల ఆయన తన నటనలోని సహజత్వాన్ని కోల్పోయాడు అనే విమర్శలు కూడా వచ్చాయి. ప్రస్తుతం ఆయన ‘డ్రాగన్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో మరోసారి పెను సంచలనాన్ని క్రియేట్ చేయాలని చూస్తున్నాడు…

ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో భారీ విజయాన్ని సాధిస్తే జూనియర్ ఎన్టీఆర్ మరోసారి టాప్ హీరోగా మారతాడు లేకపోతే మాత్రం చాలా వరకు డీలా పడిపోయే ప్రమాదమైతే ఉంది… ఇక ఏది ఏమైనా కూడా జూనియర్ ఎన్టీఆర్ లాంటి నటుడు రాబోయే రోజుల్లో పెను సంచలనాలను క్రియేట్ చేసే సినిమాలను చేయాలి.

లేకపోతే మాత్రం ఇప్పటికే తన తోటి హీరోలందరు అతన్ని బీట్ చేసి ముందుకు దూసుకెళ్తున్నారు. కాబట్టి వాళ్లను అందుకోవడం చాలా కష్టతరమవుతుంది… ఇక ఈ మూవీ తరువాత త్రివిక్రమ్ డైరెక్షన్ లో చేయబోయే సినిమా విషయంలో కూడా ఆయన స్పెషల్ కేర్ తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది…