Homeజాతీయ వార్తలుModi Maritime Security Strategy: సముద్ర బలంపై మోదీ దృష్టి.. పాకిస్థాన్‌ కుట్రలకు చెక్‌

Modi Maritime Security Strategy: సముద్ర బలంపై మోదీ దృష్టి.. పాకిస్థాన్‌ కుట్రలకు చెక్‌

Modi Maritime Security Strategy: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ అభివృద్ధి, భద్రత, ఆర్థిక ప్రగతి అన్నీ సముద్రాలతో ముడిపడి ఉన్నాయని స్పష్టం చేశారు. సముద్రాలపై బలమైన నైపుణ్యం లేకుండా ఏ దేశం కూడా ప్రపంచ స్థాయి శక్తిగా ఎదగలేదని ఆయన అభిప్రాయపడ్డారు. బలమైన సముద్ర సామర్థ్యాలు ఉన్న దేశాలు ఆర్థికంగా, వ్యూహాత్మకంగా మరింత శక్తివంతంగా మారతాయని ఆయన వివరించారు. కోల్‌కతాలో మూడు స్వదేశీ నౌకలు.. కోల్‌కతాలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ మూడు అధునాతన […]

Modi Maritime Security Strategy: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ అభివృద్ధి, భద్రత, ఆర్థిక ప్రగతి అన్నీ సముద్రాలతో ముడిపడి ఉన్నాయని స్పష్టం చేశారు. సముద్రాలపై బలమైన నైపుణ్యం లేకుండా ఏ దేశం కూడా ప్రపంచ స్థాయి శక్తిగా ఎదగలేదని ఆయన అభిప్రాయపడ్డారు. బలమైన సముద్ర సామర్థ్యాలు ఉన్న దేశాలు ఆర్థికంగా, వ్యూహాత్మకంగా మరింత శక్తివంతంగా మారతాయని ఆయన వివరించారు.

కోల్‌కతాలో మూడు స్వదేశీ నౌకలు..
కోల్‌కతాలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ మూడు అధునాతన స్వదేశీ నిర్మాణ నౌకలను అధికారికంగా నౌకాదళంలో చేర్చారు. ఈ నౌకలు రక్షణ రంగంలో ఆత్మనిర్భరతను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

కొత్త నౌకల విశేషాలు..
ఐఎన్‌ఎస్‌ దునగిరి శత్రు రాడార్లను తప్పించుకుని దాడి చేయగల స్టెల్త్‌ ఫ్రిగేట్‌. ఐఎన్‌ఎస్‌ సంశోధక్‌ సముద్ర మార్గాలను వివరంగా పరిశీలించే సర్వే నౌక. ఐఎన్‌ఎస్‌ అగ్రే జలాంతర్గాములను ఎదుర్కొనేందుకు రూపొందించిన యాంటీ–సబ్‌మెరైన్‌ వార్‌ఫేర్‌ నౌక. ఈ మూడు నౌకలు నావికాదళానికి యుద్ధ సామర్థ్యం, సర్వే సామర్థ్యం, జలాంతర్గామి వ్యతిరేక కార్యకలాపాలలో గణనీయమైన మెరుగుదలను అందిస్తాయి.

రక్షణ రంగంలో స్వావలంబన లక్ష్యంభారత్‌ కేవలం ఆయుధాలు కొనుగోలు చేసే దేశంగా మిగిలిపోకూడదని ప్రధాని నొక్కి చెప్పారు. ప్రపంచ దేశాలకు భారత సాయుధ దళాలు కేవలం వాణిజ్య మార్కెట్‌గా మారకూడదని కూడా ఆయన హెచ్చరించారు. స్వదేశీ సాంకేతికతతో తయారైన ఈ నౌకలు ఆ దిశగా ముఖ్యమైన అడుగు అని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఈ చర్యలు ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్తాన్‌ వైపు నుంచి వచ్చే కుట్రలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సరైన సమయంలో సరైన వ్యూహాత్మక స్పందనగా చూడవచ్చు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper