Homeఅంతర్జాతీయంKeir Starmer resigns: పదవి నుంచి తప్పుకున్న కీర్ స్టార్మర్.. కారణమేంటి.. బ్రిటన్ లో ప్రధాన...

Keir Starmer resigns: పదవి నుంచి తప్పుకున్న కీర్ స్టార్మర్.. కారణమేంటి.. బ్రిటన్ లో ప్రధాన మంత్రులకు ఏమాత్రం విలువ లేదా..

Keir Starmer resigns: మనదేశంలో ఒక వార్డుకు కార్పొరేటర్ అయితేనే.. పెద్ద హంగామా ఉంటుంది. ఫార్చునర్ కారు.. చుట్టూ మందీ మార్బలం.. అనుచరులు.. ఆ లెవెల్ వేరే రేంజ్ లో ఉంటుంది. అటువంటిది ఒక దేశానికి ప్రధానమంత్రి అయితే.. చెప్పడానికి ఏముంది.. చుట్టూ కాపలా కాసే పోలీసులు.. అధికారులు.. వాహనశ్రేణి.. సెక్యూరిటీ.. ఆ లెవలే ఒక లెవెల్ లో ఉంటుంది. ప్రధానమంత్రి గురించి ఈ రేంజ్ లో చెప్పాం కదా.. కానీ ఆదేశంలో పెద్దగా విలువ ఉండదు. […]

Keir Starmer resigns: మనదేశంలో ఒక వార్డుకు కార్పొరేటర్ అయితేనే.. పెద్ద హంగామా ఉంటుంది. ఫార్చునర్ కారు.. చుట్టూ మందీ మార్బలం.. అనుచరులు.. ఆ లెవెల్ వేరే రేంజ్ లో ఉంటుంది. అటువంటిది ఒక దేశానికి ప్రధానమంత్రి అయితే.. చెప్పడానికి ఏముంది.. చుట్టూ కాపలా కాసే పోలీసులు.. అధికారులు.. వాహనశ్రేణి.. సెక్యూరిటీ.. ఆ లెవలే ఒక లెవెల్ లో ఉంటుంది. ప్రధానమంత్రి గురించి ఈ రేంజ్ లో చెప్పాం కదా.. కానీ ఆదేశంలో పెద్దగా విలువ ఉండదు. అందువల్లే ఆ పదవిలో ఉన్న వారు రాజీనామా చేస్తూ ఉంటారు. ఇంతకీ ఏమా దేశం.. ఇక్కడ ఆ కథ అంటే..

మన దేశాన్ని 200 సంవత్సరాలు పాటు పరిపాలించిన బ్రిటన్ దేశంలో రాజకీయ అస్థిరత కొనసాగుతోంది. ఆ దేశానికి సంబంధించిన ప్రధానమంత్రి చీఫ్ స్టార్మర్ ఊహించని విధంగా తన పదవికి రాజీనామా చేశారు. అంతేకాదు వెళ్తూ వెళ్తూ ఆయన సంచలన ఆరోపణలు చేశారు. కొంతకాలంగా స్టార్మర్ బ్రిటన్ ప్రధానమంత్రిగా కొనసాగుతున్నారు. అక్కడ ఆయన అనేక రకాల నిర్ణయాలు తీసుకున్నారు. ఇవన్నీ కూడా బ్రిటన్ చరిత్రలోనే విప్లవత్మకంగా మారిపోయాయి. అంతా సాఫీగానే జరుగుతోంది అనుకుంటున్న క్రమంలో.. స్టార్మర్ తన పదవికి రాజీనామా చేశారు.

స్టార్మర్ తన పదవికి రాజీనామా చేయడానికి లేబర్ పార్టీ ఒత్తిడి కారణమని బ్రిటన్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆయన పదవిలో ఉన్నంతకాలం విలువలు కొనసాగించారని.. బ్రిటన్ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించారని అక్కడి మీడియా ప్రసారం చేసిన కథనాల ద్వారా తెలుస్తోంది. స్టార్ మార్ 2024లో బ్రిటన్ దేశానికి ప్రధాన మంత్రిగా పనిచేయడం మొదలుపెట్టారు. ఇటీవల ఎన్నికల్లో లేబర్ పార్టీ దారుణమైన ఫలితాలను చవి చూసింది. మేకర్ ఫీల్డ్ పార్లమెంటరీ ఎన్నికల్లో బర్న్ హామ్ అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. దీంతో స్టార్మర్ మీద ఒత్తిడి పెరిగిపోయింది. దీనికి తోడు ఇటీవల ఎఫ్ స్టీన్ వ్యవహారం వెలుగులోకి రావడం.. అందులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తన స్నేహితుడు పీటర్ మాండిల్సన్ ను అమెరికా రాయబారిగా నియమించాలని స్టార్మర్ నిర్ణయించారు.

స్టార్మర్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అయింది. దీంతో ఆయన పదవికి ముప్పు వాటిల్లింది. ఒత్తిడి కూడా పెరిగిపోవడంతో పదవి నుంచి తప్పుకున్నారు. ఇటీవల ఆయన పరిపాలన గురించి రకరకాల వార్తలు రావడంతో ఖండించారు. కానీ చివరికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. సరిగ్గా ఆదివారం ట్రంప్ స్టార్మర్ రాజీనామా గురించి ప్రస్తావించారు. ట్రంప్ చెప్పిన కొద్ది గంటల్లోనే స్టార్మర్ రాజీనామా చేయడం విశేషం.

బ్రిటన్ దేశంలో గడిచిన 10 సంవత్సరాల కాలంలో పదవులకు రాజీనామా చేసిన ప్రధాన మంత్రుల సంఖ్య ఏకంగా ఆరుకు పెరిగింది. దీన్ని బట్టి అక్కడ ప్రధానమంత్రి పదవికి పెద్దగా విలువలేదని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. పదవిలో చేరిన వారు ఎక్కువ కాలం ఉండకపోవడం వల్ల అంతర్జాతీయ మీడియా రకరకాలుగా కథనాలను ప్రసారం చేస్తోంది. గ్రేట్ బ్రిటన్ లో ఇటువంటి పరిపాలన రాహిత్యం కొనసాగడం బాధాకరమని వ్యాఖ్యానిస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper