Homeఅంతర్జాతీయంAI Replacing Human Jobs: ఉద్యోగులకు కష్టకాలం.. మనుషుల ప్లేసులో రోబోలు.. మరో విపత్తు తప్పదా

AI Replacing Human Jobs: ఉద్యోగులకు కష్టకాలం.. మనుషుల ప్లేసులో రోబోలు.. మరో విపత్తు తప్పదా

AI Replacing Human Jobs: అప్పట్లో శంకర్ తీసిన రోబో సినిమాలో హ్యూమానాయిడ్ రోబో.. మనుషుల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని చూపించారు. అప్పట్లో దీనిని చాలామంది తేలికగా తీసుకున్నారు. పైగా రోబో మనిషి జీవితంతో ఆటలాడుకోవడం ఏంటని అందరూ భావించారు. కానీ తర్వాత కాలంలో రోబోలు మనిషి జీవితంలో ముఖ్యమైన పాత్ర మాత్రమే కాదు.. మనిషి జీవితాలనే ప్రభావితం చేసే స్థాయికి ఎదిగిపోయాయి. రోబోలు జీవితాలనే కాదు.. మనుషులకు జీవితమే లేకుండా చేస్తున్నాయి. కంపెనీలు మ్యాన్ […]

AI Replacing Human Jobs: అప్పట్లో శంకర్ తీసిన రోబో సినిమాలో హ్యూమానాయిడ్ రోబో.. మనుషుల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని చూపించారు. అప్పట్లో దీనిని చాలామంది తేలికగా తీసుకున్నారు. పైగా రోబో మనిషి జీవితంతో ఆటలాడుకోవడం ఏంటని అందరూ భావించారు. కానీ తర్వాత కాలంలో రోబోలు మనిషి జీవితంలో ముఖ్యమైన పాత్ర మాత్రమే కాదు.. మనిషి జీవితాలనే ప్రభావితం చేసే స్థాయికి ఎదిగిపోయాయి.

రోబోలు జీవితాలనే కాదు.. మనుషులకు జీవితమే లేకుండా చేస్తున్నాయి. కంపెనీలు మ్యాన్ పవర్ తగ్గిస్తున్నాయి. లాభాల కోసం యంత్రాలతో పని చేయించుకుంటున్నాయి. ఇప్పటివరకు ఇది ఐటీ ఫీల్డ్ వరకే అనుకునేవారు. కానీ ఇప్పుడు అంతకుమించి అనే స్థాయికి రోబోలు ఎదిగిపోయాయి. అసలు యంత్రాలు బ్లూ కాలర్ ఫీల్డ్ లోకి రావు అనుకుంటున్న క్రమంలో.. అవి దర్జాగా వచ్చేశాయి. దానికి సంబంధించిన పరిణామం అమెరికాలో జరిగిపోయింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా ఆటోమేషన్.. రోబోలతో పని చేయించుకుంటున్న విధానం చర్చకు దారితీస్తున్నాయి.

అమెరికాలో అతిపెద్ద ఆటోమొబైల్ కంపెనీ అయిన జనరల్ మోటార్స్ దాదాపు 1000 మందికి పైగా ఉద్యోగులను తొలగించింది. ఆర్థిక సంక్షోభం వల్ల ఇలా చేసింది అనుకుంటే పొరపాటే.. ఆ కంపెనీ భారీగా మిగులుబాటు చేసుకోవడానికి.. యంత్రాలతో పనులు చేయించుకోవడానికి సిద్ధమైంది. అందువల్లే వెయ్యి మంది ఉద్యోగులను ఒకేసారి తొలగించింది. ఆ ఉద్యోగుల స్థానంలో 50 రోబోలను భర్తీ చేసింది. వెహికల్ అసెంబ్లింగ్ యూనిట్ లో మిగతా సిబ్బందితో కలిసి ఈ రోబోలు పనిచేస్తాయి.. ఈ పరిణామం మేధావులు ఊహించినట్టుగానే జరుగుతోంది. అయితే అక్కడి ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మా ఉద్యోగాలు మాకు కావాలంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇదే కనుక కొనసాగితే భవిష్యత్తు కాలంలో మనుషులకు ఉద్యోగాలు ఉండవని.. కేవలం యంత్రాలు మాత్రమే పనిచేస్తాయని.. ఉపాధి లేకపోవడంతో మనుషులంతా దిక్కులేని చావు చస్తారని జనరల్ మోటార్స్ సంస్థ తొలగించిన ఉద్యోగులు అంటున్నారు.

జనరల్ మోటార్స్ గతంలో ఆర్థిక సంక్షోభం బారిన పడినప్పుడు ఇదే స్థాయిలో ఉద్యోగులను తొలగించింది. ఆ తర్వాత మార్కెట్లో పరిస్థితి మారిపోయిన తర్వాత మళ్లీ కొత్తగా ఉద్యోగులను నియమించుకుంది. ఇప్పుడు ఆ కంపెనీ బ్యాలెన్స్ షీట్ బ్రహ్మాండంగా ఉంది. పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండానే సాగిపోతోంది. ఊహించని విధంగా బ్లూ కాలర్ విభాగంలోకి రోబోలను ప్రవేశపెట్టి ఉద్యోగులను మెడ మీద కత్తి పెట్టింది. అంతేకాదు 1000 మందికి ఉద్వాసన పలికింది. దీనివల్ల జనరల్ మోటార్స్ సంస్థకు ఎంత మిగులుతాయో తెలియదు గానీ.. వెయ్యి మంది ఉద్యోగుల కుటుంబాలు మాత్రం రోడ్డు మీద పడ్డాయి. టెక్నాలజీ మనిషి జీవితాన్ని సుఖవంతం చేస్తుంది అనుకుంటే.. చివరికి మనిషికే జీవితం లేకుండా చేసేసింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper