Homeబిజినెస్iPhone 18 Camera Leaks: ఐ ఫోన్ 18 కెమెరాపై షాకింగ్ న్యూస్.. ఇది ఎలా...

iPhone 18 Camera Leaks: ఐ ఫోన్ 18 కెమెరాపై షాకింగ్ న్యూస్.. ఇది ఎలా ఉందో తెలుసా..

iPhone 18 Camera Leaks: భారతదేశంలో ఐఫోన్ కు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో కొత్త సిరీస్ మార్కెట్లోకి వస్తుందంటే ముందు నుంచే క్యూ కడుతూ ఉంటారు. అయితే ఈ సెప్టెంబర్ లో 18 సిరీస్ ఫోన్ రాబోతుంది. దీని గురించి వస్తున్న లీక్‌లు, తాజా సమాచారం ప్రకారం.. ఈ ఫోన్ డిజైన్‌లో పెద్ద మార్పులేవీ ఉండకపోవచ్చు కానీ కెమెరా విభాగంలో మాత్రం భారీ అప్‌గ్రేడ్‌లు ఉండే అవకాశం ఉందని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఈ […]

iPhone 18 Camera Leaks: భారతదేశంలో ఐఫోన్ కు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో కొత్త సిరీస్ మార్కెట్లోకి వస్తుందంటే ముందు నుంచే క్యూ కడుతూ ఉంటారు. అయితే ఈ సెప్టెంబర్ లో 18 సిరీస్ ఫోన్ రాబోతుంది. దీని గురించి వస్తున్న లీక్‌లు, తాజా సమాచారం ప్రకారం.. ఈ ఫోన్ డిజైన్‌లో పెద్ద మార్పులేవీ ఉండకపోవచ్చు కానీ కెమెరా విభాగంలో మాత్రం భారీ అప్‌గ్రేడ్‌లు ఉండే అవకాశం ఉందని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఈ విషయంపై పూర్తి వివరాల్లోకి వెళితె..

ఐఫోన్ 18 ప్రో డిజైన్ పరంగా ఐఫోన్ 17 ప్రోకి చాలా దగ్గరగా ఉండే అవకాశం ఉంది. ఆపిల్ తన సిగ్నేచర్ ‘ట్రిపుల్ కెమెరా’ సెటప్‌ను అలాగే కొనసాగించనుంది. అయితే లీక్ అవుతున్న సమాచారం ప్రకారం.. ఫోన్ వెనుక భాగంలో ఉండే కెమెరా ‘ప్లాటూ’ లేదా మాడ్యూల్ గతంతో పోలిస్తే కొంచెం మందంగా మారే అవకాశం ఉంది. అలాగే, వెనుక గ్లాస్, ఫ్రేమ్ మధ్య వ్యత్యాసం తగ్గి, మరింత ‘సీమ్‌లెస్’ ఫినిషింగ్‌ను ఆపిల్ తీసుకురానుంది.

ఈ ఫోన్‌లో అత్యంత ఆకర్షణీయమైన అప్‌గ్రేడ్ ‘వేరియబుల్ ఎపర్చరు’ టెక్నాలజీ. ఇది ఐ ఫోన్లలో ఇదే మొదటిసారి. సాధారణంగా డిజిటల్ కెమెరాల్లో ఉండే ఈ ఫీచర్ ద్వారా, ఫోటో తీసేటప్పుడు లెన్స్‌లోంచి ఎంత కాంతి లోపలికి రావాలో మనం నియంత్రించవచ్చు. దీనివల్ల తక్కువ వెలుతురులో అద్భుతమైన ఫోటోలు రావడం, అలాగే బ్యాక్‌గ్రౌండ్ బ్లర్ మరింత సహజంగా ఉండటం జరుగుతుంది.

అదీ గాకుండా ఆపిల్ తన కెమెరా సెన్సార్ల కోసం ఇప్పటివరకు సోనీపై ఆధారపడేది. కానీ ఐఫోన్ 18 ప్రో కోసం శామ్‌సంగ్ తయారు చేసిన కొత్త ‘త్రీ-లేయర్ స్టాక్డ్ ఇమేజ్ సెన్సార్’ను వాడనున్నట్లు సమాచారం. ఈ సెన్సార్ వల్ల ఫోటోలలో నాయిస్ తగ్గి, డైనమిక్ రేంజ్ పెరుగుతుంది. దీంతో కెమెరా రెస్పాన్స్ టైమ్ వేగవంతం అవుతుంది. అలాగే, ప్రధాన కెమెరా 48 మెగాపిక్సెల్ ఫ్యూజన్ కెమెరాగా కొనసాగుతూనే, పైన పేర్కొన్న అధునాతన ఫీచర్లతో మెరుగైన అవుట్‌పుట్‌ను ఇస్తుంది.

ముందు భాగంలో ఉండే సెల్ఫీ కెమెరాను కూడా ఆపిల్ అప్‌గ్రేడ్ చేసే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఉన్న 18MP కెమెరా స్థానంలో కొత్త 24MP సెన్సార్ వచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇది వీడియో కాల్స్ మరియు తక్కువ వెలుతురులో సెల్ఫీలకు మరింత స్పష్టతను ఇస్తుంది. ఐఫోన్ 18 ప్రో రూపం మారకపోయినా, దాని కెమెరా సామర్థ్యం మాత్రం ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీకి మరింత దగ్గరగా వెళ్లనుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper