spot_img
Homeవింతలు-విశేషాలుWarangal: తవ్వకాల్లో బయటపడిన గుహ.. లోపలికి వెళ్లి చూస్తే అద్భుతం.. ఆశ్చర్యం..!

Warangal: తవ్వకాల్లో బయటపడిన గుహ.. లోపలికి వెళ్లి చూస్తే అద్భుతం.. ఆశ్చర్యం..!

Warangal: తెలంగాణను నిజాం కన్నా ముంద అనేక మంది రాజులు పాలించారు. వారిలో కాకతీయులు చాలా ముఖ్యం. మూడు శతాబ్దాలు తెలంగాణను పాలించిన కాకతీయులు ఇక్కడి సంస్కృతిని నలు దిశలకు విస్తరింపజేశారు. చరిత్ర సంస్కృతిపై చెరగని ముద్రలు వేశారు. హనుమకొండ, ఓరుగల్లును రాజధానులుగా చేసుకుని తెలంగాణను పాలించారు. తమ పాలన సమయంలో అనేక మంది కాకతీయ రాజులు శివాలయాలతోపాటు అనేక నిర్మాణాలు చేపట్టారు. ఇవి వారి అద్భుత కళా నైపుణ్యానికి నిదర్శనంగా నిలిచాయి. ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. వరంగల్‌లోని వెయ్యి స్తంభాల గుడి, రామప్ప గుడి, రామప్ప చెరువుతోపాటు కాకతీయుల కళాతోరణం వారి నిర్మాణ శైలికి, కళా నైపుణ్యానికి నిదర్శనం. గతేడాది నిర్మించిన అయోధ్య రామాలయంలో.. రామప్ప ఆలయ నిర్మాణానికి ఉపయోగించిన సాంకేతిక పరిజ్ఞానం వాడడం కాకతీయ కట్టడాల పటిష్టతను తెలియచేస్తుంది.

భూగర్భంలో ఆలయం..
కాకతీయుల నిర్మాణాల్లో ఒకటైన భూగర్భ ఆలయం ఇటీవల బయటపడింది.ఖిలా వరంగల్‌ ప్రాంతంలో ఇది ఉంది. ఖిలా వరంగల్‌ ప్రాంతం ఒకప్పటి కాకతీయుల రాజధాని. ఆనాటి కట్టడాలు చరిత్రకు సాక్ష్యాలుగా నిలుస్తాయి. ఖిలా వరంగల్‌ ప్రాంతంలోని మట్టి కోట ప్రాంతంలో భూగర్భంలో ఈ ఆలయాన్ని నిర్మించడం కాకతీయుల ప్రతిభకు అద్దం పడుతుంది. కొన్నేళ్ల క్రితం ఖిలా వరంగల్‌ మట్టికోట ప్రాంతంలో కేంద్ర పురావస్తు శాఖ తవ్వకాలు జరుపుతుండగా భూగర్భంలో ఈ ఆలయం బయటపడింది. మొదట సొరంగంగా భావించారు. తర్వాత లోపలికి వెళ్లి చూస్తే ఆశ్చర్యపోయారు. అద్భుతమైన త్రికుటాలయం వారికి కనిపించింది.

సైనికుల కోసం..
కాకతీయులు ఈ ఆలయాన్ని సైనికులు పూజలు చేసుకోవడానికి ఈ ఆలయాన్ని నిర్మించారని చరిత్రకారులు చెబుతున్నారు. ఈ ఆలయాన్ని లక్ష్మీపార్వతి ఆలయంగా పిలుస్తారు. రాజభవనాలకు సమీపంలో ఖిలా వరంగల్‌ ప్రాంతంలో వందలకు పైగా ఆలయాలను నిర్మించారు. సైనికులు ఈ ఆలయంలో పూజలు చేసుకోవడంతోపాటు సేద తీరేందుకు ఉపయోగించుకునేవారు. ఈ ఆలయంలో విష్ణువు, సూర్య భగవానుడు, శివలింగం కొలువై ఉండేవి. రజాకార్ల సమయంలో తవ్వకాలలో ఇవి ధ్వంసం అయ్యాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

SS Rajamouli

SS Rajamouli: రాజమౌళి ఘోస్ట్ డైరెక్టర్ గా చేసిన మూవీ ప్లాప్ అయిందా…

SS Rajamouli: దర్శక ధీరుడు రాజమౌళి చేసిన ప్రతి సినిమా అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టింది. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికి చేసిన అన్ని సినిమాలతో సక్సెస్ లను సాధించిన...
TTD

TTD: భక్తులకు టీటీడీ శుభవార్త.. ఇక తిరుమల భక్తుల కష్టాలు తీరినట్టే

TTD: కలియుగ వైకుంఠనాథుడు శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం మంచి వార్త అందించింది. పెద్ద మొత్తంలో విరాళాలు అందించి వీఐపీ బ్రేక్ దర్శనం పొందే...
Venkatesh Kalyan Ram Movie

Venkatesh Kalyan Ram Movie: అనిల్ రావిపూడి కి తెలియకుండా వెంకటేష్ – కళ్యాణ్ రామ్ ఎంజాయ్ చేస్తున్నారుగా…

Venkatesh Kalyan Ram Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో గొప్ప విజయాలను సాధిస్తున్న దర్శకులు చాలా తక్కువ మంది ఉన్నారు. ముఖ్యంగా కమర్షియల్ సినిమాలను చేస్తూ...
Bigg Boss Telugu

Bigg Boss 10 Telugu: ‘బిగ్ బాస్ 10’ ఆఫర్ పై జబర్దస్త్ బ్యూటీ హాట్ కామెంట్స్.. ఈ...

Bigg Boss 10 Telugu: సెప్టెంబర్ 6 న ఇండియా వైడ్ గా అన్ని భాషలకు సంబంధించిన బిగ్ బాస్ సీజన్స్ గ్రాండ్ గా లాంచ్ కాబోతున్నాయి. ముఖ్యంగా మన తెలుగు ఆడియన్స్...
Nagarjuna

Nagarjuna: నాగార్జున కొడుకుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడా…

Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని కీర్తి ప్రతిష్టలను తీసుకొచ్చిన వాళ్ళలో అక్కినేని నాగేశ్వరరావు ఒకరు. ఎన్నో అద్భుతమైన పాత్రలను పోషించి ప్రేక్షకులను మైమరపింపజేసిన ఆయన ఇతర ఇండస్ట్రీలో నుంచి ఎదురయ్యే...
Oktelugu Epaper