Warangal: దీనిని దారుణమనాలో..ఘోరం అనాలో అర్థం కావడం లేదు.. అసలు సమాజం ఇలా ఎందుకు మారుతుందో.. ఇటువంటి పెడ పోకడలకు ఎందుకు వెళ్తుందో అంతుపట్టడం లేదు. ఒక్కో ఘటన దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.. సభ్య సమాజంలో విస్మయాన్ని కలగజేస్తోంది. అయినప్పటికీ జనాలు మారడం లేదు. పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ మనుషుల్లో మార్పు రావడం లేదు.. తాజాగా వరంగల్ జిల్లాలో ఏనుమాముల ఇందిరమ్మ కాలనీలో దారుణాతీదారుణమైన ఘటన జరిగింది..
Also Read: మోడీ నిర్ణయం దేశ భవిష్యత్తును మార్చబోతోందా?
పెళ్లి చేసుకోవాలంటే ఈడు జోడు కావాలి. ప్రేమించుకోవాలంటే కూడా తక్కువ వయసు అంతరం ఉండాలి. కానీ ఈ ఘటనలో అతడికి 42.. ఆమెకు 22.. దాదాపు తన కూతురు లాంటి వయసు ఉన్న అమ్మాయితో అతడు సంబంధం పెట్టుకున్నాడు.. చివరికి వీరి జీవితం విషాదాంతమైంది. ఇనుమాముల ఇందిరమ్మ కాలనీ చెందిన గాయత్రి (22) ఇంటర్ చదివింది.. ఇంట్లోనే ఉంటున్నది. వీరి ఇంటికి ఎదురుంగా వేల్పుగొండ స్వామి (42) అనే వ్యక్తి డిసిఎం డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఇతడికి వివాహం జరిగింది.. ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు.
గాయత్రి ఇంటి వద్దే ఉండడం.. చూసేందుకు అందంగా ఉండడంతో స్వామి ఆమెపై కన్నేసాడు. ఆమెకు మాయమాటలు చెప్పాడు. డబ్బు ఆశ చూపించాడు. ఆమె అవసరాలకు డబ్బు ఇవ్వడం మొదలుపెట్టాడు. సులువుగానే ఆ యువతి అతని మాయమాటలకు పొంగిపోయింది. ఇదే అదునుగా ఆమెను అతడు లో లోబరుచుకున్నాడు.. తల్లిదండ్రులు లేని సమయంలో గాయత్రి వద్దకు వెళ్లి వస్తూ ఉండేవాడు. ఈ విషయం ఆమె తల్లిదండ్రులకు తెలిసింది. గాయత్రిని మందలించారు.. ఆ తర్వాత పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టారు. దీంతో స్వామి అక్కడి నుంచి తన కుటుంబంతో కలిసి హన్మకొండ వెళ్ళిపోయాడు.
హనుమకొండ వెళ్లినప్పటికీ స్వామి గాయత్రి తో మాట్లాడుతూనే ఉన్నాడు. తల్లిదండ్రులు లేని సమయంలో గాయత్రి అతడితో ఫోన్ మాట్లాడుతూ ఉండేది. ఈలో గానే గాయత్రి తల్లిదండ్రులు పెళ్లి ఖరారు చేశారు.. ఇంట్లో పదితులలో బంగారం, నగదు అందుబాటులో ఉంచారు.. అయితే గాయత్రి ఈనెల రెండవ తేదీన బంగారాన్ని, నాగార్జున తీసుకొని ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. వారిద్దరూ ముందుగా విజయవాడ, గుంటూరులో ఉన్నారు.. ఆ తర్వాత వేములవాడ వెళ్లి వివాహం చేసుకున్నారు.. అనంతరం అన్నారం వచ్చారు. ఒక గదిని అద్దె తీసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య తమ వివాహానికి సంబంధించిన చర్చ జరిగింది. ఈ బంధం నిలబడదని స్వామి ఆమెతో అన్నాడు. మొదట్లో కలిసి ఉందాం అని చెప్పిన ఆమె.. ఆ తర్వాత అతని మాటలతో ఏకీభవించింది. ఇద్దరూ చావాలనుకున్నారు. ఆమెను బలవన్మరణం దిశగా స్వామి ప్రేరేపించాడు.. దీంతో ఇద్దరు క్రిమిసంహారక మందు తాగారు. స్వామి మోతాదుకు మించి క్రిమిసంహారక మందు తాగడంతో అక్కడికక్కడే కన్నుమూశాడు.. గాయత్రి అపస్మారక స్థితిలో ఉండగా రూమ్ ఓనర్ వరంగల్ లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.. గాయత్రి తల్లిదండ్రులకు అతడు సమాచారం అందించాడు.. కూతురు పరిస్థితి రోదించారు. “నాన్నా నన్ను బతికించు” అని గాయత్రి ప్రాధేయపడింది. చివరికి చూస్తుండగానే ప్రాణాలు విడిచింది.
ఈ ఘటన ఉమ్మడి వరంగల్ జిల్లాలో సంచలనం సృష్టించింది. వాస్తవానికి ఇటీవల కాలంలో ఈ తరహా ఘటనలు పెరిగిపోతున్నాయి.. వయసు తో సంబంధం లేకుండా ఏర్పరచుకుంటున్న బంధాలు చివరికి ఇటువంటి విషాదాలకు దారి తీస్తున్నాయి.. పోలీసులు, మనస్తత్వ శాస్త్ర నిపుణులు ఎన్ని రకాలుగా చెప్పినప్పటికీ.. ఇటువంటి బంధాలు నిలబడమని స్పష్టం చేస్తున్నప్పటికీ చాలామంది మారడం లేదు. వయసు ఉద్రేకంలో చేయకూడని తప్పు చేస్తున్నారు. చివరికి ఇలా ప్రాణాలను తీసుకుంటూ కన్నవాళ్ళకు కంటిశోకాన్ని మిగుల్చుతున్నారు.