Homeబిజినెస్Jeetendra Property: 4.25 లక్షల పెట్టుబడి..450 కోట్లు వచ్చేశాయి.. అదృష్టం అంటే ఈయనదే పో

Jeetendra Property: 4.25 లక్షల పెట్టుబడి..450 కోట్లు వచ్చేశాయి.. అదృష్టం అంటే ఈయనదే పో

Jeetendra Property: ఈరోజుల్లో డబ్బులు ఎవరికి ఊరికే రావు. కష్టపడితే తప్ప పైసలు సంపాదించలేం. సంపాదించిన డబ్బులు సక్రమమైన మార్గాలలో పెట్టుబడి పెడితే దండిగా లాభాలు వస్తాయి. అప్పుడు మన సొమ్ము రెట్టింపు అవుతుంది. అయితే ఇటువంటి ఆలోచన చాలామందికి రాదు. ఒకవేళ వచ్చినా సరే సక్రమమైన విధానాలలో పెట్టుబడులు పెట్టకపోవడం వల్ల నష్టాలు ఎదురవుతుంటాయి. అయితే ఇతడు మాత్రం చాలా భిన్నంగా ఆలోచించాడు. ఆలోచించడం మాత్రమే కాదు.. పెట్టుబడిని చాలా వినూత్నంగా పెట్టాడు. ఫలితంగా లక్షల […]

Jeetendra Property: ఈరోజుల్లో డబ్బులు ఎవరికి ఊరికే రావు. కష్టపడితే తప్ప పైసలు సంపాదించలేం. సంపాదించిన డబ్బులు సక్రమమైన మార్గాలలో పెట్టుబడి పెడితే దండిగా లాభాలు వస్తాయి. అప్పుడు మన సొమ్ము రెట్టింపు అవుతుంది. అయితే ఇటువంటి ఆలోచన చాలామందికి రాదు. ఒకవేళ వచ్చినా సరే సక్రమమైన విధానాలలో పెట్టుబడులు పెట్టకపోవడం వల్ల నష్టాలు ఎదురవుతుంటాయి. అయితే ఇతడు మాత్రం చాలా భిన్నంగా ఆలోచించాడు. ఆలోచించడం మాత్రమే కాదు.. పెట్టుబడిని చాలా వినూత్నంగా పెట్టాడు. ఫలితంగా లక్షల నుంచి వందల కోట్లకు ఎదిగాడు. ఇప్పుడు ఇతడి గురించే దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

లక్షలు పెట్టుబడి పెట్టి.. ఏకంగా వందల కోట్లకు ఎదిగిన ఆ వ్యక్తి పేరు జితేంద్ర. ఈయన బాలీవుడ్లో సీనియర్ నటుడు. 1970, 80 కాలంలో ఇతడు అనేక సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. అప్పట్లోనే ఆయనకు తిరుగులేని స్టార్ డం ఉన్నప్పటికీ.. అది ఏ క్షణమైనా సరే ఫేడ్ అవుట్ అవుతుందని ఆయనకు తెలుసు. అందువల్లే ముంబై మహానగర అభివృద్ధిని ముందుగానే అంచనా వేసి.. ఆయన పాలి హిల్ అనే ప్రాంతంలో దాదాపు 3450 స్క్వేర్ ఫీట్ విస్తీర్ణమున్న బంగ్లాన్ని కొనుగోలు చేశాడు. నాడు దీనికి ఆయన 4.25 లక్షలు ఖర్చు పెట్టాడు. అప్పట్లో ఈ స్థాయిలో ఆయన డబ్బు పెడుతున్నప్పుడు చాలామంది ఆశ్చర్యపోయారు. జితేంద్రకు ఏమైనా పిచ్చా అనుకున్నారు. ఆ తర్వాత పరిస్థితి మారిపోయింది.

పాలీ హిల్ ప్రాంతం విపరీతంగా అభివృద్ధి చెందింది. ఎంతగా అంటే ఆయన కొనుగోలు చేసిన బంగ్లా ప్రాపర్టీ కూల్చేసి.. కొత్తది కడుతున్నప్పుడు.. పాత ఫర్నిచర్ అమ్ముతూనే దాదాపు 11.5 లక్షలు వచ్చాయి. అంతేకాదు ఇప్పుడు ఆ ప్రాపర్టీ విలువ ఏకంగా 450 కోట్లకు చేరుకుంది.. జితేంద్ర చేతుల్లో సినిమాలు లేనప్పుడు.. అవకాశాలు అంతగా లభించినప్పుడు చాలా ఇబ్బంది పడ్డారు. ఒక దశలో ఆ బంగారు అమ్మాలని అనుకున్నప్పటికీ.. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. చివరికి అదే సంకల్పంతో నిలబడ్డారు. అందువల్లే ఆ ప్రాపర్టీ ఈరోజుకు కూడా ఆయనకు ఒక కామ ధేనువు లాగా ఉంది. అందుకే బాలీవుడ్ సర్కిల్స్లో జితేంద్ర గురించి ఇప్పటికి గొప్పగానే చెప్పుకుంటారు. ఎందుకంటే పైసా పెట్టుబడి పెడితే ఈ స్థాయిలో లాభాలు రావడం అంటే మామూలు విషయం కాదు. ఎంతైనా భూమి అనేది బంగారం. దానిని సరేనా సమయంలో పెడితే అది అంతకు మించిన బంగారం.

పాలి హిల్ ప్రాంతంలో కొనుగోలు చేసిన తర్వాత.. అనేక ప్రాంతాలలో కూడా జితేంద్ర భూములు కొన్నారు. కాకపోతే పాలీహిల్ ప్రాంతంలో వచ్చినంత స్థాయిలో అక్కడ లాభాలు రాలేదు. కొన్ని సందర్భాలలో ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పుడు ఆయన మిగతా ప్రాంతాలలో భూములు కూడా అమ్ముకోవాల్సి వచ్చింది. కానీ పాలిహిల్ ప్రాంతం మీద ఆయనకు పూర్తిస్థాయిలో నమ్మకం ఉండడంతో ఆ భవనాన్ని అలాగే ఉంచుకున్నారు. అందువల్లే అవి ఏకంగా 450 కోట్ల విలువకు చేరుకుంది. పెట్టుబడి అనేది సరైన సమయంలో పెట్టాలి. సరైన ప్రాంతంలో పెట్టాలి. అప్పుడే మనం పెట్టిన పెట్టుబడికి సార్ధకత.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper